.
మొన్నటి వార్తే… ప్రపంచంలోని టాప్ -100 సిటీల్లో ఒకటిగా హైదరుాబాదుకు చోటు • 82వ స్థానం…
2026 ప్రపంచ అత్యుత్తమ నగరాల జాబితాలో నాలుగు భారతీయ నగరాలకు స్థానం…
Ads
వరల్డ్ టాప్ నగరాలను పక్కన పెడితే… ఇండియాలోని బెంగుళూరు 29వ ర్యాంకు, ముంబై 40వ ప్లేసు, ఢిల్లీ 54వ ప్లేసు… కాగా హైదరాబాదుకు 82వ ప్లేసు…
వరల్డ్స్ బెస్ట్ సిటీస్ రిపోర్టు సిద్ధం చేయడానికి రెసోనెన్స్ కన్సల్టెన్సీ- ఇప్సోస్ సంస్థ ప్రధానంగా 34 కేటగిరీలను పరిశీలించింది… లివబులిటీ, లవబులిటీ, ప్రాస్పరిటీని ప్రధానంగా తీసుకొని విశ్లేషించారు… ఈ అంతర్జాతీయ జాబితాలో ఇలా మొత్తం 276 నగరాలను గుర్తించగా.. భారత్ ప్రధాన నగరాలు నాలుగు టాప్ 100 లో ఉన్నాయి…
ఈ కన్సల్టెన్సీ ఏమని చెప్పిందంటే..? టెక్ ఎకోసిస్టం, విస్తరించిన కార్పొరేట్ బేస్ వల్ల బెంగళూరు నగరం ప్రపంచ గుర్తింపును సాధించింది… దేశ ఆర్థిక రాజధాని ముంబై 40వ స్థానంలో నిలిచింది… ఉద్యోగాలు, సాంస్కృతిక కార్యకలాపాలు, ఇన్నోవేషన్ కేంద్రంగా ముంబై ప్రాధాన్యం పెరుగుతోంది… రాజకీయ ప్రభావం, రవాణా కనెక్టివిటీ, అభివృద్ధి చెందుతున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆధారంగా ఢిల్లీ 54వ ర్యాంక్ లో నిలిచింది… పెరుగుతున్న టెక్నాలజీ విస్తరణ, ఐటీ సేవల కేంద్రంగా ఎదుగుతున్న కారణంగా హైదరాబాద్ 82వ ప్లేస్ లో నిలిచింది…
ఇదీ ఆ వార్తల సారాంశం… ఇక్కడ కొన్ని అంశాలు మనం మననం చేసుకోవాలి… వైఎస్ పీరియడ్… ఎంసీహెచ్ ఉండేది… మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్… చుట్టుపక్కల 12 మున్సిపాలిటీలను, పంచాయతీలను విలీనం చేసి జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేశారు… అలాగే హుడాను హెచ్ఎండీఏగా విస్తరించారు…
తద్వారా సిటీ డెవలప్‌మెంట్ ప్లానింగ్, నిధుల వ్యయం, సిటీ విస్తరణ, మౌలిక సదుపాయాలు పెరిగి జనం పెరిగారు, పెట్టుబడులు వచ్చాయి… శంషాబాద్ ఎయిర్‌పోర్టు, మెట్రో, ఓఆర్ఆర్, గోదావరి వాటర్ ఎట్సెట్రా హైదరాబాద్ రూపురేఖల్ని మార్చేశాయి… తరువాత ఏం జరిగింది..?
మళ్లీ జీహెచ్ఎంసీ చుట్టుపక్కల బోలెడు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ హయాంలో… దీంతో నగర పాలన అస్తవ్యస్తమైంది… మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది… ఇప్పుడు జీహెచ్ఎంసీలో 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను విలీనం చేస్తున్నారు… ఓఆర్ఆర్ వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధి ఇప్పుడు… గుడ్ గవర్నెన్స్, పౌరసేవల్లో నాణ్యత కోసం…
దీనివల్ల దేశంలోనే అతి పెద్ద మహానగరంగా భాగ్యనగరం మారబోతున్నది… నగర పరిధి దాదాపు 2,735 చదరపు కిలోమీటర్లు ఉండనుంది… జనాభా దాదాపు రెండు కోట్లు ఉంటుంది… ఇదెందుకు చెప్పుకుంటున్నాం అంటే… ఇదే Resonance Consultancy ఏ రెండేళ్లకో మూడేళ్లకో మళ్లీ రిపోర్టు ఇచ్చినప్పుడు హైదరాబాద్ 82వ స్థానం కాదు, టాప్ 20 లోకి వస్తుంది… ఎందుకో చెప్పుకుందాం కాస్త వివరంగా…
వర్తమాన ర్యాంకింగ్స్‌ను నిర్ణయించడానికి ప్రధానంగా మూడు విస్తృతమైన ప్రామాణికాలను (Categories) పరిగణనలోకి తీసుకున్నారు… హైదరాబాద్ కోణంలో…
1. Prosperity (శ్రేయస్సు/ఆర్థిక బలం)…. ఒక నగరం ఆర్థిక వృద్ధి, వ్యాపార పర్యావరణ వ్యవస్థ బలాన్ని కొలవడానికి ఈ కేటగిరీ ఉపయోగపడుతుంది…
-
Large Companies: నగరంలో ప్రధాన కార్యాలయాలు ఉన్న పెద్ద కంపెనీల సంఖ్య (ఉదాహరణకు Fortune 500 కంపెనీలు)… అనేక పెద్ద కంపెనీలు, తద్వారా జాబ్ అపర్చునిటీస్…
-
Business Ecosystem: స్టార్టప్‌లు, ఆవిష్కరణ కేంద్రాలు (T-Hub వంటివి) పెట్టుబడుల వాతావరణం.
-
Economic Output (GDP): మొత్తం ఆర్థిక ఉత్పత్తి.
-
University: ప్రముఖ విశ్వవిద్యాలయాల ఉనికి.
-
Airports: విమానాశ్రయ సౌకర్యాలు.
-
ఉద్యోగావకాశాలు, నిరుద్యోగిత రేటు, అందుబాటులో నాణ్యమైన మానవ వనరులు
2. Lovability (ప్రియమైన అనుభూతి/జీవిత నాణ్యత)…. నగరంలో నివసించే, సందర్శించే వ్యక్తులకు లభించే జీవన నాణ్యత, సంస్కృతి, సామాజిక వాతావరణాన్ని ఈ కేటగిరీ అంచనా వేస్తుంది…
-
Sights & Landmarks: చార్మినార్, గోల్కొండ కోట వంటి చారిత్రక ప్రదేశాలు, మైలురాళ్లు (landmarks)… (ఈ ఉప-వర్గంలో హైదరాబాద్ ప్రపంచంలోనే టాప్ 25లో ఉంది)…
-
Culture: సాంస్కృతిక వైవిధ్యం, ప్రదర్శన వేదికలు… నార్త్, సౌత్ సంస్కృతులన్నింటికీ మంచి మేళవింపు ఇది…
-
Dining/Food: ఆహార సంస్కృతి (హైదరాబాదీ బిర్యానీ వంటి వాటితో మంచి ర్యాంక్ ఉంది)… ఇక్కడ దొరకని ఫుడ్ లేదు…
-
Nightlife: రాత్రిపూట వినోదం, జీవనశైలి… హైదరాబాద్ ఎప్పుడూ నిద్రపోదు…
-
Price-to-Income Ratio: జీవన వ్యయం (Affordability) (ఈ విషయంలో హైదరాబాద్ టాప్ 7లో ఉంది)…
-
Safety: భద్రతా ప్రమాణాలు…
3. Livability (నివాసయోగ్యత/పర్యావరణం)
నగరం మౌలిక సదుపాయాలు (Infrastructure), భౌగోళిక వాతావరణం, పర్యావరణం నాణ్యతను ఇది కొలుస్తుంది…
-
Infrastructure: రోడ్లు, ప్రజా రవాణా (Metro), గృహ నాణ్యత, ఇంధనం, నీరు, టెలికమ్యూనికేషన్స్ నాణ్యత…
-
Walkability/Biking: నడవడానికి, సైక్లింగ్ చేయడానికి అనుకూలత….
-
Weather: వాతావరణం… దేశంలోని అన్ని ప్రధాన నగరాలకన్నా దేహానుకూల వాతావరణం హైదరాబాద్ ప్రత్యేకత… ఒక్కసారి ఇక్కడికి వచ్చినవాడు ఇక దీన్ని వదిలిపోడు…
-
Green Spaces & Parks: పచ్చదనం, పార్కుల లభ్యత.
హైదరాబాద్‌కు ఈ ర్యాంకు రావడానికి ముఖ్యంగా ఐటీ, లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో ఉన్న బలం, చార్మినార్, గోల్కొండ వంటి సాంస్కృతిక వారసత్వం, మౌలిక సదుపాయాల విస్తరణ, తక్కువ జీవన వ్యయం దోహదపడ్డాయి…
ఒక్కసారి హైదరాబాదుకన్నా మంచి ర్యాంకుల్లో ఉన్న ప్రధాన నగరాలను చూద్దాం…
1) బెంగుళూరు… ఒకప్పుడు ఉద్యాననగరి… ఆహ్లాదకర వాతావరణం… కానీ ఇప్పుడు, జనంతో కిటకిట, తోటలు మాయం… ట్రాఫిక్ ఓ నరకం… అధిక జీవనవ్యయం… వేడి పెరిగింది… పైగా కన్నడ భాషోన్మాదంతో ఇతర ప్రజలకు అసౌకర్యం, భయం…
2) ఢిల్లీ… ఇది మరో రకం నరకం… వాతావరణం అత్యంత కాలుష్యం, చలికాలంలో భరించలేం, గాలి నాణ్యత ప్రమాదకరం… అత్యంత జనసాంద్రత, భరించలేని ట్రాఫిక్… నార్త్ కల్చర్, పంజాబీ కల్చర్… పొలిటికల్ ఆందోళనలు, రోడ్ బ్లాకింగ్స్, ఉద్రిక్తతలు… జీవనవ్యయం చెప్పనక్కర్లేదు…
3) ముంబై… దీనికి మైనస్ హ్యుమిడిటీ… సముద్రం పక్కనే ఉండటం వల్ల… స్లమ్స్ ఎక్కువ… భారీ వర్షాలు వస్తే సముద్రంలోకి నీరు పోలేక వీథులు కాలువలు అయిపోతాయి… ఆర్థిక రాజధానే కానీ వర్తమానంలో ఎక్కువ ఉపాధి అవకాశాలున్న ఐటీ, ఫార్మ రంగాల్లో ముంబై వీక్… ట్రాఫిక్ సరేసరి.,. జీవనవ్యయం మరీ అధికం…
సో, హైదరాబాద్ బెటర్… ఎస్, ఇక్కడా చినుకులు పడితే ట్రాఫిక్ ఇక్కట్లున్నాయి… అదొక్కటే… రాబోయే ఫ్యూచర్ సిటీతో ఉపాధి అవకాశాలు ఇంకా పెరిగి, కోర్ హైదరాబాద్ సిటీలో రద్దీ తగ్గొచ్చు… మూసీ పునరుజ్జీవం మరో కీలకమైన నిర్ణయం… పారిశ్రామికవాడల్ని తరలించడం మరో కీలకనిర్ణయం… అన్నింటికీ మించి హైదరాబాద్ కులాలు, మతాలు, ప్రాంతాలు, సంస్కృతుల బేధం లేకుండా అందరినీ కలుపుకుంటుంది… అదీ అసలు బలం… ఎస్, రాబోయే రోజుల్లో ఇండియాలోకెల్లా అసలైన లవబుల్, లివబుల్ విశ్వనగరం హైదరాబాదే..!!
Share this Article