Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అవునూ సీఎం గారూ… ఆ బుల్‌డోజర్ ఆ జన్వాడ ఫామ్‌హౌజు వైపూ వెళ్తుందా..?!

August 24, 2024 by M S R

వీటిని కూల్చే దమ్ముందా..? అని రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ కరపత్రిక నమస్తే తెలంగాణ పేజీల కొద్దీ అక్రమ నిర్మాణాల ఫోటోలు, వివరాలు ప్రచురించింది… కానీ అది జనంలోకి నెగెటివ్‌గా, కౌంటర్ ప్రొడక్ట్‌గా వెళ్తుందని ఫాఫం ఊహించలేదు…

నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కేటీయార్‌కు ఓ జవాబు ఇచ్చాడు… నా ఫామ్ హౌజు ఎఫ్‌టీఎల్ పరిధిలోకి గానీ, బఫర్ జోన్‌లోకి గానీ వస్తే… పది టేపులు పట్టుకురండి, కొలుద్దాం, నాలుగు జేసీబీలు పెట్టి కూల్చేద్దాం అన్నాడు… అంతేకాదు, కేటీయార్ జన్వాడ ఫామ్ హౌజు నీది కాదు అంటున్నావు, నీ మిత్రుడిది అంటున్నావు కదా, మరి రేవంత్ రెడ్డి డ్రోన్‌తో ఫోటోలు తీస్తే నువ్వెందుకు కేసు పెట్టావు అనడిగాడు…

నిజమే… నా పేరు మీద లేదు అంటున్నాడు కేటీయార్… అంటే ఎవరి పేరు మీదో ఉంది… ఈ బినామీ వ్యవహారాలు కొత్తేమీ కాదు గానీ… అంత హడావుడిగా ఆ కేటీయార్ మిత్రుడు కోర్టుకు ఎందుకు పోయినట్టు..? కోర్టు కూడా స్టే ఇవ్వకపోవడంతో కేటీయార్ క్యాాంపు ఇక ఓ డిఫరెంట్ స్ట్రాటజీతో… ఫలానా ఫలానా పెద్ద మనుషుల అక్రమ నిర్మాణాలు కూల్చేస్తావా మరి అని పేజీల కొద్దీ రాసింది… అందులో మొన్నమొన్నటివరకూ బీఆర్ఎస్ శిబిరంలోనే పెత్తనాలు వెలగబెట్టినవాళ్లున్నారు…

Ads

అంటే, తమ హయాంలోనే నిర్మాణాలు జరిగాయనో, మనవాళ్లు కాబట్టే వాటి జోలికి పోలేదనో, అక్రమ నిర్మాణాలను ఉపేక్షించామనో పరోక్షంగా తనే అంగీకరిస్తున్నట్టు కదా… పైగా ఆ పేజీల కొద్దీ కథనంలో అంతా కాంగ్రెసోళ్ల నిర్మాణాలే పేర్కొన్నారు… ఫాఫం, బీఆర్ఎస్ వాళ్లు శుద్దపూసలు అయినట్టు… దాంతో పత్రిక క్రెడిబులిటీ, పార్టీ క్రెడిబులిటీ (??) మూసీలో కలిసిపోయింది… రేప్పొద్దున బీఆర్ఎస్ ముఖ్యల అక్రమ నిర్మాణాల జాబితా గనుక కాంగ్రెస్ రిలీజ్ చేస్తే..?

ఇప్పుడు 111 జీవో పవిత్రం అన్నట్టు రాసుకొస్తున్నారు… మరి అదే జీవోను భ్రష్టుపట్టించి, మూసీలో నిమజ్జనం చేసేసి, ఆ ప్రాంతంలో యథేచ్ఛగా నిర్మాణాలకు వోకే అని పరోక్షంగా మద్దతు ఇచ్చింది, రియల్ ఎస్టేట్ పెంచే ప్రయత్నం చేసింది, జంట జలాశయాలను మరింత నాశనం చేసే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా… ఇవన్నీ దాచి, రేవంత్ రెడ్డి మీద నిరంతరం జరిపే దాడిలో భాగంగా… నిన్న కేటీయార్ సోషల్ మీడియా శిబిరం కావచ్చు… హైడ్రా మీద అధిష్టానం కస్సుమన్నదనీ, అక్షింతలు వేసిందనీ రాసుకొచ్చింది…

అంతేనా..? సుంకిశాల విషయంలోనూ జలమండలి ఘోరం, పాపం అని రాసినట్టే… ఈ అక్రమ నిర్మాణాలు మునగకుండా జలమండలే తప్పిదానికి పాల్పడ్డట్టు రాసుకొచ్చింది… జలమండలి మొన్నమొన్నటివరకూ తొమ్మిదిన్నరేళ్లు ఎవరి ప్రభుత్వ పరిధిలో ఉంది మాస్టారూ..? అంటే ఎవరిది తప్పు..?

nagarjuna

తీరా చూస్తే తెల్లారే అంతటి నాగార్జున ఎన్ కన్వెన్షన్ మీదకు బుల్‌డోజర్ నడిచింది… అదే ఈ ఫోటో… అధిష్టానం అక్షింతలు వేస్తే… ఈ దూకుడు ఎందుకు కొనసాగుతున్నది మరి..? ఇన్నేళ్లూ ఆ ఎన్ కన్వెన్షన్ విషయంలో కాంప్రమైజ్ అయ్యింది ఎవరు..? ఎలా..? అంటే ఇక్కడా బీఆర్ఎసే కదా బదనాం అవుతున్నది… (ఈ కన్వెన్షన్ సెంటర్ విలువ 600 కోట్లు అట, ఈ తుమ్మిడి చెరువు కబ్జా నిర్మాణంపై 300 కోట్ల రుణమూ తీసుకున్నాడని టాక్…)

ఎస్, హైడ్రా రంగనాథ్‌కు మంచి పేరే ఉంది… ఐనా సరే, ఫలానా ఇన్‌ఫ్రా కంపెనీతో డీల్ కుదిరింది, రేవంత్ రెడ్డి స్వయంగా డీల్ చేశాడు వంటి ప్రచారాలు మొదలయ్యాయి… సహజమే… రంగనాథ్‌ను డిమోరల్ చేసే ప్రయత్నం జరుగుతుంది… రాజకీయాల్లో సహజమే… కాంగ్రెస్‌లోనే హైడ్రా దూకుడు మీద అసంతృప్తి ఉంది… అంటే వాళ్ల నిర్మాణాలూ నేలమట్టం అవుతున్నట్టే కదా… అంటే హైడ్రా సరైన దారిలో వెళ్తున్నట్టే కదా…

బయట జనం ఏమంటున్నారు..? ఇన్నేళ్లుగా నీటివనరులను చెరబట్టి, కబ్జాలు చేసి, ఇష్టారీతిన అక్రమంగా నిర్మాణాలు చేపట్టినవి కొన్ని నేలకూలినా న్యాయమే కదా… అవి ఏ పార్టీవి అయితేనేం..? ఇదీ జనాభిప్రాయం… జన్వాడ ఫామ్ హౌజ్ జోలికి రేవంత్ రెడ్డి రాకుండా ఏవేవే ప్రయత్నాలు చేస్తున్నా సరే, అవి పరోక్షంగా జనంలోకి బీఆర్ఎస్ మీదే నెగెటివ్‌గా వెళ్తున్నమాట నిజం…

అన్నట్టు… నాగార్జున గారూ… కొడుక్కి, శోభితకు ఎంగేజ్‌మెంట్ కాగానే ఈ తల్నొప్పి ఏమిటని చింతించి, పాపం, ఆమె మీద ఐరన్ లెగ్ ముద్ర వేసి, భగ్నం చేయకండి బంధాన్ని… అసలే చైతూ-శోభిత ఎంగేజ్‌మెంట్ అనంతరం వుమెన్ కమిషన్, వేణుస్వామి, మీడియా సిండికేట్ల వ్యవహారాలే సొసైటీకి ఓ తలనొప్పిగా మారాయి… (చివరి పేరా మాత్రం సరదాగా…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions