రామోజీరావు ఎదిగాడు… మల్లెమాల శ్యాంప్రసాదరెడ్డి ఎదిగాడు… హైపర్ ఆది ఎదిగాడు… రోజా ఎదిగింది… మొత్తానికి తెలుగు టీవీ కామెడీ కూడా ఎదిగింది… వాళ్ల అభిరుచులకు అద్దం పడుతూ, మరింత దుర్గంధాన్ని వెదజల్లుతూ ఈటీవీ తొలి తెలుగు ‘ఏ’ గ్రేడ్ చానెల్‌గా… లేదా ట్రిపుల్ ఎక్స్ చానెల్‌గా దూసుకుపోతోంది… ఈ నర్మగర్భ బూతులు దేనికి..? ఈ గర్భమర్మ పంచులు దేనికి..? తెల్లారిలేస్తే అక్రమ సంబంధాలు, ఆడవేషగాళ్ల పైత్యాలు దేనికని… ఇప్పుడు ఇంకాస్త డైరెక్టు బూతుల్లోకే వెళ్లిపోతున్నారు… అన్నీ విడిచిపెట్టాక, ఇంకా సగం సగం దాచిపెట్టుకోవడం, అర్థం గాకుండా చూపెట్టడం దేనికి..? అందుకే ఇన్నాళ్లూ ఒకటీరెండు పెగ్గుల భాషలో ఉన్న స్కిట్లను మూణ్నాలుగు పెగ్గుల భాషలోకి తీసుకెళ్లిపోతున్నారు… తాజా ఉదాహరణ ఏమిటంటే..?
18న రాబోయే ఎక్సట్రా జబర్దస్త్… అసలు జబర్దస్త్ అంటేనే వెగటు కామెడీ, బూతుప్రవాహం, ధారాళమైన వెకిలితనం అని అందరికీ తెలిసిందే కదా… ఈ స్పెషల్ స్కిట్లో హైపర్ ఆది తొలుత రష్మీతో వచ్చీరాని పిచ్చి స్టెప్పులేవో వేశాడు… ఆమె తన కుర్చీ వైపు వెళ్లిపోతూ, చాలా, కోరికలు తీరాయా, నేను వెళ్లిపోవచ్చా అంటుంది… (ఆమెతో కలిసి స్టెప్పులేయడం ఆది కోరిక..!!)… ఆమెకు మంచం చూపిస్తూ, మీరెళ్లిపోవచ్చు, ఇక్కడ వేరే కార్యక్రమం ఉంది, దానికి మీరెందుకు అంటాడు ఆది… తరువాత తన భార్య పాత్రవేషధారిని పిలుస్తాడు… ఆమెను చూసి జడుసుకుని ఆది మంచం కింద దూరిపోతాడు… ఏమండీ, నేను వంగలేను, బయటికి రండి అంటాడా ఆ ఆడవేషధారి… నువ్వు వంగలేవు, బయటికి వస్తే నేను అని ఆది అర్థంతరంగా ఆపేస్తాడు… తరువాత పదం మీకు అర్థమైంది కదా… అబ్బో, రోజా పడీపడీ నవ్వులు, ఆ రష్మిని వదిలేయండి… ఏమండీ, ప్లీజ్ రండి అంటూ భార్య పిలుపు… ఈరోజు ఏం వారం అంటాడు తను… మంగళవారం అని చెప్పగానే… అవదు అని ఆది అసహాయంగా జవాబు… సీక్వెన్స్ ఏమిటో, అర్థం ఏమిటో మీకూ అర్థమయ్యే ఉంటుంది కదా… రోజా అయితే పడీపడీ నవ్వింది…
Ads
మరో స్కిట్లో ఎక్కడో… శాంతి అని పిలవబడే ఓ సీనియర్ ఆడవేషధారి, ఆది… ఇంకా ఎవరెవరో ఉంటారు… మొన్న ఎవరో ఒకాయన నన్ను చూసి చేయి కోసుకున్నాడు తెలుసా అంటుంది ఈ పాత్ర… నిన్ను దూరం నుంచి చూసి చేయి కోసుకున్నాడు, దగ్గర నుంచి చూసి ఉంటే ‘ఉప్పెనే’ అంటాడు ఆది… ఇదీ అర్థమైంది కదా… ఈమధ్య ఆది స్కిట్లలో అంతా ఇలాగే… ఒకప్పుడు ఆది స్కిట్ అంటే అదుర్స్… డైలాగ్ అవ్వగానే ఓ పిచ్చి నవ్వడం వంటి అవలక్షణాలున్నా సరే, ఆ పంచులు బ్రహ్మాండంగా పేలేవి… టీవీ కామెడీ వీడియోల్లో టాప్‌లో ఉండేవి… పెద్దగా అసభ్యత జోలికి కూడా పోయేవాడు కాదు… కానీ ఇప్పుడు..? ఆ స్కిట్లలో మెరుపు పోయింది… ఆమధ్య ప్రతి వారం ఎవరో ఓ కొత్త లేడీ కేరక్టర్‌ను తీసుకొచ్చేవాడు… అదీ పెద్దగా వర్కవుట్ కాలేదు… ఒకటీఅరా పంచు కష్టమ్మీద రాసుకుంటే రోజా దాన్ని ముందే కక్కేసి, స్కిట్ ప్రాణం తీసేస్తోంది… ఇక ఆ ఢీ డాన్స్ షో కామెడీ బిట్లలోనూ ఆది తెగ విసిగిస్తున్నాడు, గతంలో రష్మి, సుధీర్, ప్రదీప్ ముగ్గురే ఉన్నప్పుడు కూడా బాగా పేలేవి… ఇప్పుడు దీపిక పిల్లిలో స్పాంటేనిటీ లేదు, ఆది సరేసరి… ఇక్కడ కూడా తరచూ “మింగుడు ” భాష వాడుతున్నాడు… ఈటీవీ వాళ్ల ప్రతి షోలోనూ కనిపిస్తున్నాడు సరే… కానీ ఒకప్పటి ఆది ఇప్పుడు లేడు… ఆ ఫ్రస్ట్రేషన్లో పడి, మునిగి… ఇలా డైరెక్ట్ బూతును ఆశ్రయిస్తున్నాడా..? ఫాఫం, హైపర్ ఆది..!!
Share this Article