కొన్ని వార్తలు… యూట్యూబ్ చానెళ్లు ప్లస్ కొన్ని పెద్ద టీవీల న్యూస్ సైట్లలో కూడా… హైపర్ ఆదికి ఏమైంది..? ఢీ షోను విడిచిపెట్టాడా..? ఆది లేకుండానే ఢీ షో… శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోనూ ఆది లేడు… ఈటీవీకి బైబై చెబుతున్నట్టేనా..? ఇలా థంబ్ నెయిల్స్ పెట్టి వార్తలు కుమ్మేశారు… నిజానికి టీవీ షోలకు సంబంధించి హైపర్ ఆది పాపులారిటీ బీభత్సంగానే ఉంటుంది… ప్రదీప్, సుడిగాలి సుధీర్‌కు దీటుగా ఆది నిలబడతాడు… అయితే తను తోటి హోస్టులు, యాంకర్లు, కమెడియన్ల పట్ల స్కిట్లలో, షోలలో ప్రదర్శించే ధోరణే పెద్ద చికాకు…
ఎదుటివాళ్లను చీప్‌గా చూడటం, గుచ్చినట్టు పంచులు వేయడం… దాదాపు ర్యాగింగ్ చేస్తున్నట్టుగా ఉంటుంది యవ్వారం… వాళ్లు ఎంత హర్ట్ అవుతారనేది తనకు సోయి ఉండదు ప్లస్ తను ఎక్కడి నుంచి కెరీర్ స్టార్ట్ చేశాడనే ఆత్మసమీక్ష కూడా ఉండదు… తను పంచులు వేయని ఏకైక టీవీ కేరక్టర్ ప్రదీప్ ఒక్కడే కావొచ్చు… వేస్తే రివర్స్ పంచులు ఎలా ఉంటాయో అర్థమైనట్టుంది, లేదా ప్రదీప్ సీనియారిటీ, టీవీ ఇండస్ట్రీ మీద గ్రిప్ ఆదిని వెనక్కి లాగుతుంటాయేమో… సుధీర్ మీద వేస్తుంటాడు, సుధీర్ తనకు అలవాటైన రీతిలో దులిపేసుకుంటాడు…
ఒక ఉదాహరణ… ఈటీవీలో ఢీ షో దగ్గరకే వెళ్దాం… ఏదో పని ఉండి తను ఒక వారం ఈటీవీ, మల్లెమాల టీంలకు అందుబాటులో లేడు… దాంతో శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలలో పాల్గొనలేదు… తనేమీ మల్లెమాలను విడిచిపెట్టలేదు… నిక్కచ్చిగా చెప్పాలంటే ఆ సంస్థపై ఆది గ్రిప్ పెరిగింది… తను చెప్పినట్టే నడుస్తున్నయ్ వ్యవహారాలు…
Ads
ఢీషోలో అఖిల్ సార్థక్ కూడా ఓ మెంటార్‌గా ఆర్ టీంటీడర్‌గా ఉన్నాడు తెలుసు కదా… తను బిగ్‌బాస్ గత సీజన్ రన్నరప్… ఏ కంట్రాక్టు గొడవలూ లేకుండానే ఢీ షోలో అడుగుపెట్టాడు… నిజానికి తనకు ఆ షోలోని కామెడీ స్కిట్స్ ఫిట్ కావు… ఈలోపు బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ ఆఫర్ వచ్చింది… వెంటనే వెళ్లిపోయాడు… ఖేల్ ఖతం… అయితే తను వెళ్లడానికి ముందు చేసిన ఎపిసోడ్‌లో ఆది లేడు… అందరూ హమ్మయ్య అనుకుంటూ ఉన్నారు… తన పంచులకు అందరూ బాధితులే కదా…
ఢీ నుంచి వెళ్లిపోయాడు అనే ప్రచారానికి విరుగుడు అన్నట్టుగా ఎపిసోడ్ చివరలో వచ్చి, ఏవో నాలుగు పంచులు, గెంతులు వేయబోయాడు… అయితే అభ్యంతరకరం ఏమిటంటే..? ఎపిసోడ్ చివరలో ప్రదీప్ సరదాగా, ఉడికించాలని జూనియర్స్ టీంలీడర్ అఖిల్ అని పరిచయం చేస్తుంటాడు, మీకు అభ్యంతరం లేదు కదా, వోకేనా నీకు అని అడుగుతాడు… ఆది నవ్వుతూ వెటకారంగా ‘‘ఉంటే ఏమిటి..? లేకపోతే ఏమిటి..?’’ అని వ్యాఖ్యానించాడు…
అఖిల్ ఆ ఎపిసోడ్‌లో ఎలా వ్యవహరిస్తున్నాడు అని జడ్జ్ చేయాల్సింది ఆది కాదు… తనకు పేమెంట్స్ ఇచ్చేదీ ఆది కాదు… తనేమీ షో నిర్మాత కాదు, కనీసం మేనేజర్ కూడా కాదు… ప్రదీప్‌లాగా యాంకర్ కూడా కాదు… మరి తనెందుకు ఆ కామెంట్ చేసినట్టు..? తనను ఎంచుకున్నది మల్లెమాల టీం, నిర్మాత… అంటే వాళ్ల ఎంపికను ఆది వెక్కిరిస్తున్నాడా..? అది అఖిల్‌ను అవమానించినట్టే… అఫ్‌కోర్స్, ఆది చాలామందిని అలాగే వెక్కిరిస్తుంటాడు…
ఆ సమయంలో ప్రదీప్ కూడా పడీ పడీ నవ్వడం కూడా చిల్లరగా ఉంది… అఖిల్ సార్థక్ ఆ షోకు ఫిట్ కాడేమో, కానీ అసమర్థుడు కాదు… ఆది, ప్రదీప్… మీ ప్రవర్తన తప్పు..!! మీరు ఇప్పుడు తోపులు కావచ్చు, కానీ ఒకప్పుడు..!? అదిరె అభి టీంలో చేరడానికి పడిగాపులు పడ్డ రోజులున్నయ్ ఆదీ…!! పిచ్చి వేషం వేసుకుని డాన్స్ పోటీల్లో దేభ్యం మొహం వేసుకుని ఆడిన రోజులు ప్రదీప్‌కూ ఉన్నయ్…!! ఏమాటకామాట… ఆది లేకపోతే ఆ ఢీ ఎపిసోడ్లకు వచ్చిన నష్టమేమీ లేదు, పైగా ప్రదీప్ ఒక్కడే స్పాంటేనియస్‌గా కంటెస్టెంట్లను వేదిక మీదకు పిలిచి, తన కామెడీ పంచులతో సరదాగా కథ నడిపించేశాడు… అదే బాగుంది నిజానికి…!!
Share this Article