సాధారణంగా తెలుగు టీవీ తెర మీద సుడిగాలి సుధీర్ తరువాత ఆ రేంజ్ పాపులారిటీని కమెడియన్‌గా సంపాదించుకున్నది హైపర్ ఆది… తను స్వయంగా పంచులు రాసుకుంటాడు… అటు ఢీ షోలో ఏవో పంచ్ డైలాగులు, ఇటు జబర్దస్త్ స్కిట్‌కు పంచులు… కొత్తగా ఏం రాయాలో అర్థం అవుతున్నట్టు లేదు… అందుకే ఏదిపడితే అది రాసేసుకుంటున్నాడు… బూతులు, ద్వంద్వార్థాలను నమ్ముకుంటున్నాడు… అవి పలుసార్లు శృతి తప్పుతున్నయ్… మరీ జబర్దస్త్ ఎంత బూతు షో అయితేనేం, మరీ ఈ రేంజ్ అవసరమా అన్నట్టుగా ఉంటున్నయ్… కొన్నిసార్లు రోజా కూడా తల పట్టుకుంటున్నదీ అంటే అర్థం చేసుకోవచ్చు…
గురువారం ఓ షో… దానికి జీవిత, రాజశేఖర్ గెస్టులుగా వచ్చారు… తమ కొత్త సినిమా శేఖర్ సినిమా ప్రమోషన్ కోసం వచ్చారు… మామూలుగా టీవీ షోలన్నీ ఇలా ప్రమోషన్స్ చేస్తున్నయ్… చివరకు జబర్దస్త్ షోలో కూడా సినిమా ప్రమోషన్స్ అంటే కాస్త విచిత్రంగా ఉంది… అయితే ప్రమోషన్ కోసం వచ్చిన వాళ్లు గెస్టులుగా షోలో కొద్దిసేపు కూర్చుంటారు, స్కిట్స్ చూస్తారు, చప్పట్లు కొడతారు, మెచ్చుకుంటారు, తమ గురించి చెప్పుకుంటారు, అదేదో రొటీన్ ప్రిరిలీజ్ ఫంక్షన్ తరహాలో సాగుతుంది…
కానీ ఈ షో మరీ ‘అతి’గా అనిపించింది… ప్రతి స్కిట్‌లో కమెడియన్లు డాన్సులు, అవీ రాజశేఖర్ సినిమాల పాటలు… ప్రతి స్కిట్‌లో రాజశేఖర్ సినిమాల పేర్లతో డైలాగులు… మొత్తం రాజశేఖర్‌నే చూపించడానికి ప్రయత్నించారు… మరీ ఆ ఇమిటేషన్ తంతు ఓవర్ యాక్షన్ అనిపించింది… సరే, రాజశేఖర్ మాత్రం హుందాగా, ఎపిసోడ్ చివరలో… ప్రతి ఒక్కరూ తనను ఇమిటేట్ చేయడం తనను ఆనర్ చేసినట్టే భావిస్తాను అని స్పోర్టివ్‌గా తీసుకున్నాడు… అది బాగుంది… (ఏమాటకామాట ఈ ఎపిసోడ్‌లో ఆది స్కిట్‌ను ఫైమా స్కిట్ డామినేట్ చేసింది… ఆమె ఎనర్జీ, టైమింగ్ ముందు మిగతా వాళ్లంతా వెలవెలబోతున్నారు…)
Ads
ఓ ఆది స్కిట్ గురించి చెప్పాలి కదా… నలుగురికి శోభనం స్కిట్… ఇంకేముంది..? ఆది చెలరేగిపోయాడు… మధ్యలో ఓసారి అనసూయతో ఓ ప్రశ్న అడిగించాడు… ఆది అడిగాక అనసూయ నో అనే ప్రసక్తే ఉండదు కదా… అనసూయ అడుగుతుంది… ‘‘నాకెప్పట్నుంచో ఒక డౌటు, శోభనం గదిలో ఫ్రూట్స్ ఎందుకు పెడతారు..?’’ ఆది అంటాడు ఇలా… ‘‘తినాలనుకున్నవి తినలేక, దొరికినవి తిన్నా సంతృప్తి లేక, ఇక సర్లే, ఏవో ఒకటి అనుకుని మిగిలినవి తినడానికి ఫ్రూట్స్ పెడతారు…’’ ఇందులో డబుల్ మీనింగ్ అర్థం చేసుకున్నవాళ్లకు అర్థం చేసుకున్నంత… ఆ ఘాటుకు అనసూయ ఇక కిక్కుమనలేదు, సైలెట్… రోజా తలకొట్టుకుంది… మనో ఛిఛీ అంటూ అదోరకంగా సిగ్గుపడిపోయాడు… వాళ్లే ఇబ్బందిపడిన ఆ స్కిట్ యథాతథంగా ఎందుకు ప్రసారం చేసినట్టు మరి అంటారా..? బేసిక్‌గా ఆ జబర్దస్త్ ఫ్యాబ్రికే అది…
ముందుగా నలుగురు లేడీ కేరక్టర్లు, తరువాత ముసలి కేరక్టర్లు, ఆ తరువాత లేడీ గెటప్స్, చివరగా థర్డ్ జెండర్ గెటప్స్ వస్తారు…
ఆమాత్రం దానికి లైట్లు ఆర్పడం దేనికి..?
ఎప్పుడూ తింటాను తింటాను అనడమే గానీ ఇప్పుడు తినొచ్చు కదా,
మంచం మీద వేస్తావా..? ఆల్ రెడీ మీరు మంచాన పడ్డారు, మిమ్మల్ని ఎవడే మంచం మీద పడేసేది…
సరే గానీ, వచ్చి బెడ్లెక్కండి…
ఇలాంటి డైలాగ్సే అన్నీ… నిజానికి దాదాపు 17, 18 మందితో కూడిన స్కిట్… అన్ని కేరక్టర్లతో ఒక కామెడీ స్కిట్ కష్టమే, కానీ బాగా చేశారు, ఎటొచ్చీ స్కిట్ మొత్తం శోభనం చుట్టూ… అది కూడా హైపర్ ఆది మార్క్ ద్వంద్వార్థాలతో అక్కడక్కడా వెగటు వాసన వేయడమే ఇబ్బందికరం… ఐనా ఫాపం, తనేం చేస్తాడులే… మల్లెమాల కోరినదే ఆది పాటించును కదా… లేకపోతే అక్కడ మనుగడ కష్టం కదా… తన గురువు అదిరె అభిలాగా నిష్క్రమించాల్సి వస్తుంది… సో, జస్ట్, ఇదంతా ప్రేక్షకుల ఖర్మ…!!
Share this Article