హైపర్ ఆది లేకుండా… తన ర్యాగింగు డైలాగులు లేకుండా… ఈటీవీలో ఒక కామెడీ ఎపిసోడ్ వస్తే బాగుండు, చూస్తే బాగుండు అనిపించిందా ఎప్పుడైనా…? పోనీ, మళ్లీ ఈటీవీ ప్రోగ్రాంలో సుడిగాలి సుధీర్ యాంకరింగ్ చేస్తే చూడాలని ఉందా..? అదీ తన జాన్ జిగ్రీ రష్మితో కలిసి జంటగా…! జరిగింది… రాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలో హైపర్ ఆది కనిపించడం లేదు… సుధీర్, రష్మి కలిసి యాంకరింగ్ చేస్తున్నారు… వాళ్ల డాన్స్ బిట్ కూడా ఉంటే సూపర్ ఉండేది…
ఆమెకు ఏదో సినిమా హడావుడి మొన్నటివరకూ… సుధీర్కూ గాలోడు సినిమా హడావుడి… సో, రిహార్సల్స్‌కు కూడా టైమ్ దొరకనట్టుంది… సో, కాసేపు జాయింట్ యాంకరింగ్ చూడండి… అంతే… ఆది ఔట్… సుధీర్ ఇన్… ఈ థంబ్ నెయిల్స్ పెట్టేసి, హడావుడి చేయాలని అనుకుంటే మీ ఇష్టం… ఈ ఎపిసోడ్ వరకూ అది నిజమనిపిస్తోంది… ఏ చెట్టూ లేనిచోట ఆటోరాంప్రసాదే మర్రిచెట్టు కాబట్టి ఈసారికి తనే లీడ్ స్టార్… ఓ స్కిట్లో పాత సుధీర్ కనిపిస్తున్నాడు… సునీల్ కామెడీ చేస్తేనే బాగుంటాడు… సుధీర్ కూడా అంతే… అలాంటోళ్లు కమెడియన్లుగానే హీరోలు… హీరోలు అంటేనే కామెడీ…
Ads
ఏదో కోడళ్లు, అత్తలు మార్క్ పోటీ కాన్సెప్టుతో ఈసారి ఎపిసోడ్ నడిపించేసినట్టున్నారు… ప్రతిసారీ కొత్తవి ఏం దొరుకుతాయి..? ఐనా అక్కడ కూడా అంతగా క్వాలిటేటివ్‌గా ఆలోచించేవాళ్లు ఎవరు మిగిలారని..?! బిగ్‌బాస్ ఫేమ్ భాను ఏదో పాట పాడుతోంది… ఆ డిఫరెంటు టోన్‌తో ఆ ఎమోషనల్ సాంగ్ పాడుతుంటే బాగా లేదనలేం గానీ, కొత్తగా ఉంది… పైగా ఏడుస్తూ పాడింది… రష్మి, వర్ష కూడా ఏడ్చారు… ఈమధ్య టీవీ వేదికలు కంటెస్టెంట్టు ఏడిస్తేనే రక్తికడుతున్నట్టున్నయ్… (యాంకర్లు సింగర్లవ్వాలి… యాంకర్లు యాక్టరవ్వాలి… సింగర్లు యాంకర్లవ్వాలి… చివరకు యశస్వి వంటి పాపులర్ సింగర్లు కూడా జీటీవీ సీరియళ్లలో పాత్రలకు రెడీ అయిపోయాడు…)
ఒక సినిమాకు కమెడియన్లు గానీ, ఇతర యాక్టర్లు గానీ స్పూఫ్ చేయాలంటే… ఆ సినిమా అంతకుముందే బలంగా జనంలోకి వెళ్లి ఉండాలి… ఈ స్పూఫ్ స్కిట్ చూస్తుంటే ఒరిజినల్ సినిమా గుర్తొస్తూ ఎంజాయ్ చేయగలగాలి… మొన్నమొన్నటివరకూ పుష్ప సినిమా స్పూఫ్లకు అనువుగా ఉండేది… బన్నీ వేషం, భాష, రష్మిక పాట, పైసలిచ్చి ముద్దు కొనుక్కోవడం ఎట్సెట్రా స్పూఫ్‌కు భలే దొరికేవి… లేటయింది… కానీ ఇప్పుడు కొత్త సినిమా దొరికింది…
తెలుగు టీవీ తెర మీద ఇప్పుడే కొత్త అనుకుంటా… కాంతార స్పూఫ్ ట్రై చేశారు… అయితే దాన్ని కామెడీ బిట్‌గా గాకుండా ఇంకేదో కాన్సెప్టు తీసుకున్నట్టున్నారు… కానీ ప్రోమోలో నూకరాజు భలే చేసినట్టుగా కనిపిస్తోంది… అవకాశాలు రావాలే గానీ, కొత్త పాత్రలు ఇవ్వాలే గానీ ఎవరైనా ఎందుకు నిరూపించుకోరు..? చూస్తూ ఉండండి… రాబోయే రోజుల్లో ఇమాన్యుయేల్, నూకరాజు ఇంకా బాగా క్లిక్ అవుతారు…!!
Share this Article