Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏరీ మన శరం లేని వీర తోపులు… అనన్య నాగళ్ల వంద రెట్లు మేలు…

April 26, 2025 by M S R

.

గుర్తుందా..? All eyes on Rafah… ఈ నినాదం… ఇజ్రాయిల్ భీకర దాడులకు గురైన గాజా స్ట్రిప్‌లోని ఓ ప్రాంతానికి మద్దతుగా ఇండియన్ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ఓ ఇమేష్ షేర్ చేశారు… అదీ ఎఐ క్రియేటెడ్ ఇమేజ్…

అక్కడి దాకా ఎందుకు హెచ్‌సీయూ అడవి (?)లో జింకలు, నెమళ్లు, కుందేళ్ల అరుపులు, కన్నీళ్ల ఎఐ క్రియేటెడ్ ఇమేజులను కూడా షేర్ చేసుకున్నారు నార్త్ సెలబ్రిటీలు… ఎడిటెడ్ వీడియోలు కూడా… తెలంగాణ ప్రభుత్వానికి ఎప్పటిలాగే ఏదీ చేతకాదు కాబట్టి,..

Ads

ఎవరి మీదా ఏ యాక్షనూ లేదు… ఉండదు… మహా అయితే స్మిత సబర్వాల్‌కు నిష్ఫల నోటీసులు తప్ప… ఆమె కూడా ఏం చేసుకుంటావో చేసుకోపో అంటోంది రేవంత్ రెడ్డిని ఉద్దేశించి, మళ్లీ కౌంటర్ ట్వీట్లు పెడుతూ…

కానీ ఆమెను పక్కన పెడితే… సోకాల్డ్ సెలబ్రిటీల్లో ఒక్కరు… ఒక్కడు… పహల్‌గామ్ పైశాచిక ఉగ్ర దుశ్చర్య మీద స్పందించరేం..? భయం… వణుకు… ఎక్కడో ఉన్న రఫా మీద ఉన్న ప్రేమ మన పహల్‌గామ్, మన ఇండియన్ల మీద లేదెందుకు..? దరిద్రులు… వాళ్లను తోపులుగా అభిమానించి, పూజించి, కీర్తించే చెత్తా ఫ్యాన్స్ అసలు బేకార్ గాళ్లు…

ఈ నేపథ్యంలో ఈమెను చూసి మిగతా సెలబ్రిటీలు, పెద్ద పెద్ద తోపు హీరోలు, హీరోయిన్లు సిగ్గుతో తలదించుకోవాలి… ఆ తెలుగు అమ్మాయి పేరు అనన్య నాగళ్ల…

అనన్య ఒక ఈవెంట్ కోసం నెల్లూరు వెళ్లింది… పహల్‌గామ్ ఉగ్ర దాడిలో మరణించిన ఓ వ్యక్తిది పక్కనే ఉన్న కావలి అని తెలిసి, నేరుగా అక్కడికి వెళ్లింది, నివాళి అర్పించింది… వావ్… వందలు, వేల కోట్లు సంపాదించి మన సొసైటీ మీద కించిత్ కన్సర్న్ లేని తోపులు, వాళ్ల ఫ్యాన్స్ తల దించుకోవాలి… ఐ అప్రిసియేట్ అనన్యా…

థియేటర్లకు వెళ్లి, తొక్కిసలాటలకు, మరణాలకు కారకులు… సరోగేట్ యాడ్స్, బెట్టింగ్ యాప్స్ తోపులు… జనం పర్సుల్ని కత్తిరించి బతికేవాళ్లు… సిగ్గుపడాలి… ఈ సొసైటీలో మనుషులుగా పుట్టినందుకు..! (స్పందించిన చిరంజీవి వంటి ఒకరిద్దరు హీరోలకు ఈ వ్యాఖ్యల నుంచి మినహాయింపు,..)

కరాచీలో పుట్టి, పాకిస్థాన్ ఆర్మీతో లింకులున్న ఓ నటి వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందే పాన్ ఇండియా సినిమాలో నటించే ఇమాన్ ఇస్మాయిల్‌కు ఇండస్ట్రీ సపోర్టు… అబ్బే, నాది భారతీయ రక్తం, పాకిస్థాన్‌తో సంబంధం లేదని ఆమెతో ప్రకటనలు ఇప్పిస్తారు మూర్ఖశిఖామణులు… మన మీడియా కళ్లు మూసుకుని, కళ్లకద్దుకుని రాసేస్తుంది…

అనన్యతో పోలిస్తే ఎంత కంట్రాస్టు… విజ‌య‌వాడ మునిగిపోతే… కాశ్మీర్లో తెలుగు వాడు ఉగ్ర‌వాదుల చేతుల్లో మ‌ర‌ణిస్తే… అనన్య నాగ‌ళ్ల స్పందిస్తుంది! అదీ… తెలుగులో… కన్నీళ్లు పెట్టుకుంటుంది… కానీ ఆమెకు పెద్దగా చాన్సులు ఇవ్వరు… అమెరికాలో ఉండే ఓ పాకిస్థానీ మిలిటరీ లింకుల కరాచీ లేడీకి పల్లకీ మోస్తూ తమ లేకిగుణం ప్రదర్శిస్తారు మన నిర్మాతలు…

మరొకరు గుర్తొచ్చారు… కరోనా కాలంలో ఇళ్లల్లో పెసరట్లు, ఆమ్లెట్లు పోస్తూ వెగటు ఫోటోలు మీడియాలో పెట్టుకుని ప్రచారం పొందిన తోపులకన్నా ఓ చిన్న నటి ప్రణీత సుభాష్ రోజూ వందల మందికి ఫుడ్ సప్లయ్ చేసింది… మన తోపులు సిగ్గుపడలేదు… ఒకడిని మించి మరొకడు తిక్క వీడియోలు పెట్టి మురిసిపోయారు… మా ఇజ్జత్ తీసిందని మళ్లీ ఆమె మీద కక్షకట్టకండిరా… థూ మీ బ చె…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఘర్షణలో నష్టాలు సహజం… కానీ మనం 100 % అప్పర్ హ్యాండ్ సాధించాం…
  • నో డౌట్… రాఫెల్ అల్టిమేట్ వార్ ఫైటర్… మన పైలట్లూ సేఫ్…
  • అప్పటికప్పుడు కొత్త సీన్లు… ఆలోచనల కసరత్తులు… మేధో మథనాలు…
  • బాపూ, నీ పాదాలేవి..? ఒక్కసారిగా బావురుమని ఏడవాలనుంది..!!
  • మీడియా చెవుల్లో శ్రీలీల పూలు… నువ్వూ తయారయ్యావా తల్లీ…
  • …. అసలు ఇలాంటి సినిమాలు కదా రీరిలీజ్ చేయాల్సినవి…
  • ‘మా’ పూనుకుని… రాజేంద్ర ప్రసాద్‌కు మానసిక చికిత్స చేయించాలి..!!
  • ‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!
  • ఐపీఎల్ ఫైనల్స్‌లోకి… పాకిస్థానీ జాతిపిత మునిమనుమడి టీమ్…!!!
  • మమత బెనర్జీ… ఆమె అంతే… దేశభక్తి ఆమె దృష్టిలో ఎప్పుడూ నేరమే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions