.
ఆహా… ఈరోజు బాగా నచ్చిన వార్త… ప్రపంచంలోకెల్లా అత్యంత ధూర్తుడైన పాలకుడు… ది గ్రేట్ మోడీ దోస్త్… ట్రంపు గాడు ఖడ్గం పట్టుకుని, నాకు నోబెల్ శాంతి బహుమతి రాకపోతే ఒక్కొకడి తాట తీస్తా అంటూ సగటు తెలుగు హీరోలాగా గర్జించినా సరే… వాడికి నోబెల్ దక్కలేదు…
2025 ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి మరియాను వరించింది… నార్వేజియన్ నోబెల్ కమిటీ ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేసింది… ఈ ప్రైజ్ కోసం ఎంతగానో ఎదురుచూసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిరాశలో కూరుకుపోయాడు…
Ads
సూసైడ్ చేసుకుంటాడేమో జాగ్రత్త… నోబెల్ జ్యూరీకి రక్షణ అవసరం… లేకపోతే ఏమిటి వాడు.,.? పాకిస్తాన్‌తో జతకట్టి… వ్యాపార సంబంధాలు పెట్టుకుని, ఆ ధూర్త ఉగ్రవాద దేశానికి మద్దతుగా నిలిచి… ఇండియన్ల మీద విషం కక్కుతున్న విషనాగు…
ఆరు యుద్ధాలు, ఏడు యుద్ధాలు, వంద యుద్ధాలు ఆపాను అని ఎచ్చులు… ఏతులు… నాకు శాంతి నోబెల్ బహుమతి లేకపోతే అమెరికాను అవమానించినట్టే అని ఎమోషనల్ బెదిరింపులు… బహుశా ఇలాంటి వెధవ పాలకుడు అమెరికాకు మళ్లీ రాడేమో…
చివరకు ఏమైంది..? 2025 నోబెల్ శాంతి బహుమతి మరియా కొరినా మచాడో (María Corina Machado)కి లభించింది… ఆమె ప్రత్యేకత ఏమిటంటే.,?
మరియా కొరినా మచాడో వెనిజులాకు చెందిన ప్రతిపక్ష నాయకురాలు… వెనిజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆమె చేసిన అవిరళ కృషి, నియంతృత్వం నుండి ప్రజాస్వామ్యానికి న్యాయమైన, శాంతియుత పరివర్తన (just and peaceful transition from dictatorship to democracy) కోసం ఆమె చేసిన పోరాటానికి గాను ఈ బహుమతిని ప్రకటించారు…
- ప్రజాస్వామ్య అభివృద్ధికి అంకితమైన Súmate అనే సంస్థ వ్యవస్థాపకురాలిగా ఆమె 20 సంవత్సరాల క్రితం స్వేచ్ఛాయుతమైన, న్యాయబద్ధమైన ఎన్నికల కోసం నిలబడింది…
- ఆమె న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యం, మానవ హక్కులు, ప్రజా ప్రాతినిధ్యం కోసం సంవత్సరాలుగా పోరాడుతున్నది…
- వెనిజులాలో ప్రజాస్వామ్య ఉద్యమానికి ఆమె నాయకురాలిగా ఉండి, చీలిపోయిన ప్రతిపక్షాన్ని ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించింది…
- ఆమె ప్రాణాలకు తీవ్రమైన బెదిరింపులు ఉన్నప్పటికీ దేశంలోనే ఉండి పోరాడటం లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది…
చివరకు ఈరోజు కూడా అఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్ తో వైమానిక దాడులు చేయించాడు ట్రంపు… పిల్లలు, మహిళలు మరణించారు… ఛఛ …. తను యుద్ధాలు ఆపుతాడట,., శాంతిదూత అట… ప్చ్, ఈసారి నోబెల్ మోడీకి ఇచ్చి ఉండాల్సింది.,. వాడు ఏమయ్యేవాడో ఫాఫం..!! ఇప్పటికీ ఏమిటో సిట్యుయేషన్..? ఏమమ్మా, ఇవాంకా, మీ అయ్యను కాస్త జాగ్రత్తగా చూసుకో..!! నార్వే మీద అణుబాంబులు వేస్తానంటాడేమో..!!
.
అన్నట్టు… ఈ నోబెల్ awaardee కూడా అమెరికా స్పాన్సర్డ్ నేత… శుభం…!!
Share this Article