.
మన శివశంకర ప్రసాద్ గారూ… ఒకటి నచ్చిందండోయ్… మనస్పూర్తిగానే..! ఈ హ్యూమన్ టచ్ స్టోరీ వివరాల్లోకి నేరుగా వెళ్దాం…
జీతెలుగు చానెల్‌లో లిటిల్ చాంప్స్ అని ఓ ప్రోగ్రామ్ వస్తుంటుంది… నిజానికి అది చిన్న పిల్లల సింగింగ్ కంపిటీషన్ షో… కాకపోతే కొన్ని సీజన్లుగా దాన్ని మరీ ఫన్ ఓరియెంటెడ్, ఏదో అల్లాటప్పా వినోదాత్మక కార్యక్రమంగా మార్చారు…
Ads
ఈసారీ అంతే… అనంత శ్రీరాం గెంతులైతే వేరే లెవల్… అసలు పాటలకన్నా ఈ చెణుకులు, పరస్పరం పంచులు, డాన్సుల యవ్వారమే ఎక్కువ… కానీ ఈసారి ఓ ఎమోషనల్ టచ్ ఉంది…
వరుణవి అని చిన్న పిల్ల, అంధత్వం… చెబితే హర్టవుతుంది… ఆమె మానసిక ఎదుగుదలకూ అది అవరోధం అవుతుంది… అందుకని ప్రతి ఎపిసోడ్‌లోనూ జడ్జిలు గానీ, గెస్టులు గానీ ఆమెను ఈ విషయంలో ఏమీ అనకుండా హర్ట్ చేయకుండా ఉండాలని మొదట్లోనే అందరికీ స్ట్రిక్టుగా చెప్పారు… అందరూ పాటించారు…
ఆ అమ్మాయి కూడా యమ యాక్టివ్… చూస్తుంటే, ఆమె పాడుతుంటే ముద్దొస్తుంది, తోడుగా సానుభూతి కూడా జతకలిసి..! ఈ సీజన్ విజేత ఎవరైనా కావచ్చు… కానీ ఈ నిస్సారమైన షోకు ఆ అమ్మాయే వెలుగు ఈసారి..!
మరి చిరంజీవి ప్రస్తావన దేనికీ అంటారా..? ఇదోసారి చూడండి…
స్క్రిప్టెడ్ కావచ్చు, స్పాంటేనియస్ కావచ్చు… ఆ అమ్మాయి నన్ను చిరంజీవితో కలిపించవా అని జడ్జి కమ్ దర్శకుడు అనిల్ రావిపూడిని అడుగుతుంది… అపాయింట్‌మెంట్ ఫిక్స్… ఆ అమ్మాయి, షో ముఖ్యులు వెళ్లారు, కలిశారు… అక్కడా ఆ అమ్మాయి అదరగొట్టేసింది…
మన శివశంకర ప్రసాద్ గారు సినిమాకు దాన్ని పబ్లిసిటీగా కూడా వాడుకున్నట్టు అనిపించలేదు… ఈ అమ్మాయికి అవసరమైన ఏ బాగోగులైనా నేను బాధ్యత తీసుకుంటాను అని చిరంజీవి చెప్పాడు… కట్టుబడి ఉండాలని నా కోరిక… అందుకే చిరంజీవి గెస్చర్ నాకు నచ్చిందని ముందే చెప్పాను… (కొన్ని విషయాల్లో చిరంజీవి నచ్చుతాడు… పర్టిక్యులర్‌గా ఇలాంటి విషయాల్లో…)
ఆల్రెడీ సుధీర్ ఆమెకు ఓ స్పెషల్ మెడికల్ గాగుల్స్ కమ్ ఇయర్ పాడ్స్ ప్రజెంట్ చేశాడు… ఆ సౌండ్స్ వింటూ ఆ అమ్మాయి తన కదలికల్ని నియంత్రించుకునే వీలుంటుంది… భేష్, సుధీర్…
ఈ చిరంజీవి ఎపిసోడ్ ఈ ప్రోగ్రాం, ఈ సీజన్ ఫినాలేకు అదనపు ఆకర్షణ...

Share this Article