Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

I, No Body – ఓ కొత్త స్టోరీ లైన్ – కథ చెప్పడంలోనే కాస్త తడబాటు!!

July 11, 2026 by M S R

.

అంతకుముందు పెద్దగా తనమీద దృష్టి పడలేదు గానీ, ఆడుజీవితం ( ది గోట్ లైఫ్ ) సినిమా చూశాక పృథ్వీరాజ్ సుకుమారన్ నటన బాగుందనిపించింది… తనను తాను ఆ పాత్రలోకి ఎంతగా ట్రాన్‌ఫామ్ చేసుకున్నాడో చాలా చెప్పుకున్నాం  కూడా… బహుశా ఈసారి జాతీయ అవార్డు కూడా రావచ్చునేమో… (రాజమౌళి వారణాసిలో కూడా చేస్తున్నాడు)…

ఐతే తన పేరునే పెట్టుబడిగా ఇప్పుడు ఓ సినిమా రిలీజ్ చేశారు… దాని పేరు ఐ నోబడీ ( i nobody )… తన కోసమే ఈ సినిమాకు వెళ్లాలి, అంతే, అంతకుమించిన సీన్ లేదు, నిజం చెప్పాలంటే, తన కోసం కూడా వెళ్లాల్సిన పనిలేదు…

Ads

గతంలో డబ్బింగ్ అంటే… పాటలు, మాటలు డబ్ చేసి ఇతర భాషల్లో వదిలేవాళ్లు… కానీ పాన్ ఇండియా సినిమా కల్చర్ వచ్చాక… టెక్నాలజీ వచ్చాక… ఇతర భాషల్లోకి డబ్ చేసేటప్పుడు ఆ భాషల్లో కనిపించే బోర్డులు గట్రా డబ్ చేసే భాషలోకి మార్చడం సులువైంది… కానీ ఈ ఐ నోబడీ నిర్మాతది ఎంత నిర్లక్ష్యం అంటే… మలయాళం బోర్డులు, పేపర్ క్లిప్పింగులు అలాగే కనిపిస్తాయి…

ఇప్పుడు డిజిటల్ సినిమాలురా బాబూ, ఈజీగా నిమిషాల్లో మార్చేయగలరు… సినిమా కథ విషయానికి వస్తే… ఒక దోపిడీ… ఆ సొమ్ము హీరో దగ్గరే ఉందని అందరూ అనుమానంగా చూస్తుంటారు.., దీన్ని బ్రేక్ చేయడానికి హీరో ఏం చేశాడు, ఇంకా ఎలాా అవస్థలు పెరగాయనేది స్టోరీ పాయింట్…

మలయాళ దర్శకులు కొత్త కథల్ని తీసుకుంటారు, ప్రయోగాలు చేస్తారు, కథనం మీద కాన్సంట్రేట్ చేస్తారని తెలుసు కదా… ఇదీ అలాగే, ఫస్ట్ పార్ట్ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది… కానీ సెకండాఫ్‌కు వచ్చేసరికి ఈ దర్శకుడు ఎవరో గానీ దారితప్పాడు… గందరగోళానికి తను గురై, మనలనూ చికాకు పెడతాడు…

రాజీవ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఓ మాములు ప్రభుత్వ ఉద్యోగి. తన భార్య మీరా (పార్వతి తిరువొతు) కూడా ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ తమ ఇద్దరు పిల్లలలను చదివిస్తూ ఉంటుంది. మీరాకు ఓ బ్యాంక్ మేనేజర్ తో అఫైర్ ఉండటంతో ఈ విషయం తెలిసిన రాజీవ్ అతన్ని భయపెడదామని గన్ తీసుకొని బ్యాంక్ కి వెళ్తాడు.

అదే సమయంలో ఓ ముగ్గురు దొంగలు ఆ బ్యాంక్ లోకి వచ్చి 17 కోట్ల రూపాయలు దోచుకొని రాజీవ్ ని కూడా కొట్టి బంధించి తీసుకెళ్తారు. దారి మధ్యలో రాజీవ్ ని కొట్టి పడేసి వెళ్తుంటే యాక్సిడెంట్ అయి ఆ ముగ్గురు దొంగలు చనిపోతారు. ముగ్గురు చనిపోవడం, రాజీవ్ హాస్పిటల్ లో ఉండటంతో ఆ డబ్బు ఎక్కడుందో ఎవరికీ తెలియదు.

దీంతో ఆ దొంగతనంలో రాజీవ్ కూడా పార్టనర్ అని వాళ్ళను చంపేసి అతనే డబ్బులు దాచేసాడని పోలీసులు, జనాలు నమ్ముతారు. దీంతో కొంతమంది డబ్బులు ఇమ్మని అతన్ని, అతని కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. పోలీసులు కూడా రాజీవ్ ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ దొంగతనం వల్ల జాబ్ పోయిన ఓ పోలీస్ (హకీమ్ షా) కూడా డబ్బుల కోసం వెతుకుతూ ఉంటాడు.

జనాలు కూడా ఆ డబ్బు ఎక్కడ దాచిపెట్టారు అని వెతుకుతూ ఉంటారు. అసలు ఆ 17 కోట్ల రూపాయలు ఎక్కడ ఉన్నాయి? ఆ దొంగతనం ఎవరు చేయించారు? ఆ డబ్బులు లేకపోయినా రాజీవ్ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? రాజీవ్ – మీరా బంధం ఏమవుతుంది.. ఇదీ కథ…

ఇందులో మరొకటి నచ్చుతుంది… మామూలుగా సినిమాలు అనగానే ఓ సోది రొటీన్ ఫార్ములా ఉంటుంది కదా… ఓ హీరో, ఓ హీరోయిన్, పెళ్లి కాదు, పాటలు, రొమాన్స్, మన్నూమశానం, స్టెప్పులు… కానీ మలయాళం స్టయిల్ వేరు… ఇందులోనూ ఇద్దరికీ పెళ్లయి ఉంటుంది, పిల్లలు కూడా… హీరోయిన్‌కు కాస్త నెగెటివ్ షేడ్ కూడా…

i nothing

హీరోయిన్‌గా మీరా పాత్రలో పార్వతి తిరువోతు నటించింది… సగటు తెలుగు హీరోయిన్‌లాగా నాలుగు స్టెప్పులేని వెళ్లే ఓ స్కిన్ షో కేరక్టర్ కాదు… 38 ఏళ్ల ఈమె ఎంచక్కా ఈ నెగెటివ్ షేడ్ పాత్రలో ఒదిగిపోయింది, ఓ మధ్యతరగతి ఇల్లాలిగా, ఇద్దరు పిల్లల తల్లిగా… సహజంగా… ఎంతైనా నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకోవడంలో మలయాళ సినిమా టీమ్స్ పెట్టింది పేరు…

(ఈమె మలయాళ ఇండస్ట్రీలో వుమెన్ యాక్టివిస్టు కూడా- అదంతా ఇక్కడ అప్రస్తుతం)… మళ్లీ సినిమాలోకి వస్తే సెకండాఫ్‌లో కూడా కొన్ని మెరుపులు లేవని కాదు, కానీ ఫస్టాఫ్ తో పోలిస్తే నాటకీయత ఎక్కువై పోయింది, పలుచోట్ల అసహజ, అతిశయోక్తి సీన్లు అనిపిస్తాయి… ప్రతి పాత్రలోనూ నెగెటివ్ ఛాయలు కనిపించేలా మంచి స్క్రిప్టే రాసుకున్నా సరే, దాన్ని ప్రజెంట్ చేయడంలో కొంత గందరగోళానికి గురయ్యాడు దర్శకుడు… కానీ ఓటీటీలో వస్తే ఓసారి చూడొచ్చు… పృథ్విరాజ్ కోసం, పార్వతి కోసం!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • SIR – తెలంగాణ Chief Electoral Officer కి పద్మశ్రీ ఇవ్వాలి మోదీజీ…!!
  • ఆర్గానిక్ హిట్..! టాలీవుడ్‌కు ఓ ‘మంచిబాట’ చూపిన ఇరుముడి..!
  • నా ముఖం వీడియో తీయనివ్వకండి… మా నాన్న చూస్తే చచ్చిపోతాడు మేడమ్!”
  • Not Appropriate – రేవంత్ USA పర్యటనపై కేంద్రానికి డౌట్లు అర్థరహితం..!
  • ఈమె గుర్తుందా ? అథ్లెటిక్ ట్రాక్ వదిలేసి, రీల్ కెరీర్ ఎంచుకుని ఫ్లాప్ !!
  • ఓహ్, ఈమెను తరిమేయడం వెనుక ఇంత ‘స్పిరిట్’ ఉందా?
  • Awarapan-2 … అనూహ్యంగా హిట్ – భారీగానే వసూళ్లు !!
  • Prakash Raj … ‘స్పిరిట్’ నుంచి తరిమేశారు – మరి వారణాసి మాటేమిటి !?
  • ఓడలు బళ్లు – బళ్లు ఓడలు … వెస్టిండీస్ – బంగ్లాదేశ్ మంచి ఉదాహరణ
  • షావుకారు జానకి ! ఆ అన్నపూర్ణ ఎందుకు గుర్తొస్తున్నదీఅంటే !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions