Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇది శేఖర్ కమ్ముల సినిమా కానేకాదు… కుబేరపై ప్రశంసలకు మరో కోణం…

June 23, 2025 by M S R

.

సరే, ఇప్పటికే 90 కోట్ల వసూళ్లు కుబేర సినిమాకు గుడ్… గెటాన్ అవుతుంది… సరస్వతి కాదు, నాకు లక్ష్మి కావాలి అన్నాడు కదా శేఖర్ కమ్ముల… ఎస్, నో సరస్వతి, జస్ట్ టార్గెట్ ఫర్ లక్ష్మి…

నో డ్యూయెట్స్, నో శేఖర్ మాస్టార్ వల్గర్ స్టెప్స్, నో అగ్లీ పంచ్ డైలాగ్స్, నో డర్టీ ఐటమ్ సాంగ్, నో జబర్దస్త్ కామెడీ, నో వల్గర్ సీన్స్… అసలు తెలుగు సినిమా సగటు అవలక్షణాలు, దుర్వాసనలు ఏమీ లేవు…

Ads

మరి మెచ్చుకోవాలి కదా, తిడుతున్నారెందుకు..? ఇదేం సినిమార భయ్ అని నిందిస్తున్నారెందుకు..? ఎస్, నాణేనికి మరొక కోణం… అదీ ఎందుకు చెప్పుకుంటున్నారు..? అది శేఖర్ కమ్ముల సినిమా కాబట్టి…

తన ఒరిజినల్ సెన్సిటివ్, సెన్సిబుల్ జానర్ కాదు కాబట్టి… తను లాజికల్ థింకర్ కాబట్టి… బాబ్బాబూ నువ్వూ ఇలాగే తీస్తే ఎలా అనే బాధ… ఏ సుకుమారుడో పుష్ప బాపతు ఏ చెత్తో తీసి ఉంటే ఎవడూ పట్టించుకోడు… శేఖర్ కమ్ముల కాబట్టే ఇంతగా ఆవేదనాపూరిత నెగెటివ్ సమీక్షలు వినిపిస్తున్నాయి… ఎక్స్‌పెక్ట్ చేయలేదు కాబట్టి…

shekar kammula

రాజమౌళి ఏదో శేఖర్‌ను స్టబ్బరన్ అన్నాడు గానీ… కాదు, అస్సలు కాదు… పింగళి చైతన్య తనను పూర్తిగా తప్పుదోవలో నడిపించింది… ఫాఫం, శేఖర్ తన మెదడు వాడటం మానేసి, వేరేవాళ్ల మెదళ్ల మీద ఆధారపడటమే ఈమాత్రం విమర్శలకు కారణం…

ఎస్, ఓ సమీక్షల మిత్రుడు చెప్పినట్టు… శేఖర్ ఇంకా పద్మారావునగర్‌లోనే ఉన్నాడు… బయటికి రాలేకపోతున్నాడు… తనకు షెల్ కంపెనీల గురించి తెలియదు… హవాలా గురించి తెలియదు, తను అప్‌డేట్ కాలేదు, కావడం లేదు… కాలేడు… అదీ సమస్య…

ఈ సినిమాకు చిరంజీవి మార్క్ సర్టిఫికెట్టు అవసరం లేదు… తను క్రష్మిక అంటూ కార్చుకోవడానికే సరిపోయింది ఫాఫం సక్సెస్ మీట్‌లో…  దాన్నలా వదిలేస్తే… కథాకథనాల్లో బోలెడు లోపాలు, జంపింగులు… శేఖర్ తనేం తీస్తున్నాడో తనకు తెలుసా అనేదీ డౌటే…

rashmika

ఇది ఏమాత్రం తన జానర్ కాదు… అస్సలు కాదు… లీడర్ టైములో దాటాడు ఫ్లాప్… ఇప్పుడూ దాటాడు, ఫ్లాప్ అనలేను, కానీ ఇది శేఖర్ కమ్ముల సినిమా మాత్రం కాదని ఖచ్చితంగా చెప్పగలను…

1) ఎవడైనా సరే షెల్ కంపెనీల కోసం నమ్మకస్తులైన వాళ్లను ఎంచుకుంటారు, అంతేతప్ప ఎవడెవడో బిచ్చగాళ్లను ఎంచుకోరు..?

2) విజయసాయి వంటి సీఏలు బోలెడు మంది… సీబీఐ ఎక్స్‌పెల్డ్ కేరక్టర్లు కాదు… ఫాఫం, జగన్ కేసుల్ని పరిశోధించిన లక్ష్మినారాయణను మనసులో పెట్టుకున్నారేమో… పోనీ, అదైనా కన్విన్సింగుగా చెప్పాలి కదా…

3) ఇదేమైనా తెలుగు సిని‘మాయా..? రోజుల్లో మనుషుల్ని కంపెనీల సీఈవోలుగా మార్చడానికి..? సరే, మార్చారుపో… ఖుష్బూ పాత్రను కాపాడిన దీపక్ (నాగార్జున) ఓ ఎస్సయిని అలా ఎలా కాల్చిచంపాడు… బిడ్డ, పెళ్లాం మీద ప్రేమతో అక్రమార్కులతో చేతులు కలిపిన తను… చివరకు వీళ్లు ఇంత దోచుకుంటారని అనుకోలేదురా అంటాడు… అబ్సర్డ్…

4) ధనుష్ కేరక్టర్ కూడా గందరగోళం… ఆ డబ్బును తనలాంటి బిచ్చగాళ్ల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని భావించేవాడు, విలన్ ఇంటి ఎదుట ఎందుకు పారబోస్తాడు..? 2 లక్షల మంది ఎంప్లాయీస్ ఆధారపడి ఉన్న విలనుడిని చంపడం సమస్యకు పరిష్కారం ఎలా అవుతుంది…?

dhanush

5) ప్రతి పాన్ ఇండియా సినిమాలాగే ఇదొక దరిద్రం… ప్రతి భాష నుంచి కొందరిని తీసుకుంటే చాలు, అందరూ ఆదరిస్తారు అనుకోవడం… కన్నడం నుంచి రష్మిక, తమిళం నుంచి ధనుష్, తెలుగు నుంచి నాగార్జున, హిందీ నుంచి జిమ్ షర్బ్… ఫాఫం, శేఖర్ కమ్ముల…

6) నేను మీ ఓబులేషన్ననురా, నీకు నేనున్నాను అంటాడు నాగార్జున చచ్చిపోతూ… మరి తను సీబీఐ ఆఫీసర్ అయ్యాక ఈ ధనుష్ ఏమయ్యాడో, ఎక్కడున్నాడో ఎందుకు కనుక్కోలేదు..? అసలు ధనుష్ కేరక్టరైజేషన్ కూడా గందరగోళంగా ఉంది…

కుబేర

7) అసలు ఖుష్బూ అనే పాత్ర పరిచయమే ధనుష్‌కు చాలా స్వల్పం… ఆమె కోసం అంత తెగింపు ఎందుకొచ్చింది ధనుష్ పాత్రకు..? చెబుతూ పోతే స్క్రిప్టులో బోలెడు లోపాలు… ఇవన్నీ వోకే, ప్లస్ పాయింట్లు లేవా..? ఉన్నాయి బోలెడు… కానీ శేఖర్ కమ్ముల ఇమేజే తనకు శాపం… ఇన్ని లోపాలు ఉండటమే బాధాకరం…

8) ఎందుకంటే… తను ఓ సెన్సిబుల్ డైరెక్టర్ కాబట్టి, సగటు తెలుగు దర్శకుడిలా నానా అవలక్షణాల దరిద్రం కాదు కాబట్టి… సగటు తెలుగు ప్రేక్షకుడికి తనపై బోలెడు నమ్మకాలు, ఆశలు ఉన్నాయి కాబట్టి… అవి గంగలో, ముంబై డంపింగ్ యార్డుల్లో డంప్ అయిపోయాయి కాబట్టి..! (సోషల్ మీడియాలో కనిపిస్తున్న పలు నెగెటివ్ కథనాల సారంశ కథనం ఇది… నాణేనికి మరో కోణం… ప్లస్సులు లేవా..? ఉన్నాయి, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం… )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇది శేఖర్ కమ్ముల సినిమా కానేకాదు… కుబేరపై ప్రశంసలకు మరో కోణం…
  • ఎదిగే దశలోనే ఒద్దిక, అణకువ అవసరం… ఫాఫం… తెలియనట్టుంది…
  • ఫాఫం రష్మిక…! స్టిల్ సొంతిట్లో నిరాదరణే…! కుబేర భారీ డిజాస్టర్…!!
  • 60 ఏళ్ల క్రితమే… ఈ గొంతు నులిమే కుట్ర… నరకం చూసి, చావును గెలిచింది…
  • అమెరికాలో… నా వాలుజడ కృష్ణవేణి, నా పూలజడ వెన్నెలా గోదావరి…
  • బిన్ లాడెన్ – కొండ గుహ – బంకర్ బ్లస్టర్…! మళ్లీ చెప్పుకోవాలి కథ…!!
  • పార్టీ అమానవీయత ఖచ్చితంగా తప్పే… కానీ జగన్ ప్రత్యక్ష బాధ్యుడా..?!
  • ఇజ్రాయిల్‌కు చేతకాలేదు… అమెరికాను అడిగింది… యుద్ధంలో ట్విస్టు..!!
  • ఎంతటి మంచి భరోసా ఆర్యా… ఇదొక జీవిత బీమా ధీమా…
  • ఫాఫం, ఈ బీసీ కెరటం చివరకు కవిత క్యాంపులో విరిగిపడిందా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions