.
మొదట్లో యామీ గౌతమ్ ఫెయిర్ అండ్ లవ్‌లీ (ఇప్పుడు గ్లో అండ్ లవ్‌లీ) యాడ్స్ చేసేది… బ్రాండ్ అంబాసిడర్… కలర్ వోకే గానీ, ఈమె ఏ దంత మంజన్ లేదా టూత్ పేస్ట్ యాడ్స్‌కు సరిగ్గా సూటవుతుందనే విమర్శలు, జోక్స్ వినవచ్చేవి… తరువాత ఏవో టీవీ సీరియళ్లు, మొదట్లో ఏదో కన్నడ సినిమా, తరువాత హిందీలో విక్కీ డోనర్ సినిమా…
నిజానికి యామీ కుటుంబానికి కొద్దిగా సినీ నేపథ్యం ఉంది… తండ్రి ముకేష్ గౌతమ్ ఒక పంజాబీ చిత్ర దర్శకుడు, ఛానెల్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశాడు… అలా ఈ ఫీల్డ్ మీద అంతోకొంతో అవగాహన ఉంది, మొదట్లో మోడలింగు చాన్సెస్ రావడంతో ఇక దీన్నే కెరీర్‌గా ఎంచుకుంది…
Ads
- కానీ కొన్నాళ్లకే అంతా ఆవిరైపోయి, ఇక ఓ దశలో నటన వదిలేసి హిమాచల్‌ప్రదేశ్‌లోని తన పంటపొలాలకు వెళ్లిపోదామనీ అనుకుంది… ముంబైలో మూటాముల్లె సర్దుకుంది కూడా… (ఇప్పటికీ ఆమెకు పెద్ద విస్తీర్ణంలో ఫామ్స్, హౌజ్ ఉన్నాయి అక్కడ)…
నిజానికి వీక్కీ డోనర్ సక్సెస్… బాక్సాఫీసు దగ్గర కలెక్షన్ల వర్షం… ఇక మస్తు చాన్సులు వచ్చినట్టే అనుకుంది… కానీ ఏడేళ్లు స్ట్రగుల్… దానిపై రీసెంటుగా ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది…
‘‘ఏ నటికైనా మొదటి సినిమా బ్లాక్‌బస్టర్ అయితే, ఇక వరుస అవకాశాలు క్యూ కడతాయని అనుకుంటారు. కానీ నాకు అది భిన్నంగా జరిగింది. ఇండస్ట్రీ వర్గాలు నన్ను ఒక “సాధారణ హీరోయిన్” లాగా చూడలేదు. (అంటే సగటు హీరోయిన్ మెటీరియల్ కాదు అనుకున్నారట) ఆ తొలి చిత్ర విజయం నాకు ఎలాంటి ధీమా కల్పించకపోగా, ఆ తర్వాత వచ్చే ఆఫర్ల స్వభావాన్నే మార్చేసింది. సరైన అవకాశాలు రాక, నేనెక్కడికి వెళ్తున్నానో నాకే అర్థం కాక తీవ్రమైన సందిగ్ధంలో పడ్డాను.

ఒక దశలో నటనకు పూర్తిగా గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నాను… హిమాచల్ ప్రదేశ్‌కు తిరిగి వెళ్లిపోవాలి, అక్కడ మాకు వ్యవసాయ భూమి ఉంది, పూర్తిగా భిన్నమైన జీవితాన్ని గడపాలని భావించాను. ఆ సమయంలో మా అమ్మానాన్నలు కూడా ఎంతో అండగా నిలిచారు. ‘అవన్నీ వదిలెయ్, ఇంటికి వచ్చేసెయ్’ అని ఒక్క మాటతో ధైర్యం చెప్పారు. ఆశ్చర్యకరంగా… ఎప్పుడైతే నేను భయంతో ఇండస్ట్రీ మీద ఆశలు వదిలేశానో, అప్పుడే నా జీవితం టర్న్ తీసుకుంది, ఆ మలుపు పేరు ‘యూరి’ మూవీ… (Uri: The Surgical Strike ) … తరువాత ‘బాలా’ వచ్చింది. రాత్రికి రాత్రే నా లైఫ్ టర్న్ అయింది…
ఇన్‌సైడర్స్ వర్సెస్ అవుట్‌సైడర్స్… అదే అసలైన నిరాశ… బాలీవుడ్‌లో నెపోటిజం, పక్షపాతం ఉంది… స్టార్ కిడ్స్‌కు తప్పులు చేసినా ఎన్నో అవకాశాలు ఇస్తారు… ఎదగడానికి బోలెడన్ని ఛాన్సులు లభిస్తాయి… కానీ బయటి నుంచి వచ్చే వారికి ఒక్క అవకాశం దక్కడం కూడా గగనమైపోతుంది… అవుట్‌సైడర్ కావడం కష్టం కాదు, ప్రతిరోజూ నీ ప్రతిభను నిరూపించుకోవాల్సి రావడమే అసలైన కష్టం…
ఒక పాత్రకు నేను పూర్తిగా సరిపోతానని నమ్మినప్పుడు, కేవలం మరో వ్యక్తి ఆ ఇండస్ట్రీ ఈకోసిస్టమ్‌కు చెందినవాడన్న ఒకే ఒక్క కారణంతో ఆ అవకాశం ఆ వేరే వ్యక్తికి వెళ్తుంటే కలిగే అసంతృప్తి వర్ణనాతీతం… మాకూ అన్ని అవకాశాలు ఇస్తే మేమూ ఎదిగేవాళ్ళం కదా” అనే ఆలోచనే ఆ సమయంలో అత్యంత వేదనను కలిగించేది…

ఇండస్ట్రీలో కొందరి పట్ల చూపే పక్షపాతం తీవ్రంగా మనోవేదనకు గురిచేసింది. కొన్ని సినిమాల గురించి చర్చలు చివరి వరకు వచ్చి, అకస్మాత్తుగా ఎలాంటి కారణం చెప్పకుండానే ఆగిపోవడం, ఆశలు గంపెడు పెట్టుకున్న ప్రాజెక్టులు చేజారిపోవడం వంటి అనుభవాలు తనను కుంగదీశాయి…
గతంతో పోలిస్తే పరిశ్రమలో పరిస్థితులు మారుతున్నాయి… ప్రేక్షకులు ఇప్పుడు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అని చూడట్లేదు, కేవలం నటన బాగుందా? సినిమా చూసేలా ఉందా? లేదా? అనేదే చూస్తున్నారు… ఈ మార్పు రాబోయే తరం నటీనటులకు పెద్ద భరోసా ఇస్తుంది..’’ అంటోంది యామీ…
Share this Article