.
ఓబుళాపురం మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని నిర్దోషిగా తేల్చిన హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన సుప్రీంకోర్టు, విడిగా మళ్లీ విచారించి, 3 నెలల్లో తేల్చాలని తాజాగా ఆదేశించింది…
పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపై ఇండియా ఆపరేషన్ సిందూర్ దాడుల వార్తల్లో ఈ వార్తకు పెద్ద ప్రాధాన్యం దక్కలేదు గానీ… నిజానికి చాలా ఇంపార్టెంట్ వార్తే… రాజకీయ నాయకులు, అక్రమార్కులకు స్వార్థంతో వంతపాడితే, సహకరిస్తే కీలక స్థానాల్లో ఉన్న కేంద్ర సర్వీసు అధికారులకు ఏ గతి పడుతుందో చెప్పే వార్త ఇది…
Ads
ఓ పెద్ద ఉదాహరణ… అన్ని రాష్ట్రాల్లో కేంద్ర సర్వీసుల అధికారులకు శ్రీలక్ష్మి కేసు ఓ లెసన్… నిజానికి చురుకైన, తెలివైన అధికారిణి ఆమె… కానీ అక్రమూర్ఖులతో చేతులు కలిపింది… అత్యున్నత పోస్టులకు ఎదుగుతుందీ అనిపించిన ఆమె చివరకు జైలుపాలై, ఆరోగ్యం దెబ్బతిని, మెంటల్ టార్చర్, పరువు బజారుపాలై, ఇప్పుడు మళ్లీ కోర్టు చుట్టూ తిరగాల్సిన దురవస్థ…
మొన్న ఇదే ఓఎంసీ కేసులో మైనింగ్ విభాగం అధికారి రాజగోపాల్‌కు ఏడేళ్లు ప్లస్ నాలుగేళ్ల జైలుశిక్ష వేసింది సీబీఐ కోర్టు… బెయిళ్లు, డబ్బులు వంటి గాలి జనార్దన్ రెడ్డి చాలా కథల దుర్వాసనలున్నాయి ఈ కేసులో, చదివాం, చూశాం, విన్నాం…
కేబినెట్ నిర్ణయం గానీ, అప్పటి మంత్రి నోట్ ఫైల్ గానీ ‘కేప్టివ్’ అని ప్రస్తావిస్తే, దాన్ని తీసేసి శ్రీలక్ష్మి జీవో ఇవ్వడమే ఈ మొత్తం కేసులో కీలకం… కేప్టివ్ అంటే మన సొంత ఉత్పత్తి కోసం ముడిఖనిజం వాడుకోవడం… కానీ ఆ పదం తీసేయడంతో గాలి జనార్దనరెడ్డి అడ్డగోలుగా గనులు తవ్వుకుని విదేశాలకు అమ్ముకుని కోట్లకుకోట్లు పడగలెత్తాడు… అదీ కేసు…
మరి కేసులో ఇదే కీలకమైనప్పుడు ఆమె నిర్దోషి ఎలా అవుతుందనేది సుప్రీంకోర్టు తాజా ఆదేశాల సారాంశం అనుకోవాలి… ఓఎంసీ కేసు ఓ కొలిక్కి వస్తోంది… ప్రజాప్రతినిధులపై కేసుల్ని త్వరగా తెమల్చాలని సుప్రీం చెబుతోంది… సీబీఐ కూడా కఠినంగానే వ్యవహరిస్తోంది… నాన్చే వైఖరి వదిలేసినట్టుంది…
అంటే… జగన్ అక్రమాస్తుల కేసు కూడా త్వరలోనే ఓ కొలిక్కి రావచ్చు… జగన్ మళ్లీ లేవకుండా ఉండాలంటే ఈ కేసులపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతోపాటు లిక్కర్ కేసును బలంగా జగన్ మెడకు చుట్టాలనే అభిప్రాయంతో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నట్టు చెబుతున్నారు…
ఇప్పుడు కూడా జగన్ బీజేపీ గుడ్ లుక్స్‌లోనే ఉన్నాడనే అభిప్రాయాలు ఉన్నా సరే… కేంద్రంలో ప్రభుత్వానికి చంద్రబాబు మద్దతు తప్పనిసరి… ఏపీలోనూ బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామి… అంటే, రాజకీయంగా జగన్ ప్రత్యర్థే పైపైన లెక్కల కోసం చూస్తే..! సో, చంద్రబాబు ఒత్తిళ్లనూ బేఖాతరు చేయలేదు…
జగన్ బెయిల్ రద్దు కోసం సీబీఐతో పిటిషన్ వేయిస్తారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి తాజాగా… సాయిరెడ్డిని బీజేపీ చేరదీస్తున్న తీరు కూడా విశేషమే… ఇదుగో సదరు ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సంబంధించిన ఆ వార్తకు ఇలా ప్రాధాన్యం ఉంది…!
సివిల్స్ ఎగ్జామ్స్ క్రాక్ చేసిన సక్సెస్ స్టోరీలు, ఐఏఎస్ అధికారుల విజయగాథలు చదువుతూ ఉంటాం కదా… ఇలాంటి ఫెయిల్యూర్ స్టోరీలు కూడా చెప్పుకోవాలి… కంట్రాస్టుగా..!
ఆమెకు జగన్ అన్నిరకాలుగా అండగా నిలబడ్డాడు, తమ అస్మదీయ అధికారిణి అనే భావనతో… తెలంగాణ కేడర్ నుంచి ఏపీ కేడర్‌కు రప్పించుకున్నాడు… ప్రమోషన్లు ఇచ్చాడు… అంతా ఇక సాఫీగా సాగిపోతుందనుకున్న తరుణంలో ఓఎంసీ కేసు మళ్లీ ఎదురుతన్నింది..!!
Share this Article