Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నమ్మలేని ‘న్యాయం’ – ఎంత మంచివాడవురా, ఎన్నినోళ్ల పొగుడుదురా…

July 5, 2026 by M S R

.

న్యాయం కోసం, ధర్మం కోసం… ఓ ఆదర్శ న్యాయమూర్తి.,.. అక్షయ్ కుమార్ ద్వివేది… 

దేశం యావత్తూ ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో కాలిపోయిన వందల కోట్ల నోట్ల కట్టల ఫోటోలు చూసి నివ్వెరపోయింది… న్యాయవ్యవస్థలోని అవినీతిని చూస్తూ నిశ్చేష్ట అయిపోయింది… ఇక న్యాయం ఎక్కడిది, ధర్మం ఎక్కడిది అని బిత్తరపోయింది…

Ads

ఓ చేదు నిజం తెలుసా..? ఈరోజుకూ సదరు జడ్జికి ఏమీ కాలేదు… కాదు, ఇదీ మన అన్యాయ వ్యవస్థ… పూర్తి కంట్రాస్టు, అంటే ఓ హార్డ్ కోర్ ధర్మపరాయణుడైన జడ్జి గురించి తెలుసుకుందామా..? ఇలాంటోళ్లే మన న్యాయవ్యవస్థకు క్రెడిబులిటీ… చప్పట్లు కొట్టడం కాదు, మనసులోనే ఓ దండం పెట్టుకోవాలి…

చూస్తేనే ఉన్నాం కదా,  న్యాయమూర్తులు అంటేనే భారీ కాన్వాయ్‌లు, ఎస్కార్ట్‌లు, ప్రభుత్వ వాహనాల హోరు అని మనం అలవాటు పడిపోయాం… కానీ, మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా కోర్టులో అడుగుపెడితే, మీకు అక్షయ్ కుమార్ ద్వివేది అనే ఒక విలక్షణమైన న్యాయమూర్తి కనిపిస్తారు. ఆయన కథ ఒక కథనంలా కాకుండా, ఒక నిశ్శబ్ద విప్లవంలా సాగుతుంది.

తల్లి కోరిన సంకల్పం… ఏ న్యాయమూర్తి అయినా సమాజంలో గొప్ప హోదా కోసం, గొప్ప ప్రోటోకాల్ కోసం చూస్తారు, కానీ ద్వివేది ప్రయాణం మాత్రం కేవలం తన తల్లి కోరికను తీర్చడం కోసం నిరాడంబరంగా మొదలైంది. న్యాయ వ్యవస్థలోకి రావాలని తన తల్లి కోరగానే, ఆ బాధ్యతను ఒక పవిత్రమైన యజ్ఞంలా స్వీకరించారు. ఆ రోజు నుండి, ఆయన వ్యక్తిగత జీవితం పూర్తిగా మారిపోయింది.

విలాసాలకు ఆమడదూరం… ఆయన ఒక అదనపు సెషన్స్ జడ్జి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయనకు ఉండాల్సిన విలాసాలు అన్నీ ఆయనకు అందుబాటులో ఉన్నాయి. కానీ, ఆయన ఏ ప్రభుత్వ కారునూ వాడరు, విలాసవంతమైన సౌకర్యాలను ముట్టుకోరు. తన వంట తానే వండుకుంటూ, ఒక చిన్న గదిలో నివసిస్తూ, అత్యంత సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. రోజువారీ కోర్టు విధులకు ఆయన కాలినడకనే వెళ్తుంటారు. ఆయన ఆస్తి అంటూ చూస్తే, తన తల్లి బహుకరించిన ఒక చిన్న మొబైల్ ఫోన్ మాత్రమే ఆయన వెంట ఉంటుంది.

నిజాయితీకి నిలువుటద్దం… ఆయన నిజాయితీ ఎంత గొప్పదంటే, తనకు వచ్చే ప్రభుత్వ వేతనం కూడా తనకంత అవసరం లేదని, దాన్ని సగానికి తగ్గించమని ఏకంగా మధ్యప్రదేశ్ హైకోర్టుకే దరఖాస్తు చేసుకున్నారు. తాను ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్నా, కనీస అవసరాలు తప్ప మరే ఇతర సౌకర్యాలు తీసుకోనని ఆయన స్పష్టం చేశారు.

ప్రజల పక్షపాతి… ఆయన చేసే పనిలో ఒక వేగం ఉంటుంది. ముఖ్యంగా సామాన్యులకు ఎక్కువగా ఇబ్బంది కలిగించే భూ వివాదాలను ఆయన చాలా వేగంగా పరిష్కరిస్తారు. ప్రజలకు వీలైనంత త్వరగా న్యాయం జరగాలనేదే ఆయన అసలైన లక్ష్యం.

ఒక వైపు న్యాయమూర్తిగా బాధ్యత, మరోవైపు సన్యాసం వంటి జీవితం— ఈ రెండింటినీ సమతుల్యం చేస్తూ అక్షయ్ కుమార్ ద్వివేది సమాజానికి ఒక గొప్ప మార్గాన్ని చూపుతున్నారు…. ఒక్కసారి ఆ మోడీ రక్షించిన సదరు హైకోర్టు జడ్జితో పోల్చండి…. అందుకే చెప్పేది… ఎంత మంచివాడవురా, ఎన్నినోళ్ల పొగుడుదురా…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నమ్మలేని ‘న్యాయం’ – ఎంత మంచివాడవురా, ఎన్నినోళ్ల పొగుడుదురా…
  • ఏ దేశమైనా విపత్తులో పడిపోతే… ముందుగా అక్కడ వాలేది ఇండియా..!!
  • పదే పదే ఓ కల… ముందుకు వెళ్తూ ఓ అమ్మ… వెనకాలే ఓ పిల్లాడు…
  • ఆల్రెడీ చూసి ఉన్నా సరే – ఈ ఆమని కళ్ళ కోసం మళ్ళీ చూడొచ్చు..!
  • కొత్త TRS vs కొత్త TRS -! పిల్ల పుట్టకముందే కుల్ల కుడితే ఇలాగే మరి!!
  • హేమిటో మరి… ఆ కురురాజ్య చక్రవర్తికీ ఇన్ని నగలు తొడగలేదేమో…
  • ఆదానీ పరుగుకు కేరళ కొత్త సీఎం బ్రేకులు! కాంగ్రెస్ మార్క్ ‘అడ్డు పుల్లలు’!
  • మీ ఇంట్లో ఓవెన్ ఉందా… అనడిగింది ఆమె ఆ బ్యాంకు మేనేజర్‌ను!
  • ‘పతివ్రత’ ఓ రేంజులో అదరగొట్టింది- అకస్మాత్తుగా మాయమైంది
  • పోడు వేధింపులకు తెర! ఆదివాసీల మెప్పు పొందిన రేవంత్!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions