Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ ఆలోచన, ఈ ఆచారం రష్యా నుంచి మనమూ నేర్చుకోవాలేమో…!

March 11, 2025 by M S R

ఈమధ్య చాలా సోషల్ మీడియా పేజీల్లో, వాట్సప్ గ్రూపుల్లో కనిపిస్తున్న ఓ పోస్టు చదవండి…



రష్యాలో వివాహ వ్యవస్థలో ” పెళ్లికంటే దేశభక్తి గొప్పది… సుధా నారాయణమూర్తి ఒక స్వీయ అనుభవాన్ని పంచుకుంటూ ఇలా రాశారు:

“ఇటీవల నేను రష్యాలోని మాస్కోలో ఉన్నప్పుడు… ఓ రోజు ఆదివారం అక్కడి పార్కుకి వెళ్లాను. వేసవి నెల, కానీ వాతావరణం చల్లగా ఉంది, కొద్దిగా చినుకులు పడుతున్నాయి. నేను గొడుగు కింద నిలబడి ఆ ప్రాంత అందాలను ఆస్వాదిస్తున్నప్పుడు, అకస్మాత్తుగా నా దృష్టి ఒక యువజంట మీద పడింది.

Ads

వాళ్ళు కొత్తగా పెళ్లయిన వారని స్పష్టంగా తెలుస్తోంది. ఆ అమ్మాయికి దాదాపు ఇరవై ఏళ్లు ఉంటాయి. అబ్బాయి కూడా దాదాపు అదే వయసులో, చాలా అందమైన సైనిక యూనిఫాంలో ఉన్నాడు.

ఆ అమ్మాయి ముత్యాలు, అందమైన లేస్‌తో అలంకరించబడి, శోభాయమానంగా ఉన్న అందమైన తెల్లటి శాటిన్ గౌను ధరించి ఉంది. ఆమె వెనుక, ఇద్దరు తోడు పెళ్లి కూతుర్లు నిలబడి, పెళ్లి గౌను మురికి కాకుండా దాని అంచుని ఎత్తిపట్టుకున్నారు.

ఆ కుర్రాడు తడవకుండా తలపై గొడుగు పట్టుకున్నాడు. అమ్మాయి ఒక పూల గుత్తిని పట్టుకొని ఉంది. ఇద్దరూ చేతులు ముడుచుకుని నిలబడ్డారు. ఆ దృశ్యం చాలా అందంగా ఉంది. నేను వారిని చూసి చాలా ఆశ్చర్యపోయాను,

‘పెళ్ళైన వెంటనే ఈ వర్షంలో ఇక్కడ ఈ పార్కుకు ఎందుకు వచ్చారా’ అని ఆశ్చర్యపోయాను… వారు కావాలనుకుంటే దీనికంటే ఇంకా అందమైన , ఆనందాన్నిచ్చే హనీమూన్ వంటి ప్రదేశానికి వెళ్లి ఉండవచ్చు కదానుకుంటూ. నేను వారినే చూస్తూండగా…

వారిద్దరూ కలిసి పార్క్ లో ఉన్న ఒక స్మారక చిహ్నం దగ్గర ఉన్న ఎత్తైన ప్లాట్‌ఫారమ్‌పై నడుస్తూ వెళ్లి, పుష్పగుచ్ఛాన్ని అక్కడ ఉంచి, మౌనంగా తలవంచుకుని, నెమ్మదిగా వెనక్కి వచ్చారు. నేను ఈ దృశ్యాన్ని చాలాసేపు ఆస్వాదించాను.

కానీ నాకు అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. నవ వధూవరులతో కలిసి నిలబడి ఉన్న ఓ వృద్ధుడిపై నాచూపు పడింది. ఆ పెద్దాయన కళ్ళు నా చీర మీద పడగానే “మీరు భారతీయులా?” అని అడిగాడు…

“అవును నేను భారతీయురాలినే” అని బదులిచ్చాను. కొన్ని ప్రశ్నలు అడుగుదామని ఎదురుచూస్తూ, కుతూహలంగా, అతనికి ఇంగ్లీష్ ఎలా తెలుసు అని అడిగాను. అతను బదులిచ్చాడు: “నేను విదేశాలలో పనిచేశాను.”

“ఈ యువ జంట తమ పెళ్లి రోజున యుద్ధ స్మారక చిహ్నం వద్దకు ఎందుకు వచ్చారో దయచేసి నాకు చెప్పగలరా?” అని అడిగాను.

“ఇది రష్యా ఆచారం, ఇక్కడ వివాహాలు తరచుగా శనివారం లేదా ఆదివారాలు జరుగుతాయి!” అని అతను చెప్తూ, “ఇక్కడ వివాహ కార్యాలయంలో రిజిస్టర్‌పై సంతకం చేసిన తర్వాత, ప్రతి వివాహిత జంట వాతావరణంతో సంబంధం లేకుండా సమీపంలోని ప్రముఖమైన జాతీయ స్మారక చిహ్నాలను సందర్శించాలి. ఈ దేశంలోని ప్రతి అబ్బాయి కనీసం రెండేళ్లపాటు సైన్యంలో పనిచేయాలి. అతని హోదా ప్రకారం, వివాహానికి తన సర్వీస్ యూనిఫాం మాత్రమే ధరించాలి”, అని వివరించాడు…

నేను చాలా ఆశ్చర్యపోయాను, “ఇక్కడ అలాంటి ఆచారం ఎందుకు ఉంది?” అని అడిగాను. అది విని, “ఇది కృతజ్ఞతాభావం. మా పూర్వీకులు రష్యా చేసిన వివిధ యుద్ధాలలో తమ ప్రాణాలను అర్పించారు. వాటిలో కొన్ని మేం గెలిచాం, కొన్ని ఓడిపోయాం, కానీ వారు ఎల్లప్పుడూ దేశం కోసమే త్యాగం చేశారు. కొత్తగా పెళ్ళైన ప్రతి ఒక్క జంట తమ పూర్వీకుల త్యాగం వల్లే తాము శాంతియుతమైన, స్వేచ్ఛాయుత రష్యాలో జీవిస్తున్నామని గుర్తుంచుకోవాలి. అందుకే వారి ఆశీర్వాదం తప్పనిసరిగా తీసుకోవాలి…”

“పెళ్లి వేడుకలకంటే దేశం పట్ల ప్రేమే ముఖ్యమని ఇక్కడి మాపెద్దల నమ్మకం. అందుకే మాస్కో అయినా, సెయింట్ పీటర్స్‌బర్గ్ లేదా రష్యాలోని మరే ఇతర ప్రాంతంలో అయినా, పెళ్లి రోజున సమీపంలోని యుద్ధ స్మారక చిహ్నం వద్దకు వెళ్లే, ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలని మేం పట్టుబడుతున్నాం…”

ఈ సంఘటన నా కళ్ళను నీళ్లతో నింపింది. ఈ గొప్ప ఆలోచన, ఆచారం గురించి మనం కూడా రష్యన్‌ల వద్ద నుండి నేర్చుకోవాలని నేను కోరుకున్నాను.  మన దేశం కోసం, మన ఈ రోజు కోసం, మన రేపటి కోసం – ప్రాణత్యాగం చేసిన అమరవీరులను మనం కూడా గౌరవించవచ్చు,…!



బాగుంది… కానీ కాస్త క్లారిటీ అవసరం… రష్యాలో నూతన వధూవరులు సైనికుల స్మారక స్థూపాల వద్ద పూలు సమర్పించడం తప్పనిసరేమీ కాదు. ఇది ఒక సంప్రదాయం మాత్రమే…

  • రష్యాలో పెళ్లి వేడుకలలో భాగంగా, చాలా మంది నూతన వధూవరులు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళులర్పించడానికి స్మారక స్థూపాలను సందర్శిస్తారు.
  • రెండవ ప్రపంచ యుద్ధంలో రష్యా (అప్పటి సోవియట్ యూనియన్) భారీ నష్టాలను చవిచూసింది. అందుకే, ఈ సంప్రదాయానికి అక్కడ ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

కొన్ని జంటలు ఈ సంప్రదాయాన్ని పాటిస్తే, మరికొందరు పాటించకపోవచ్చు. ఇది వ్యక్తిగత ఎంపికపై ఆధారపడి ఉంటుంది… దీనిని రష్యాలో ‘వెడ్డింగ్ రూట్’ అని కూడా అంటారు…



18 నుంచి 27 సంవత్సరాల వయస్సు గల పురుషులు తప్పనిసరిగా ఒక సంవత్సరం (పూర్వం రెండేళ్లు, 2008లో తగ్గించారు) సైన్యంలో సేవ చేయాలి.

కొంతమంది విద్యార్థులకు ఆరోగ్య కారణాల వల్ల మినహాయింపులు ఉంటాయి. 2023లో రష్యా ప్రభుత్వం ఆయుష్షును 30 సంవత్సరాలకు పెంచింది, అంటే 18- 30 మధ్యవారిని ఆర్మీకి ఆహ్వానించవచ్చు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఆర్మీ నియామకాలను పెంచారు, కొంతమంది ఐచ్ఛికంగా 2 సంవత్సరాల ప్రొఫెషనల్ కాంట్రాక్ట్ సేవ ఎంచుకోవచ్చు, దీని వల్ల అధిక జీతం, ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. అయితే, ప్రస్తుతం రెండేళ్లు తప్పనిసరి అనే నిబంధన లేదు. తప్పనిసరి సైనిక సేవా కాలం ఒక సంవత్సరం మాత్రమే…



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions