.
అయ్యయ్యో… బుద్దిలేని హిందూ వ్యతిరేకతతో మొత్తం సమాజానికి దూరమై చతికిలపడ్డాం… ఇకనైనా అన్ని గుళ్లకూ వెళ్లాలి, మాకూ హిందువులు దూరం కాదు, అన్యమతస్తుల పార్టీ కాదు అని చాటుకోవాలి… బాబ్బాబు, మేమూ మీవాళ్లమే…
…. అని సోకాల్డ్ సీపీఎం అనబడే మన శతృదేశం చైనా వాడి కట్టు బానిస పార్టీ ఆమధ్య లెంపలేసుకుంది కదా… ఇకపై హిందూ ఉత్సవాలకు హాజరవుదాం అని తీర్మానం చేసుకుంది కదా… కానీ ఆ తోక ఎప్పుడూ వంకరే…
Ads
తాజాగా ప్రజాశక్తి అనబడే ఓ ఎర్ర పార్టీ పత్రికలో ఓ ఆర్టికల్ కనిపించింది… ఎవరో సంకుచిత ఎర్రెర్రని మేధావి కావచ్చు…. నార్నె వెంకట సుబ్బయ్య అట… ఎర్ర పార్టీలో జీతం తీసుకుని బతికే ఫుల్ టైమ్ కార్యకర్తో, లీడరో కావచ్చు… ఇలా రాశాడు…
జనవరి 13 నుండి ప్రయాగలో 45 రోజుల పాటు మహా కుంభమేళా జరుగుతుంది. 40 కోట్ల మంది భక్తులు వస్తారు… ‘పుష్కరాలలో మునిగి పుణ్యం సంపాదించుకోండి’ అంటూ తెగ ప్రచారం జరుగుతున్నది… లక్షలాది మంది ప్రజలు నీళ్ళలో మునిగితే వచ్చేది పుణ్యం కాదు… అంటు రోగాలన్న విషయం గుర్తుంచుకోవాలి…
ఎందుకంటే నీళ్లలో మునిగినపుడు, మనం స్నానం చేస్తున్నపుడు సహజంగా మూత్రం వదులుతాం… అది జీవ లక్షణం… మరి పుష్కరాలలో అన్ని లక్షల మంది మునిగినపుడు పరిస్థితి ఏంటి..? అన్ని లక్షల మందికి టాయిలెట్లు కూడా ఉండవు… మరి నీళ్ళలో మునిగినపుడు ఆ నీళ్ళు తప్పని పరిస్థితుల్లో నోట్లోకి పోతాయి…
అది పవిత్రమా! అలాగే అఘోరీలు కూడా లక్షలమంది మునుగుతారు. కనుక పుష్కరాలలో మునిగి అంటురోగాలు తెచుకోవద్దని మనవి. పైగా పుష్కరాలలో మునిగితే పుణ్యం వస్తుందని ప్రభుత్వాలు ప్రచారం చెయ్యటం రాజ్యాంగ విరుద్ధం….’’
ఇవీ సదరు వదరుబోతు కూతలు… ఈ మాట అనడానికి సాహసిస్తున్నా… సీపీఎం ఎప్పుడూ హిందూ వ్యతిరేకమే… డౌట్ లేదు… ఏవో డ్రామాలు, కొత్త నాటకాలతో హిందువులు మాకు వ్యతిరేకం కాదు అని చెప్పడానికి గుళ్లకు వస్తారట, ఉత్సవాల్లో పాల్గొంటారట… ఈ కుంభమేళా మీద విషం చూశారు కదా… అదే ఎర్రోడి అసలు తత్వం…
హార్ష్‌గా ఉన్నా సరే, వాడెప్పుడూ శత్రుపక్షమే… జాతి వ్యతిరేకమే… ప్రతి పుష్కరానికీ 30, 40 కోట్ల మంది వస్తున్నారు, అంటురోగాలు ఎక్కడ ప్రబలాయిరా అని ఎవడూ అడగకపోవడమే వీరి బలం… సమ్మక్క సారలమ్మ జాతర తెలుసు కదా…
3 రోజుల్లో కోటి మంది గద్దెలను టచ్ చేస్తారు… జంపన్నవాగులో స్నానాలు చేస్తారు, చంటిపిల్లలకు పుట్టువెంట్రుకలు కూడా తీస్తారు… ఏవిరా అంటురోగాలు అనడిగేవాడు లేడు కదా… వీళ్ల అరాచకాల్ని ప్రచారం చేసేవాడు లేక… ఒక్క నందిగ్రామ్ కథలు చాలు కదా… ఎర్రోళ్ల నిజరూపాలు, సోకాల్డ్ అసలు తత్వాలు తెలియడానికి… అందరూ అనుకుంటారు మనకు శత్రువులు పాకిస్థాన్, చైనా అని… కానీ…!?
Share this Article