Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సపోజ్… పర్ సపోజ్… అనసూయ జబర్దస్త్‌ను వీడాల్సిన పరిస్థితే వస్తే…!!

February 25, 2022 by M S R

సపోజ్… పర్ సపోజ్… అనసూయ జబర్దస్త్‌ను వీడాల్సిన పరిస్థితే వస్తే..? ఆ ప్లేసులోకి ఎవరొస్తే బెటర్..? ఎవరొచ్చే చాన్సుంది..? మల్లెమాల శ్యాంరెడ్డి ఎవరిని ప్రిఫర్ చేస్తాడు..? ఇంట్రస్టింగు ప్రశ్నలు కదా… ఈ ప్రశ్నలు ఎందుకు తలెత్తాయంటే… ఈమధ్య అనసూయకు, హైపర్ ఆది అండ్ జబర్దస్త్ డైరెక్టర్ మణికంఠకూ నడుమ గొడవ జరిగింది… మాటామాటా పెరిగింది…

ఎహె, ఊరుకొండి, అనసూయ మీద హైపర్ ఆదికి లవ్వు, ఆమెకూ ఆది మీద మస్తు సాఫ్ట్ కార్నర్, అందుకే తను ఎన్ని పంచులు వేసినా ముసిముసి నవ్వులు నవ్వుతుందే తప్ప కిక్కుమనదు… అలాంటిది ఆదితో ఆమెకు గొడవేమిటి..? పైగా అనసూయ కావాలో, నేను కావాలో తేల్చుకొండి అని మల్లెమాల టీంకే ధమ్కీ ఇచ్చే స్థాయిలో జరుగుతుందా..? నో, నో, మేం నమ్మలేం అంటారా..?

nandita

Ads

నమ్మలేనివి చాలా జరుగుతుంటయ్… అసలే స్టార్ కమెడియన్లు వెళ్లిపోతున్నారు… జబర్దస్త్ మరీ నాసిరకంగా మారిపోయింది… త్వరలో కంట్రాక్టు గడువు ముగియనున్న సుడిగాలి సుధీర్ కూడా ఉంటాడో లేదో తెలియదు… ఢీ రేటింగ్స్ ఢమాల్… ఈ స్థితిలో అనసూయను వదులుకునే సాహసం చేస్తారా..? నిజంగా మల్లెమాల టీంలో ఆది అంత పాతుకుపోయాడా..? ఐనా జబర్దస్త్ నుంచి వెళ్లడం, రావడం తనకు పాత అనుభవమే కదా… జబర్దస్త్ పోతేపోయింది, నాలుగు సినిమా చాన్సులు వస్తూనే ఉన్నయ్ కదా అని వెళ్లిపోతుందా..?

susmitha analaa

ఈ చర్చ ఒకటి టీవీ సర్కిళ్లలో హఠాత్తుగా జరుగుతోంది… అంతేకాదు, ఆమెకు ఆల్టర్నేట్‌గా ఎవరిని అన్వేషిస్తున్నారు అనేదీ చర్చే… నిజానికి ఓ నాన్-ఫిక్షన్ షోలో, అదీ జబర్దస్త్ వంటి కామెడీ షోలో జడ్జిలు గానీ, యాంకర్లు గానీ చేసేదేముంది..? నవ్వొచ్చినా రాకపోయినా పడీ పడీ నవ్వాలి… ఎపిసోడ్‌కు ముందు నాలుగు గెంతులు వేయాలి… కానీ కాస్త చూడబుల్ అందం ఉండాలి…

శ్రీముఖి, ఝాన్సీ, ఉదయభాను వంటి సీనియర్ యాంకర్ల జోలికి మల్లెమాల వెళ్లే ప్రసక్తే లేదు… అలాగే వెళ్లిపోయిన వర్షిణి, లాస్య, దీపిక పిల్లి వంటి యాంకర్లనూ మళ్లీ రమ్మనకపోవచ్చు… సుమ ఇలాంటి షోలకు పనికిరాదు… ఆమె చేయదు… విష్ణుప్రియ కూడా పాతదైపోయింది… అయితే రష్మినే రెండు జబర్దస్త్ షోలకూ పనిచేయించుకోవచ్చు… ఆమెకు ఎలాగూ వేరే షోలు ఏమీ లేవు ప్రస్తుతం… హాయిగా చేస్తుంది… లేదు, కాస్త డిఫరెంటుగా ట్రై చేయాలనుకుంటే…?

madhumita

మధుమిత అలియాస్ స్వప్నమాధురి పేరు ఒకటి పరిశీలనలో ఉందట… ఆమె ఎవరో కాదు, గతంలో సినిమాల్లో కూడా నటించిన తారే… శివబాలాజీ భార్య… చూడబుల్ ఫేస్… కానీ అప్పుడే నలభై ఏళ్లు… అయితేనేం, అనసూయ 36 ఏళ్ల వయస్సులో చేయడం లేదా అంటారా..? అంతే..! మరో ఆప్షన్ అనలా సుస్మిత… ఇప్పటికే ఢీ షోలో చేస్తోంది ఆమె… పర్లేదు… మరో బెటర్ ఆప్షన్ నందిత శ్వేత… ఢీలో జడ్జిగా అలవాటైపోయింది… ఆమెకు నవ్వు ఓ అసెట్… ఏమో… రమ్మనాలే గానీ హారిక, తేజస్వి, సరయు… ఎందరు లేరు..?!

rashmi

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈవారం తెలుగు టీవీ వినోద చానెళ్ల స్థితిగతులు, రేటింగులు ఇవీ…
  • తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో ప్రస్తుతం ఎవరు ఏ ప్లేసులో..?!
  • బాలయ్య దంచూదంచూ అని దరువేశాడు గానీ… దంచికొట్టింది భానుమతే…
  • ఫాఫం అనసూయ..! కాస్త మారిందేమో అనుకున్నారా..? నో, నెవ్వర్..!!
  • ట్రంపుపై మస్క్ పేల్చిన చీకటి బాంబు… అమెరికాలో కలకలం… అసలు కథ ఇదీ…
  • దిక్కుమాలిన క్షుద్రానువాదాలు… దరిద్రపు పర్యవేక్షణ అంటే ఇదే…
  • సిల్క్ స్మిత హర్టయ్యింది… ఆ గ్రేట్ కొరియోగ్రాఫర్ కెరీర్ క్లోజయ్యింది…
  • కథ కన్నీళ్లు పెట్టిస్తుంది… కానీ ఈ కథ ఎక్కడిది..? ఎవరిది..? ఆ కథేమిటి..?!
  • టెలిగ్రాఫ్ వ్యాఖ్య… జర్మనీలో ఇది మరో ఆపరేషన్ సిందూర్ అట…
  • ఆ పాటల షోలో ఇంకా ఆ ప్రవస్తి పాడుతూనే ఉంది ఫాఫం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions