రాంగోపాలవర్మ వ్యాఖ్యలు చాలా చిరాకు పుట్టిస్తాయి… తన సినిమాలు చూస్తున్నట్టుగానే…! తనను ఇంటర్వ్యూ చేసేవాళ్లను కూడా ఓ అబ్జెక్టుగా చూస్తూ ఏవో పిచ్చి, అసభ్య కామెంట్లు చేస్తాడు…. తన సినిమాల్లోని బూతులాగే…! మాట్లాడితే తొడలు, తుపాకులు… వివాదాలు…! ఈమధ్య తనను ఇంటర్వ్యూ చేసేవాళ్లు కూడా తిక్క ప్రశ్నలు వేసి, ఏవో తిక్కర్, తిక్కెస్ట్ సమాధానాలు ఆశించి, వాటినే ప్రమోట్ చేసుకుని, ప్రోమోలు కట్ చేసుకుని, నాలుగు ఎక్కువ వ్యూస్ కోసం ప్రయత్నిస్తున్నారు… మరీ శృతి మించి..! రీసెంటుగా ఒక ఇంటర్వ్యూయర్ అతి భరించలేక వర్మ మైక్ పీకేసి, రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని చక్కా వెళ్లిపోయాడు…
నిన్ను బికినీలో చూడాలని ఉంది, గోవాలో బికినీ అమ్మాయిల్ని చూస్తూ ఎంజాయ్ చేస్తా, బిగ్‌బాస్‌లో 150 కెమెరాలు పెట్టుకోనివ్వండి, యాభై మంది లేడీ కంటెస్టెంట్లతో గడుపుతా……….. ఇలా సమాధానాలు అలవోకగా వస్తాయి వర్మ నోటి నుంచి… నిజంగా ఈ ప్రశ్నలు దేనికి..? ఈ జవాబులు దేనికి..? వర్మ ద్వారా ఓ తిక్క కామెంటుకు గురైన ఆరియానా ఇప్పుడు బిగ్‌బాస్ ఫైనలిస్టు… వర్మ కారణంగానే ఆమె బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది… ఇక ఆ తరువాత లేడీ ఇంటర్వ్యూయర్లు చాలామంది వర్మను ఇంటర్వ్యూ చేస్తూ… మరీ ‘అతి’ చేసేస్తున్నారు… అఫ్ కోర్స్, కొందరు మగ ఇంటర్వ్యూయర్లు కూడా…!!
Ads
ఇక్కడ వర్మలోని మరో కోణం చాలామంది టచ్ చేయడం లేదు గానీ… చాలా అంశాలపై వర్మకు చాలా లోతైన అవగాహన ఉంది… తనకంటూ ఓ లైన్ ఉంటుంది… దేవుళ్లు, పురాణాలు, పురాణపాత్రలు, స్వాములు, అహం బ్రహ్మాస్మి, అంతా మిథ్య సహా అనేక భిన్నాంశాల మీద నిక్కచ్చిగా తన అభిప్రాయాలను చెప్పగలడు… కానీ అసలు ఆ ప్రశ్నలు వేసేవాళ్లు ఎవరని..?!
అంతటి చలమే చివరిరోజుల్లో చాలా మారిపోయాడు… చలం తాత వంటి వర్మ కూడా అలాగే అయిపోతాడా వంటి ప్రశ్న… బహుశా వర్మ కూడా అంచనా వేయలేదేమో… తనకు ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయని…! అందుకే వైజయంతి చేసిన ఇంటర్వ్యూ పట్ల వర్మ తన సహజ, తాజా ధోరణికి భిన్నంగా గౌరవాన్ని, మర్యాదను కనబరిచాడు… అదీ ఇప్పుడు మనం చెప్పుకునే విశేషం… ‘‘నిండుగా బట్టలేసుకుని ఓ సంప్రదాయ వస్త్రధారణతో ఒక మహిళ మెచ్యూర్డ్ ఇంటర్వ్యూ చేయడమే నాకు ఆశ్చర్యంగా ఉంది… నా జీవితంలోనే ఫస్ట్ టైమ్ ఈ అనుభవం…’’ అని వర్మ స్వయంగా నవ్వుతూ చెప్పడం అరుదైన సంగతే…
ఈ ఇంటర్వ్యూలో ఆమె ఏం ప్రశ్నలు వేసింది..? దానికి ఆయన ఎలా జవాబులు చెప్పాడు..? అనేది మనం ఇక్కడ చెప్పుకోవడం లేదు… వర్మ గురించే… ఇంటర్వ్యూయర్‌ను బట్టి, వాళ్లు వేసే ప్రశ్నలను బట్టే వర్మ తిక్క జవాబులు ఎలా ఉంటాయో… నిజంగా లోతైన ఇష్యూస్ గనుక ప్రస్తావిస్తే మనం ఆశ్చర్యపోయే జ్ఞానాన్ని ప్రదర్శిస్తాడు… అవీ తన అసలు డెప్త్ బయటపెట్టగలవు…
అఫ్ కోర్స్… చాలా అంశాలపై తనతో మనం ఏకీభవించకపోవచ్చు… అది తన స్థాయికి మనం చేరకపోవడం కావచ్చు లేదా తను పర్వర్టెడ్ అని మనలో ఒక ప్రిజుడిస్ భావన ఉండటం కావచ్చు… నిజంగానే వర్మ పర్వర్షనే కావచ్చు… కానీ ప్రశ్న లోతు, సంక్లిష్టత ఎలాంటిదైనా సరే, ఓ సగటు సినిమా వ్యక్తిలాగా గాకుండా… వర్మ చాలా మెట్లపైన కూర్చుని కనిపిస్తాడు…
ఇంటర్వ్యూ బాగుంటే… తను ఎలా ఎంజాయ్ చేస్తాడో, ఎలా మర్యాదను ఇస్తాడో చెప్పటానికి ఇదుగో ఈ ట్వీటే ఉదాహరణ…
అహం బ్రహ్మస్మి పేరిట ఈ ఇంటర్వ్యూ యూట్యూబ్‌లో ఉంది… ఆసక్తి ఉన్నవాళ్ల కోసం ఆ లింకు ఇదుగో… ‘‘రామాయణం గనుక నేను తీయాల్సి వస్తే రంగనాయకమ్మ రాసిన రామాయణం తీస్తా… రాముడు అడవులకు వెళ్లే ముందురోజు దశరథుడు, కైకేయి ఏం మాట్లాడుకుని ఉంటారనేది ప్రధాన పాయింటుగా ఓ సినిమా తీస్తాను…’’ ఇటువంటి జవాబుల కోసం…
Share this Article