Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అసూర్యంపశ్య…! ఎండ కన్నెరుగని సుతారం బతుకులు అనారోగ్యమే..!!

May 24, 2025 by M S R

.

అసూర్యంపశ్య… తెలుగులో ఈ పదం విన్నారా ఎప్పుడైనా..? సింపుల్‌గా చెప్పాలంటే ఎండ కన్నెరుగని మహిళ… అంటే, ఎండ పొడ తగలకుండా బతికే బాపతు… అంటే, కోటల్లో, గడీల్లో ఉంటూ సుతారంగా బతికే స్త్రీలు…

ఒకవేళ బయటికి వచ్చినా సరే, ఏమాత్రం ఎండ, అంటే సూర్యరశ్మి తగలకుండా, తగిలితే తెల్లటి ఛాాయ కాస్తా మసకబారుతుందనే భావన… ఇప్పుడూ చాలామంది ఉన్నారు… ట్యానింగ్ (నలుపు) దరిచేరకుండా ఉండటానికి, తమ ఫెయిర్ స్క్రీన్ పోతుందని భయంతో చాలామంది అసూర్యంపశ్యలు అవుతున్నారు…

Ads

బ యటికి వెళ్లినప్పుడు ఏమాత్రం ఎండ తమ దేహం మీద పడకుండా ఫుల్ కవర్ చేసుకుని ఉంటారు… సరే, వాళ్లిష్టం అంటారా..? నో… అది పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది… గతం వేరు, ప్రస్తుతం వేరు…

ఉదాహరణ చెప్పుకుందామా..? చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లోని చెంగ్డుకు చెందిన 48 ఏళ్ల మహిళ నిద్రలో బెడ్ మీదే అటు నుంచి ఇటు తిరిగింది… అంతే, ఎముక విరిగింది… కారణం, ఆమెకు ఆస్టియోపోరోసిస్ అనే ఎముకలు పెళుసుగా మారిపోయిన వ్యాధి పెరిగింది…. అదెందుకు వచ్చింది..? ఎండ తన మీద పడనివ్వకుండా ఏళ్లుగా గడుపుతూ ఉండటం వల్ల…

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వార్త ఏమిటంటే..? ఆ స్త్రీ చిన్నప్పటి నుండి ఎండకు దూరంగా ఉండేది, బయటికి వచ్చినా దేహాన్ని ఫుల్ కవర్ చేసుకునేది… ఏముంది..? ట్యానింగ్ భయం… ఛాయ తగ్గుతుందని భయం… సౌందర్య స్పృహ అందామా..?

జిండు హాస్పిటల్ ఆఫ్ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ అత్యవసర విభాగం వైద్యుడు డాక్టర్ లాంగ్ షువాంగ్ నాన్సెన్స్ అని కొట్టిపారేస్తున్నాడు… అతనే ఈ కేసు వివరాలు బయటపెట్టాడు… సూర్యరశ్మి నుంచి తప్పించుకోవడం అనేది విపరీత ధోరణి… దానివల్ల ఆమెకు విటమిన్ డి లోపం ఏర్పడింది… అది కాల్షియం శోషణలో ప్రధానమైంది…

ఆ విటమిన్ లేకపోవడంతో కాల్షియం కూడా శోషణ లేక ఆస్టియోపోరోసిస్ వచ్చింది… ఇది ఏ మేలుకొలుపు ఉదాహరణ… విటమిన్ డి ఇమ్యూనిటీ కూడా ప్రధానమే… దీని ఆవశ్యకత ఏమిటో మొన్నటి కరోనా విపత్తులో అందరికీ తెలిసొచ్చింది… ఐనాసరే, ఇంకా చాలామంది మారడం లేదు… నగరాల్లో ఎండపొడ తగలని ఇళ్లు ఎన్నో కదా, వాళ్లకూ ఇదే ప్రాబ్లం…

కాసేపు ఎక్కడైనా ఎండల్లో ఉండండి అంటారు వైద్యులు… (మండే ఎండ కాదు)… కానీ చాన్స్ ఏది..? వాకింగుకే స్థలం దొరకని ఇరుకు నగరాల్లో ఇక సూర్యుడికి ఏం చాన్స్ ఉంది..? ఇప్పుడు ఈ చైనా కేసు ఆ దేశంలో ఆరోగ్య చర్చకు దారితీస్తోంది…

గ్వాంగ్‌జౌ మెడికల్ యూనివర్సిటీలోని సెకండ్ అఫిలియేటెడ్ హాస్పిటల్‌లో చీఫ్ ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్ జియాంగ్ జియావోబింగ్ ఒక ఆన్‌లైన్ వీడియోలో ఇటువంటి పద్ధతుల వల్ల కలిగే అనాలోచిత పరిణామాల గురించి హెచ్చరించాడు… అదీ వైరల్…

మన శరీరంలోని అన్ని ఎముకలు ప్రతి 10 సంవత్సరాలకు పునరుత్పత్తి అవుతాయి, కానీ 30 సంవత్సరాల వయస్సు నుండి, సంవత్సరానికి 0.5 నుండి 1 శాతం చొప్పున ఎముక ద్రవ్యరాశిని కోల్పోవడం ప్రారంభమవుతుంది… తక్కువ కాల్షియం తీసుకోవడం, సూర్యరశ్మి లేకపోవడం, విటమిన్ డి లోపం ఇవన్నీ కాల్షియం శోషణకు ఆటంకం కలిగిస్తాయి… అఫ్‌కోర్స్, అస్థిర జీవనశైలి, ధూమపానం, అధిక మద్యపానం కూడా కారణాలే’’ అంటాడాయన… కూడా ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి…”

విటమిన్ డి సప్లిమెంట్లు దొరుకుతున్నా సరే, అవి ఖరీదు, ఎండను మించి విటమిన్ డి సోర్స్ మరొకటి లేదు, ధూమపానం, మద్యపానం పరిమితం చేయాలి, మరీ ముఖ్యంగా రుతుక్రమం ఆగిన మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి” అని ఆయన సలహా ఇచ్చాడు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • భారీ సిక్స్ కొట్టాడు… అభినందనలు రాలేదు… చిలుం వదిలింది…
  • హరిహరా..! సమస్య లేదంటున్నావా..? నీకు సమస్య కావద్దంటావా..?
  • అసూర్యంపశ్య…! ఎండ కన్నెరుగని సుతారం బతుకులు అనారోగ్యమే..!!
  • … ఇంతకీ కుందరదన అంటే తెలుగులో అర్థమేమిటి చిరంజీవీ…
  • మిథున్ డిస్కోడాన్సర్‌తో పోలిక… బాలయ్య డిస్కోకింగ్‌కు శాపమైంది…
  • బ్రహ్మోస్ అంటేనే బ్రహ్మాస్త్రం… అది మన యుద్ధసామర్థ్య ప్రకటన…
  • ఒక నరేంద్ర, ఒక ఈటల, ఒక విజయశాంతి… సేమ్, ఒక కవిత..?!
  • స్వరజ్ఞానం లేకపోతేనేం… వెంటాడే ట్యూన్లతో వెండితెరను ఊపేశాడు…
  • పక్కా కమర్షియల్ చట్రంలోనే ఓ ఫిలాసఫీ చెబుతాడు త్రివిక్రముడు…
  • …. ముఖ్య అతిథి సీఎం గారి పెళ్లాం అని తెలియకపోతే ఎలా మరి..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions