Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హవ్వ… ఒక్క తెలుగు సినిమా కూడా ఎంపిక కాలేదా..? ఎంత అప్రతిష్ట..!?

October 24, 2023 by M S R

ముందుగా తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు, రచయిత Prabhakar Jaini…. పోస్టు చదవండి ఓసారి… ఇదుగో…



వాల్తేరు వీరయ్య-Waltair Veerayya

వీరసింహారెడ్డి-Veerasimha Reddy

Ads

కార్తికేయ 2-Karthikeya 2

మట్టి కథ-Mattikatha

సర్-Sir Telugu & Tamil

ఉగ్రం-Ugram

యశోద-Yashoda

వీబీవీకే-VBVK

విరూపాక్ష-Virupaksha

రైటర్ పద్మనాభం-Writer Padmanabham

సీతారామం-Seetaramam

వంశాంకుర-Vamshankura

వారిసు-VARISU

మేమ్ ఫేమస్-MEMU FAMOUS

బింబిసార-Bimbisara

బేబీ-BABY

అన్నపూర్ణ స్టూడియో-Annapurna Studio

పై సినిమాలన్నీ మన తెలుగు నిర్మాతలు, 54 వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, గోవా (ఇండియన్ పనోరమా సెక్షన్) కు పంపించినవి. మొత్తం అన్ని భారతీయ భాషల నుండి 25 సినిమాలను ఎంపిక చేస్తే, తెలుగు సినిమా ఒక్కటి కూడా లేదు. మన సినిమాల గొప్పదనం అది.

15 ఆగస్టు, 2022 లోపల సెన్సార్ అయిన సినిమాలే పోటీలకు అర్హత సంపాదించాయి. నా ‘ప్రజాకవి కాళోజీ’ సినిమా ఆ లోగా సెన్సార్ కాలేదు. వచ్చే సంవత్సరం తప్పక పంపిస్తాను.



ఇదీ పోస్టు… 25 సినిమాల్ని ఎంపిక చేస్తే అందులో ఒక్క తెలుగు సినిమా పేరు లేదు… 17 సినిమాలు… అందులో కమర్షియల్ హిట్స్ ఉన్నయ్, ఫ్లాపులు కూడా ఉన్నయ్… అయితే ఇవన్నీ 15 ఆగస్టులోపు సెన్సార్ అయిన సినిమాలు మాత్రమే… ఐనా సరే, ఒక్క ఫిలిమూ ఎంపిక కాకపోవడం మన సినిమాల నాణ్యతలేమిని పట్టిచూపే నిదర్శనం… ఒకవేళ నిజంగానే ఒకటోరెండో సినిమాలు ఎంపికైనా సరే, ఏమైనా అవార్డులు వస్తాయా అనేదీ డౌటే…

ప్చ్… ఆస్కార్‌కైనా సరే ప్రైవేటు ఎంట్రీలు, లాబీయింగులు, డబ్బు ఖర్చులు ఎట్సెట్రా వేషాలు వేయొచ్చు… మొన్న ఓ అవార్డు కూడా కొట్టాం కదా… ఆస్కార్ అవార్డుల డొల్లతనం బహిర్గతం చేస్తూ…! మరి ఆఫ్టరాల్ ఏ దేశవాళీ, దేశస్థాయి ఫిలిమ్ ఫెస్టివల్ కోసం ఆ ప్రైవేటు ఎంట్రీల అవకాశం ఎందుకు ఉండకూడదు అధ్యక్షా..? బలగం సినిమా ఆ గడువు తేదీలోపు సెన్సార్ కాలేదు కాబట్టి బహుశా అది వచ్చే ఫిలిమ్ ఫెస్టివల్‌కు ఎంపిక అవుతుందేమో… సరే, మళ్లీ ప్రభాకర్ జైనీ మాటల్లోనే చెప్పాలంటే…

‘‘అభూత కల్పనలు, మానవ మాత్రులకు సాధ్యం కాని ఫైట్లు, కాలం చెల్లిన ప్రేమ కథలు, పిచ్చి పాటలు… వీటన్నింటిని జ్యూరీలు ఎన్నో దశాబ్దాలుగా చూసి ఉంటారు. మనుమరాళ్ళ వయసున్న హీరోయిన్లతో గంతులేస్తుంటే మనకు నచ్చుతుందేమో కానీ, బయటివారికి ఎబ్బెట్టుగా ఉంటుంది. ఒక పాయింటు కూడా నిజమే. రాజకీయాలు తప్పక ఉన్నాయి. ఈసారి కన్నడ, మలయాళం సినిమాలు ఎక్కువగా ఎంపికయ్యాయి. కారణం నేను చెప్పనవసరం లేదు. తెలుగు వాళ్ళను ఎవరినైనా పెడితే వాళ్ళు పెద్ద సినిమాలకే కొమ్ము కాస్తారు…’’

వీటిల్లో సీతారామం సినిమాకు ప్రేక్షకుల నుంచి కొంత అప్లాజ్ వచ్చింది, నిర్మాతలకు డబ్బులు కూడా బాగానే వచ్చాయి… వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిల గురించి చెప్పుకోవడం దండుగ… కార్తికేయ-2 హిట్టే, కానీ ఉత్తమ సినిమాలకు, ప్రదర్శనలకు పోటీపడే కంటెంట్ మాత్రం కాదు… బేబీ కాస్త బెటర్… కానీ పోటీలో నిలబడలేకపోయింది… ఒకవైపు మనకు ఈసారి బోలెడు జాతీయ అవార్డులు వచ్చాయి… కానీ ఇదే ఇండస్ట్రీ ఓ ఫేమస్ ఫిలిం ఫెస్టివల్ కోసం ఒక్క సినిమాను ఇవ్వలేకపోయింది… వావ్… ఏం కంట్రాస్టు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions