ఓసారి ఓ ప్రసిద్ధ మేధావిని కలిసినప్పుడు ఓ ప్రపంచ అందగత్తె … మనం పెళ్లి చేసుకుందాం, మనకు పుట్టబోయేవాడు నా అందంతో, మీ తెలివితో పుడతాడు అని అడిగిందట… ఆయన ఆశ్చర్యపోయి, ఆమెను ఎగాదిగా చూసి నవ్వుతూ… నిజమే గానీ, వాడు నీ బుద్దితో, నా అందంతో పుడితే ఎలా అన్నాట్ట…
ఎప్పుడో చదివినట్టు గుర్తు ఇది… నటి జ్యోతిక ప్రెస్ మీట్ వార్త చదువుతుంటే హఠాత్తుగా ఇదెందుకు గుర్తొచ్చిందో కూడా తెలియదు… కానీ ఒక్కటి మాత్రం నిజం… నోరు తెరవకుండా ఉన్నన్నాళ్లూ మన అజ్ఞానం బయటపడకుండా ఉంటుంది, జనం కూడా వీడికి బాగా తెలిసే ఉండొచ్చులే అనుకుంటారు, మన బుర్రలేనితనం కప్పబడిపోతుంది… సినిమా హీరోలు, సెలబ్రిటీలు, ప్రత్యేకించి హీరోయిన్లు…
అందం, ఐశ్వర్యం, మంచి పాపులారిటీ, ఫాలోయింగ్, మంచి కుటుంబం ఎట్సెట్రా అన్నీ ఉన్నంత మాత్రాన దిమాక్‌లో చటాక్ గుజ్జు ఉంటుందని అనుకోలేేం… అనుకోకూడదు కూడా… మరీ ప్రత్యేకించి ప్రాపంచిక అంశాలపై ఏమాత్రం అవగాహన ఉంటుందని కూడా అనుకుంటే అది మన భ్రమ… ఇంతకీ జ్యోతిక కథేమిటంటే… ఏదో సినిమా ప్రమోషన్‌కు సంబంధించిన ప్రెస్ మీట్… ఓ విలేకరి ఓ ప్రశ్న లేవనెత్తాడు, సూటిగా ఆమెను ఇరుకునపెట్టే ప్రశ్నే…
Ads
‘‘మీరు మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు బాగా చేస్తుంటారు కదా, మరి వోటు వేశారా..? వోటు వేసినట్టు ఎక్కడా కనిపించలేదు, వోటు వేయలేదా..?’’ ఇంతే ప్రశ్న… ఏం చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు… తరువాత చెప్పేవాడికి అడిగేవాడు లోకువ అన్నట్టుగా… ‘‘కొన్నిసార్లు మనం ఊళ్లో ఉండకపోవచ్చు, మాకంటూ ప్రైవేట్ లైఫ్ ఉంటుందిగా, ఇదీ ప్రైవేటు ఇష్యూయే కదా, నేను ప్రతిఏటా ఆన్‌లైన్‌లో వోట్లు వేస్తుంటాను, ఐనా ప్రతిదీ బయటికి చెప్పుకోం కదా’’ అని ధాటిగా బదులిచ్చింది…
ఆ ప్రెస్‌మీట్‌లో ఉన్న ప్రతి విలేకరికీ ఠారెత్తిపోయింది… అమ్మా, తల్లీ, ప్రతి ఏటా వోట్లు వేయడం ఏమిటి..? ఐదేళ్లకోసారి కదా వేస్తారు అనడిగాడు అదే విలేకరి… ‘‘ఔనా.. నిజమా’’ అన్నట్టు చూసిన ఆమె జ్యోతిక తన జవాబు సరిచేసుకుంది… సరే, ఆ సీన్ అక్కడ కట్ అయిపోయింది… కానీ సోషల్ మీడియా ఊరుకోదు కదా… ఆమె భలే దొరికింది అనుకుని ఇక ట్రోలింగ్ మొదలెట్టింది…
చివరకు సేమ్ జ్యోతికలాంటి బుర్రే ఉన్న కస్తూరి కూడా వ్యంగ్యంగా సెటైర్ వేసింది… ‘‘ఆమె వోటు వేయకపోవడానికి ఏవేవో కారణాలు చెప్పింది, మేమేమో వోటు వేయడానికి రోజంతా ఎండలో నిలబడ్డాం, మరీ నేనైతే డబ్బులిచ్చి మరీ అమెరికా ఫ్లయిట్ తేదీని ఎన్నికల తరువాతకు మార్పించుకున్నాను…’’ అని ట్వీటింది… కంట్రవర్సీకి చాన్స్ దొరికితే వదిలే రకమా, కాదు కదా…
Ms Jyotika on why she didn't vote:
'Sometimes we are not in town'.
'We have a private life'
'Online voting is there, not everything is publicised'Meanwhile we- who waited in the sun all day to vote..😠
And me – who paid to change date on USA flight to after election..😭 pic.twitter.com/JZTCDVF5KO— Kasturi (@KasthuriShankar) May 4, 2024
సింపుల్‌గా వోటు వేయలేకపోయాను అని చెప్పినా సరిపోయేది… అదేమీ నిర్బంధం కాదుగా… అబ్బే, పొద్దున్నే వెళ్లి వోటు వేసి వచ్చాను అని చెప్పినా కుదరదు, ఏదీ మీ వేలి మీద సిరా గుర్తు చూపించండి అనడిగే జర్నలిస్టులు తమిళనాట… అందుకే మనం మొదట్లోనే చెప్పుకున్నది… సెలబ్రిటీ బుర్రలు అని… తెలంగాణలో బుర్ర అంటే డొల్ల అనే అర్థమూ ఉంది…!!
Share this Article