Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అసలు ప్రభాస్ ఫ్యాన్స్‌కే నచ్చలేదు… ఇక బాధపడటానికి ఏముంది..?

November 7, 2024 by M S R

.

అవును… అందులో ప్రభాస్ ఫ్యాన్స్ మనోభావాలు గాయపడటానికి ఏముంది..? అంతగా బాధపడటానికి ఏముంది..?

తేజ సజ్జా తెలుసు కదా… పిల్ల హీరో… హనుమాన్ చేశాడు… ఐఫా అవార్డుల కార్యక్రమంలో దగ్గుబాటి రానాతో కలిసి హోస్టింగ్… రానా ఉంటే సందడి ఉంటుంది… అల్లరీ ఉంటుంది…

Ads

తనకు తగినట్టే పలు సినిమాల మీద సెటైర్లు రాసిచ్చారు ఆ కార్యక్రమ స్క్రిప్ట్ రైటర్లు… సహజమే… ఐఫా కావచ్చు, సైమా కావచ్చు… ఇలాంటి ఫంక్షన్లకు రంగురుచివాసన కోసం ఇండస్ట్రీ తన మీద తానే సెటైర్లు వేసుకోవడం విశేషమేమీ కాదు… మరీ చప్పిడితిండిలా ఉండటానికి అవి ప్రభుత్వ అవార్డుల కార్యక్రమాలు కావు కదా…

బాలీవుడ్ వాళ్లు సరదాగా ఆస్వాదిస్తారు వాటిని… ఎటొచ్చీ సౌత్ ఇండియా ఇండస్ట్రీలే దరిద్రం… ఇక్కడ రివ్యూయర్లు ఒక్క వాక్యం నెగెటివ్‌గా రాసినా తట్టుకోలేరు, సెటైర్లు అర్థం కావు… మొన్న వాడెవడో శ్రీకాంత్ అయ్యంగార్ క్రిమి దొడ్డి గాళ్లు, పారాసైట్స్ మన్నూమశానం ఏదో విమర్శించాడు కదా రివ్యూయర్లను…

పేరుకు సదరు రివ్యూయర్ల సంఘం ‘మా’కు ఫిర్యాదు చేసిందట… అంతే… నిజానికి పెట్టాల్సింది పోలీస్ కేసు… అది చేతకాలేదు గనుకే ఇంకా త్వరలో క్షమాపణ చెబుతా, అయ్యో, ఇంకా చెప్పలేదా, చెప్పేస్తాను లెండి అంటూ వరుస వీడియోలు పెడుతూ తను ఇంకా అవమానిస్తున్నాడు… ఇండస్ట్రీలో ఒక్కడు కిక్కుమన్నవాడు లేడు…

సరే, ఐఫా కార్యక్రమం విషయానికొద్దాం… తేజ పుష్ప-2, గేమ్ ఛేంజర్ జాప్యాల మీద, మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ మీద, సినిమాల్లో వరలక్ష్మి శాడ్ ఎండింగ్స్ మీద కొన్ని ఫన్నీ వన్ లైనర్స్ చదివాడు… ‘మా’ మంచు విష్ణు మీద కూడా ఓ ఫన్నీ వ్యాఖ్య… వాటిల్లో ఒకటి ఆదిపురుష్ మీద…

‘ప్రతి థియేటర్‌లో హనుమంతుడికి ఒక్కొక్క సీటు వదిలారు, కానీ హనుమంతుడు కూడా ఓటీటీలో చూద్దాంలే అని వదిలేశాడు’…. ఇదీ వ్యాఖ్య… చాలా సరదాగా ఉంది… దానికి హర్టయిన ఫ్యాన్స్ తేజ క్షమాపణ చెప్పాలని డిమాండ్లు చేస్తున్నారట…

అసలు ఆదిపురుష్ సినిమా తీసిన తీరే పెద్ద దరిద్రం… బొచ్చెడు నెగెటివ్ విమర్శలొచ్చాయి… హిందీ రివ్యూయర్లు అయితే ఆడుకున్నారు… వేరే హీరోలయితే ఆ ఓం రౌత్ వంటి దర్శకుడిని తన్ని తగలేసేవారనీ, ప్రభాస్ కాబట్టి క్షమించాడనీ రాసుకొచ్చారు… ఆ గ్రాఫిక్స్ ఓ చెత్త… చివరకు రామభక్తులు, ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సినిమాను ఇష్టపడలేదు…

వాటితో పోలిస్తే తేజ కామెంట్ ఏం అభ్యంతరకరంగా ఉంది… ఫన్ జనరేట్ చేయడానికి క్రియేటివ్ టీమ్స్ ఇలాంటి కొన్ని వన్ లైనర్స్ రాస్తుంటారు… ఓ పరిమితి వరకూ వోకే… ఆ గీత దాటొద్దు… తేజ వ్యాఖ్యలు ఆ పరిధిలోనే ఉన్నాయి…

దిగువన మీరే చూడండి ఈ ట్వీట్‌లోని వీడియో…



#Rana #Tejasajja #IIFAUtsavam2024
Comedy night🤣🤣 pic.twitter.com/IK7DAm8O3p

— upcoming Gossips (@Upcomingchat) November 5, 2024


 

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!
  • నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో… ఇదో వింత కథ…
  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions