.
Priyadarshini Krishna …. Netflix లో ఇండీ మూవీ ఇక్కా (IKKA) – పేకల్లో Ace- సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా, తిలోత్తమ నటించిన కోర్టు రూమ్ డ్రామా మొన్న శుక్రవారం రిలీజ్ అయింది …
ముప్పై ఏళ్ళ తర్వాత లాయర్ పాత్రలో సన్నీ డియోల్ మళ్లీ కనిపించారు… ఈ సినిమా ఈయన OTT డెబ్యూ గా నెటిజన్స్ అభివర్ణిస్తున్నారు….
వందల వేల కోర్టు రూమ్/ ఇన్వెస్టిగేటివ్ సబ్జెక్ట్స్ తో వచ్చిన కథలలాగే ఇందులో కూడా ‘attempt to murder/ murder’ అంశంతోనే కథాకథనాలున్నాయి. మన న్యాయ వ్యవస్థ ఎలా వున్నది, అందులోని లూప్ హోల్స్ తో నేరస్థులు ఎలా బయట పడతారు, విక్టిమ్స్ కి న్యాయం అనేది అందని ద్రాక్షేనా..?! ఇలాంటి పాయింట్స్ తో ఈ సినిమాలో కథను అల్లుకున్నారు .
Ads
కథని చెప్పుకుంటే ట్విస్ట్ లు చెప్పాల్సి వస్తుంది … కాబట్టి చాలా బ్రీఫ్ గా కథని ప్రస్తావిస్తాను …..
అర్జున్ మెహ్రా (సన్నీ డియోల్) ముంబైలోనే అత్యంత నిజాయితీ గల, ఓటమి ఎరుగని టాప్ డిఫెన్స్ లాయర్. పేదలు, బాధితుల తరఫున వాదించే అతనికి ఒక పెద్ద నైతిక సందిగ్ధత (Moral Trap) ఎదురవుతుంది.
ఒక రాత్రి ముంబై నడి రోడ్డుపై కారులోంచి ఒక యువతిని తోసేసి, ఆమె ప్రాణాపాయ స్థితికి చేరుకోవడానికి కారణమయ్యాడనే ఆరోపణ ఒక శక్తివంతమైన రాజకీయ నాయకుడి కొడుకు శౌర్యమాన్ గౌర్ (అక్షయ్ ఖన్నా) పై వస్తుంది. మొదట ఈ కేసును నిరాకరించిన అర్జున్, క్యాన్సర్ బారిన పడిన కుమార్తె ప్రాణాలు, భార్య అవంతిక (దియా మీర్జా) రక్షణ కోసం శత్రువు లాంటి శౌర్యమాన్ తరఫున కోర్టులో వాదించాల్సి వస్తుంది.
దోషి అని తెలిసిన వ్యక్తిని కాపాడటానికి లాయర్ తన మనస్సాక్షితో చేసిన పోరాటం, కోర్టు రూమ్ డ్రామా, చివర్లో వచ్చే ఊహించని ట్విస్టుల సమాహారమే ఈ ‘ఇక్కా’….
ప్రాసిక్యూటర్ గా నటించిన తిలోత్తమ పాత్ర కూడా చక్కగా మలిచారు… ప్రేక్షకుడికి వచ్చే ప్రశ్నలు తిలోత్తమకి రావడం, కథనంలో అవి విప్పి ప్రశ్నలను ప్రేక్షకులకి చెప్పే విధానంలో దర్శకుడు సిద్ధార్థ్ పి.మల్హోత్రా చాలా తెలివిగా వ్యవహరించాడు.
కథ, కథనం, మాటలు, సినిమాటోగ్రఫీ, సెట్స్, ప్రొడక్షన్ డిజైనింగ్ అన్నీ బాగున్నాయి… ముఖ్య పాత్రలైన ఆ నలుగురు – అక్షయ్, సన్నీ, దియా, తిలోత్తమలు మాత్రం ఇదేదో ఆర్ట్ సినిమా అన్నట్లు చాలా నిర్జీవంగా అదే స్టీరియోటైప్, బాగా బద్దకంగా నటించారు…

తిలోత్తమ ఐతే అసలు నాకేం సంబంధం లేదు, డైరెక్టర్ చెప్పింది చేస్తా అన్నట్లు నటించింది – ఈమె ప్రతి సినిమాలో ప్రతి వెబ్‌సీరిస్ లో ఒక రకమైన స్టీరియో నటనతో చంపుతుంది….
ఇక అక్షయ్ ఖన్నా సంగతి మనకు తెలిసిందే – అదే చూపు, అదే నవ్వు, అదే స్లో డైలాగ్ డెలివరీ , చూసి చూసి మనకి బోర్ కొట్టినా, చేసి చేసి అతనికి బోర్ కొట్టలేదు …
దియా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది …
ఇంకా మనల్ని రక్షించేది సన్నీ ఒక్కడే … బాగా బద్ధకంగా డైలాగ్ చెప్పినా కూడా అక్కడక్కడా ఆంగ్రీ యంగ్‌మ్యాన్ ఫీల్ ని ఇచ్చి మనల్ని తృప్తి పరిచాడు …
కథనం అక్కడక్కడా పాతకాలపు సీరియల్ తరహా డ్రామాలా అనిపిస్తుంది. మధ్యలో ఎడిటింగ్ కాస్త నెమ్మదించి కొన్ని సీన్లు సాగతీతగా అనిపిస్తాయి. ఇన్వెస్టిగేషన్ సీన్స్ మరికొంత లోతుగా ఉంటే బాగుండేది.
అల్థియా కౌశల్ రాసిన స్క్రీన్‌ప్లే సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులతో వేగం పుంజుకుంటుంది. అయితే పాత సినిమాల ఫార్ములాను గుర్తుచేసే కొన్ని సీన్లు చాలా ప్రెడిక్టబుల్ గా ఉన్నాయి.
మొత్తానికి టైం పాస్ కోసం చూడవచ్చు.
#ikka
#Sunnydeol
#akshaykhanna
#directorsidharthmalhotra
Share this Article