Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అతి పెద్ద మ్యూజిక్ లిటిగెంట్ – పాపం పద్మవిభూషణ్ పురస్కారం…

September 11, 2026 by M S R

.

నిజంగా అప్పుడప్పుడూ మన కోర్టులు ఎంత న్యాయబద్ధంగా తీర్పులు వెలువరిస్తాయంటే… ఇదే ప్రబల ఉదాహరణ…. సినిమా పాటల కాపీ రైట్స్, రాయల్టీలకు సంబంధించి అడ్డదిడ్డంగా ఉన్న నియమాలను ఆసరాగా తీసుకుని ఇళయరాజా అనే కంపోజర్ ఇండస్ట్రీని కొన్నాళ్లుగా వేధిస్తున్నాడు… ఒక్కొక్కడినీ కేసులపాలు చేస్తూ తరుముతున్నాడు…

తను సంగీత స్రష్ట కావచ్చు… కానీ ఎవడో ఏదో సినిమాలో ఓ పాత్రధారి ఏదో తన సినిమా పాటన హమ్ చేస్తే కూడా రాయల్టీ అడిగి, కోర్టుకు లాగిన ‘కళంకిత చరిత’ ఇళయరాజాది… తనకు కొలువు భిక్ష పెట్టిన ఎస్పీ బాలును కూడా నానా కష్టాలూ పెట్టాడు… ఎవరో పాపం, ఈ రూమ్ వాడుకో అని వసతి చూపిస్తే,  ఇప్పుడు అది తనదే అని క్లెయిమ్ చేసుకునే రకం…

Ads

పక్కా లిటిగెంట్… అసలు పాటలపై పూర్తి హక్కులూ నిర్మాతలకే ఉండాలి… వాడు రిస్క్ తీసుకుని, అందరికీ డబ్బులిచ్చి పాట రాయిస్తాడు, పాట కంపోజ్ చేయిస్తాడు, పాట పాడిస్తాడు, హిట్టయితే వాడి లక్, లేకపోతే వాడి ఖర్మ… అది పెట్టుబడి… మరి నడుమ వీళ్లందరికీ ఎందుకు రాయల్టీలు… అసలు సిస్టంలోనే తేడా ఉంది…

నిర్మాత మొత్తం హక్కుల్ని ఏదైనా మ్యూజిక్ కంపెనీకి అమ్మేస్తే… దాన్నీ కోర్టుకు లాగే ఘనుడు ఇళయరాజా… కేసు తెలుసు కదా, గతంలోనూ చెప్పుకున్నాం, సరిగమ కంపెనీ ఇలాగే ఇళయరాజా కొర్రీలు, కేసులు అంటుంటే కోర్టుకెక్కింది… ఏకంగా ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేసింది…

సేమ్, ఇళయరాజా అందరినీ ఎలా ఆక్షేపిస్తాడో, అచ్చు అలాగే… కోర్టు విధించిన మధ్యంతర ఉత్తర్వులను అతిక్రమించి, తమ కంపెనీకి సొంతమైన పాటలను ఇళయరాజా ఉపయోగిస్తున్నాడని ఓ పిటిషన్‌ వేసింది… నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఇళయరాజాను సివిల్‌ జైలులో ఉంచాలని, ఆయన స్థిరాస్తులను స్వాధీనం చేసుకుని, ఆ ఆస్తులను విక్రయించి తద్వారా వచ్చే మొత్తాన్ని సరిగమకు అప్పగించేలా ఒక మధ్యవర్తిని నియమించాలని కోరింది…

సో వాట్..? ఇళయరాజా అయితేనేం..? దేవుడి పుత్రుడా..? ఇంతటి లిటిగెంటును క్షమించాల్సిన పనే లేదని అనుకుంది కంపెనీ… పాఠమూ చెప్పాలనుకుంది…

ఇళయరాజా సంగీతం సమకూర్చిన 134 చిత్రాలకు సంబంధించిన పాటలకు రైట్స్‌ కోరడమో లేదా ఉపయోగించడమో చేయరాదని గత జూలై ఒకటో తేదీన కోర్టు ఆదేశాలు జారీ చేయగా, వీటిని ఇళయరాజా ఉల్లంఘించి ఆయా చిత్రాల పాటలను ఉపయోగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి…

ఈ నేపథ్యంలో సరిగమ తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. కౌంటర్‌ దాఖలు చేయాలని ఇళయరాజాకు నోటీసులు జారీ చేసింది… ఇక్కడా తనేమీ ఫెయిర్‌గా వ్యవహరిస్తాడని అనుకోలేం, ఈయన్ని వరించిన పద్మవిభూషణ్ కూడా చిరాకు పడేలా..!!

ఇక్కడ ఓ ప్రశ్న… ఇలాంటి లిటిగెంట్లకు ఏవో పద్మపురస్కారాలిచ్చి లెంపలేసుకుంటోంది జాతి, సరే, కానీ ఏదో దశలో రివ్యూ చేసి, వాపస్ తీసుకుని, జాతి గౌరవాన్ని, పద్మపురస్కారాల విలువను కాపాడొచ్చు కదా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అతి పెద్ద మ్యూజిక్ లిటిగెంట్ – పాపం పద్మవిభూషణ్ పురస్కారం…
  • ప్చ్, సుమంత్‌కు మళ్లీ భంగపాటే – బహుశా అమ్మవారి శాపమేమో…
  • ఫాఫం కేసీయార్ ! ప్లాన్ ఎదురుతన్ని తెలంగాణ సమాజంలో అభాసుపాలు !!
  • సో, పిక్చర్ వెరీ క్లియర్… కన్నవాళ్లూ కసాయిలే ! 
  • నాయకులే కాదు – మీడియా కంపెనీలూ కండువాలు మార్చుకుంటయ్ !!
  • EPIC – బోల్డ్‌గా ఏదో చెప్పాలనుకుని- బోల్తాకొట్టిన కథాకథనాలు !!
  • వారమైనా కాలేదు – బిగ్‌బాస్ తిక్క ప్లానింగు – ఓ గట్టి కంటెస్టెంట్ ఔట్ !!
  • సినిమా బ్లాక్‌బస్టర్ ! హఠాత్తుగా కరోలీ బాబా ఇంటిపై పంచాయితీ !!
  • సర్దార్-2 … మిషన్ పెద్దదే… కానీ ఇంజన్‌లో దమ్ములేదు – ఇది కార్తి టాక్సిక్ !!
  • ‘‘పిరికి న్యాయమూర్తి అనిపించుకోవడంకంటే చావడానికే ఇష్టపడతాను’’

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions