.
భాష కమ్యూనికేషనే కాదు, ఎమోషన్ కూడా… డీఎంకే స్టాలిన్ రాజకీయ విధానాల్ని వ్యతిరేకించేవారు సైతం ప్రస్తుతం రెండు అంశాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల తన పోరాటాన్ని, తన విమర్శల్ని సమర్థిస్తున్నారు…
1) జనాభా నియంత్రణ కృషికి గానూ దక్షిణాది రాష్ట్రాలు తమ రాజకీయ ప్రాతినిధ్యాన్ని అనగా, ఎంపీ సీట్లను నష్టపోవాల్సి వస్తోంది… 2) హిందీ భాషను మళ్లీ మళ్లీ రుద్దే ప్రయత్నం.,. మొదట్లో తమిళనాడు మాత్రమే ఈ హిందీ భాషను రుద్దడాన్ని వ్యతిరేకించేది, ఇప్పుడు కర్నాటక కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతోంది…
Ads
ఈరోజు స్టాలిన్ చేసిన ఓ ట్వీట్ ఆలోచనాత్మకంగా ఉంది… దక్షిణ రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశమంతా ఈ చర్చ జరగాల్సి ఉంది… 25 భాషలు కేవలం హిందీ కారణంగా మనుగడ కోల్పోతున్నాయి అనేది తన విమర్శ… ఏయే భాషలో కూడా రాశాడు… పైగా యూపీ, బీహార్ భాషలు వేరు, వాటినీ హిందీ బెల్టులో కలిపేశారు అనేదే ఇంపార్టెంట్, ఇంట్రస్టింగ్ పాయింట్…
https://x.com/mkstalin/status/1894980170122936599
ప్రపంచవ్యాప్త అవకాశాలు, అధ్యయనాలు, అవగాహన, కమ్యూనికేషన్ల కోసం అసలు ఇంగ్లిషును చిన్నప్పటి నుంచే నేర్పించాలి, ఈ హిందీతో ఏమొస్తుంది అనే వాదన చాన్నాళ్లుగా ఉంది… మాతృభాష ప్లస్ ఇంగ్లిషు చాలదా అనేది ఆ వాదనల సారాంశం… దాన్ని కాసేపు అలా పెడితే… యూపీ, బీహార్ భాషల మీద తను చేసిన విమర్శలే బేస్‌గా ఇంకాస్త లోతుగా అధ్యయనం, డిబేట్ అవసరం…
చాలా ప్రాంతీయ భాషల్నీ హిందీలో కలిపేసి, ఎక్కువ జనాభా హిందీ మాట్లాడుతున్న భాషగా చూపిస్తున్నారనే విమర్శ కూడా చాన్నాళ్లుగా ఉన్నదే… నిజమైన హిందీ ఏయే ప్రాంతాల్లో ఎంత మంది మాట్లాడుతున్నారు అనే లెక్క మీద కూడా శాస్త్రీయ ప్రామాణిక సర్వే జరగాల్సి ఉంది…
దేశంలో హిందీ తరువాత..? బెంగాలీ, మరాఠీ ఎక్కువ మాట్లాడతారు, తరువాత తెలుగు… ఆ తరువాతే తమిళం, గుజరాతీ, ఉర్దూ, కన్నడం… ఒడియా, మలయాళం, పంజాబీ, అస్సామీ తరువాత స్థానాల్లో ఉంటాయి… నిజానికి హిందీ లిపి దేవనాగరి… ఐనా దేశాన్ని కలిపి ఉంచడానికి ఓ జాతీయ భాష అవసరమా అనేదే ఓ విస్తృతమైన చర్చ…
ఎవరి మాతృభాష వాళ్లకు విలువైనది, అదొక ఉద్వేగం కూడా… మదర్ టంగ్‌లో కమ్యూనికేషన్ ఈజీ, కానీ ఎవరి భాషల్ని వారు కాపాడుకోవడమే ఇప్పుడు పెద్ద టాస్క్ అవుతోంది… (హిందీ వేరు, ఉర్దూ వేరు… గందరగోళానికి గురికావద్దు ఇక్కడ… అలాగే హిందీ వేరు- హిందూ వేరు…)
ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ ప్రాంతాల్లో ఎక్కువగా మాట్లాడుకునే భాషల్ని అధికార భాషలుగా ప్రకటించుకుని… దైనందిన అధికారిక వ్యవహారాల్లో కూడా ఆ భాషల్ని విస్తృతంగా చెలామణీలోకి తీసుకురావడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నా అవీ పెద్దగా ఫలించడం లేదు…
మరోవైపు పొట్ట చేత్తో పట్టుకుని ఇతర దేశాలకు వలస పోయిన కుటుంబాల తరువాత జనరేషన్స్‌కు మాతృభాషలో చదవడం రాదు, రాయడం రాదు, చాలామందికి మాట్లాడటం, అర్థం చేసుకోవడం కూడా రావడం లేదు… జస్ట్, ఇంగ్లిషు వోన్లీ…
అబ్బే, హిందీని రుద్దడం లేదు, ఐచ్ఛికం మాత్రమే అని కేంద్రం చెబుతున్నా సరే… అసలు లోగుట్టు రుద్దడమే… ఎందుకు హిందీ..? మాండరిన్, జర్మన్, జపనీస్ వంటి భాషలు ఎందుకు థర్డ్ లాంగ్వేజీ కాకూడదు..? మళ్లీ ఇదొక చర్చ… ఎంపీ సీట్లు, తమిళనాడులో ఇతర భాషలపై వివక్షల గురించి మరోసారి మాట్లాడుకుందాం… అవీ ప్రధానమే…
Share this Article