Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

యామీ గౌతమ్ దున్నేసింది… కశ్మీర్ వ్యవహారాలపై ఇంప్రెసివ్ ప్రజెంటేషన్…

February 24, 2024 by M S R

యామీ గౌతమ్… ఫెయిర్ అండ్ లవ్‌లీ యాడ్ మోడల్‌గా చాలామంది తెలుసు… సినిమా నటిగా పెద్దగా బాలీవుడ్ మీద తనదైన ముద్ర సరిగ్గా వేయలేకపోయింది ఇన్నాళ్లూ… మెరిట్ ఉండి కూడా..! కానీ ఇప్పుడు ఆమెకు టైమ్ వచ్చింది… ఆర్టికల్ 370 సినిమాలో దున్నేసింది… భేష్… ఆమె నటనతోనే ఆ పాత్ర అంత బలంగా ఎలివేటైంది… ఆ పాత్ర సృష్టించి, అవకాశమిచ్చిన జాతీయ అవార్డుల విజేత ఆదిత్య సుహాస్‌ జంభాలేకు ఆమె థాంక్స్ చెప్పుకోవాలి…

సినిమా విషయానికి వస్తే… రీసెంట్ టైమ్స్‌లో ఆర్టికల్ 370 ఎత్తివేత బాగా చర్చనీయాంశం… ప్రధాని కుర్చీ మీద ఎవడున్నా సరే, ఈ ఆర్టికల్ ఎత్తివేత ఎవడికీ చేతకాదు, చేయలేరు అని కూసిన నోళ్లు మూయిస్తూ ప్రధాని మోడీ చేయనే చేశాడు… ఐతే ఉరి కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు… హిందీ చిత్రాలు సేమ్ పేర్లలో వర్తమాన వ్యవహారాల్ని వెండితెర మీద డిఫరెంటుగా, బలంగా ప్రజెంట్ చేస్తున్నాయి… సౌత్ ఇండస్ట్రీకి ఈ సాహసాలు, ప్రయోగాలు చేతకావు, కంపు కమర్షియల్ వాసనలు తప్ప…

కొన్ని కథలు చెప్పబడాలి… చరిత్రలో కప్పేయబడిన అసలు కథలూ జనానికి తెలియాలి… కశ్మీర్ విషయంలో మనం జాతిపితలుగా ఇన్నేళ్లుగా నెత్తిన మోస్తున్న నాయకులు చేసిన తప్పిదాలు, వాటి దుష్పరిణామాలు చెప్పబడాలి… ఈ సినిమాలో దాన్ని సంక్షిప్తంగా వాయిస్ ఓవర్‌తో  చెప్పేసి దర్శకుడు ఇక కథలోకి వెళ్లిపోతాడు…

Ads

మాజీ టీచర్ కొడుకు బురాన్ వనీ ఆచూకీ కాస్త తెలియగానే ప్రభుత్వం జూని అనే ఓ ఇంటలిజెన్స్ కేరక్టర్‌ను ప్రవేశపెడుతుంది… ఆ పాత్రే యామీ గౌతమ్ పోషించింది… తనను పట్టుకునే ఆపరేషన్‌ను ఆమే లీడ్ చేస్తుంది… వనీ ఎన్‌కౌంటర్ దాకా… ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 ఎత్తివేత మీద వర్క్ చేస్తుంటుంది… దాన్ని పర్యవేక్షించేది రాజేశ్వరి… (ప్రియమణి పాత్ర)… ప్రధాని కార్యాలయంలో కార్యదర్శి… ఆర్టికల్ 370 ఎత్తివేత వంటి నిర్ణయం, అమలు వెనుక ఏం కసరత్తు జరిగిందో సంక్షిప్తంగానైనా ప్రేక్షకులకు వివరిస్తుంది ఈ సినిమా…

ఆ ఆర్టికల్ ఎత్తివేస్తే భూకంపాలు వస్తాయి, అగ్నిపర్వతాలు బద్ధలవుతాయి అనే మన ప్రతిపక్షాలు, మీడియా గగ్గోలు పట్టించుకోకుండా సింపుల్‌గా రాష్ట్రపతి పాలన పెట్టేసి, రాష్ట్రాన్ని విభజించేసి, ఆర్టికల్  ఎత్తేసింది ప్రభుత్వం… తెగించి చేసేవాడు ఉండాలి, ఎందుకు సాధ్యం కాదు..? కానీ సినిమాలో కొన్ని వర్తమాన పత్రాల్ని వ్యంగ్యంగా చూపించడం సరిగా లేదు… మోడీ, అమిత్ షాల పాత్రధారులు కూడా ఇంకాస్త బెటర్‌గా చేసి ఉండాల్సింది…

అలాగే పదే జాతీయ జెండాలు ఊపడం, మాటిమాటికీ వందేమాతరం వినిపించడం మాత్రమే దేశభక్తి కాదు… రా ఏజెంట్లు, ఇంటలిజెన్స్ పర్సనాలిటీలు సైలెంటుగా వర్క్ చేసుకుంటూ పోతారు… వాళ్లకు టార్గెట్ చేధించడం మాత్రమే కనిపిస్తుంది… సినిమా కూడా కథలో లీనం చేస్తే చాలు, మాటిమాటికీ భారత్ మాతాకీ జై అన్నట్టుగా నినదించాల్సిన అవసరం లేదు, సినిమా చూశాక ప్రేక్షకుడు అలా ఫీల్ అయ్యేలా చేయాలి…
సినిమాలో బీజీఎం సీన్లను బాగా ఎలివేట్ చేసింది… సినిమాటోగ్రఫీ, ప్రత్యేకించి పలు సందర్భాల్లో డ్రోన్ షాట్లు బాగా వచ్చాయి… యాక్షన్ సీన్లు బాగా కుదిరాయి… ఫైటర్లు సినిమా ఫైటర్లలాగా గాకుండా ఎక్స్‌పర్టులుగా కనిపించారు… అలాగే వనీ అంత్యక్రియల వంటి సందర్భాల్లో సినిమా టీం వర్క్ బాగా వర్కవుట్ అయి, ప్రేక్షకుడిని కనెక్ట్ చేస్తుంది… (ఒక సినిమా రివ్యూల ఇంగ్లిషు సైట్‌లో కనిపించిన రివ్యూకు ఇది తెలుగు అనువాదం మాత్రమే… రివ్యూయర్ వ్యక్తిగత అభిప్రాయం…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions