Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రొఫెషనల్ డాన్సర్లకు దీటుగా… అదరగొట్టేస్తున్న బీబీజోడి డాన్స్ షో…

January 22, 2023 by M S R

నిజానికి చాలారోజులైంది ఈ ప్రోగ్రాం స్టార్టయి… ఎహె, నలుగురు సెలబ్రిటీలను తీసుకొచ్చి ఏవో పిచ్చి గెంతులు వేయిస్తారు, అంతేకదా అనుకున్నాను అందరిలాగే… కానీ స్టార్‌మాటీవీలో వచ్చే బీబీ జోడీ ప్రోగ్రాం డిఫరెంటుగా ఉంది… ఆకట్టుకుంటోంది… బిగ్‌బాస్ కంటెస్టెంట్లతో ఎప్పుడూ ఏదో ఒక ప్రోగ్రాం చేయడం మాటీవీకి అలవాటే… వాళ్లకు కూడా అదనపు ఆదాయం కాబట్టి మాటీవీ చెప్పిన ప్రోగ్రామ్స్‌లో చేస్తుంటారు…

మాటీవీకి నాన్-ఫిక్షన్ కేటగిరీలో రియాలిటీ షోల అవసరం ఉంది… లేకపోతే రేటింగుల్లో ఇంకా పడిపోయే ప్రమాదం ఉంది… అందుకని ఇప్పటిదాకా బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్లుగా ఉన్నవాళ్లలో కొందరిని ఎంపిక చేసి, డాన్స్‌లో ప్రాక్టీస్ చేయించి, ట్రెయినింగ్ ఇప్పింది ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసింది… ఆలోచన మంచిదే గానీ, వాళ్లేమీ ప్రొఫెషనల్స్ కాదు కదా, షో ఫ్లాప్ అవుతుందని సందేహించినవాళ్లే చాలామంది…

పైగా కయ్య కయ్య ఒర్రడమే యాంకరింగ్ అనుకునే శ్రీముఖి ఓ పెద్ద చికాకు ఆ షోకు… ప్రతిదీ హైపిచ్‌లో అరుస్తుంటుంది… పరమ నాసిరకం లక్షణం… జడ్జిలుగా మాజీ నటి సదా, వెటరన్ హీరోయిన్ రాధ, కొరియోగ్రాఫర్ తరుణ్‌లను తీసుకున్నారు… అందరి సందేహాలను పటాపంచలు చేస్తూ జంటలుగా పర్‌ఫామ్ చేస్తున్న కంటెస్టెంట్లు అదరగొడుతున్నారు… టీవీల్లో వచ్చే డాన్స్ షోలకన్నా బాగున్నట్టు అనిపిస్తోంది…

Ads

bbjodi

అతిశయోక్తి కాదు… ఢీ తదితర డాన్స్ షోలలో కంటెస్టెంట్లు మరమనుషుల్లా సర్కస్ ఫీట్లు చేస్తుంటారు… వాళ్ల మొహాల్లో ఉద్వేగాలు ఏమీ ఉండవు… పల్టీలు కొట్టామా, ఫీట్లు చేశామా అన్నట్టు ఉంటుంది… కానీ బీబీ జోడీలో కంటెస్టెంట్లు సర్కస్ ఫీట్లు ఏమీ చేయడం లేదు కానీ పాటకు తగిన ఉద్వేగాన్ని నటిస్తున్నారు… అందుకే ఈ ప్రోగ్రాం లైవ్‌గా కనిపిస్తోంది… అదే తేడా… మంచి టైమింగు, మూమెంట్స్, కోఆర్డినేషన్ కనిపిస్తున్నాయి జంటల నడుమ…

చాన్నాళ్లుగా కనిపించని రవి, భానుల జంట నిజంగా అదరగొడుతోంది… అలాగే అఖిల్, తేజస్విని జంట అయితే మనల్ని నిశ్చేష్టులను చేస్తోంది… చెప్పాల్సింది ఫైమా గురించి… డీజే సూర్యతో కలిసి ఇరగదీస్తోంది స్టెప్పులను… ఢీ కంటెస్టెంట్లకు ఏమాత్రం తీసిపోదు… వీళ్లు అని మాత్రమే కాదు, దాదాపు అన్ని జంటలూ స్టెప్పులు నేర్చుకోవడానికి, పర్‌ఫామ్ చేయడానికి చెమటోడుస్తున్నారు… సిన్సియర్ ఎఫర్ట్ కనిపిస్తోంది… ఇది రెగ్యులర్ డాన్స్ కాంపిటీషన్ల ఫార్ములా కాదు కాబట్టి డిఫరెంటుగా బాగుంది… నిజానికి ఇన్నాళ్లూ ఢీ డాన్స్ షోకు తిరుగులేదు… కానీ ఇప్పుడు అది మరీ నాసిరకం అయిపోవడంతో మాటీవీ, జీటీవీ, ఆహా ఓటీటీల ఈ డాన్స్ కేటగిరీలో దూసుకొస్తున్నయ్ రేటింగుల వేటలో…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమరావతిపై ద్వేషం, విషం… మరీ ఈ డర్టీ ముద్రలతోనా..?!
  • నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!
  • అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
  • జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…
  • అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!
  • మెగాస్టార్‌ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!
  • జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions