వ్యాపారమే… దందాయే… ఇదీ వినోద వ్యాపారమే… ఏ వినోద చానెల్ చేసేదైనా కళామతల్లి సేవ ఏమీ కాదు… నిఖార్సయిన కాసుల వేట మాత్రమే… మంచి రేటింగ్స్ పడాలి… మంచి యాడ్స్ పడాలి… డబ్బుల కట్టలు పడాలి… అంతే… అదే టార్గెట్… సీరియల్స్ అయినా అంతే… రియాలిటీ షోలు అయినా అంతే… కానీ ఈటీవీని ఒకందుకు మెచ్చుకోవాలి… మాటీవీ, జీటీవీ పెద్ద ఎచ్చులకు పోతాయి గానీ… ఈరోజుకూ కామెడీ, డాన్స్, సాంగ్స్ అనే జానర్లలో ఈటీవీ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయాయి… బాగా కాపీ కొట్టలేవు, కొత్తగా క్రియేషనూ లేదు… ఒక్క బిగ్‌బాస్ మినహాయిస్తే… అన్నిరకాల రియాలిటీ షోలలోనూ ఈటీవీదే పైచేయి…
ఇప్పుడు ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… ఢీ అనే షో గురించి.., అప్పుడెప్పుడో ఏళ్ల క్రితం స్టార్ట్ చేశారు ఈ షో… మొదట్లో ఉదయభాను యాంకర్… బోలెడు మంది డాన్సర్లు… అది క్రమేపీ ఢీ జూనియర్స్, ఢీ లేడీస్ స్పెషల్, ఢీ జోడి స్పెషల్, ఢీ జూనియర్స్ అంటూ పన్నెండు సీజన్లు పూర్తి చేసుకుంది… వెంటనే ఈసారి కింగ్స్ వర్సెస్ క్వీన్స్ అని వచ్చే బుధవారం నుంచే మరో కొత్త సీజన్ స్టార్ట్ చేసేస్తున్నారు… వావ్…
Ads
ఓహోంకార్ అనే యాంకర్ నేతృత్వంలో మాటీవీ వాడు డాన్స్ అని ఇదేతరహా షో ప్లాన్ చేశాడు… దానికి ఏమీ చాన్సివ్వదలుచుకోలేదు ఈటీవీ… పోటీ… డిష్యూం… మంచిదే… నిజానికి ఇందులో కమర్షియల్ యాస్పెక్ట్ ఏమిటంటే..? ఢీ దాదాపు అయిదు రేటింగ్స్ పొందుతోంది… మంచి రేటింగ్సే… అందుకని ఈ జానర్‌పై మాటీవీ కన్నేసింది…
నిజానికి మాటీవీ ఎప్పుడూ ఏ రియాలిటీ షోలోనూ సక్సెస్ కాలేదు… బిగ్‌బాస్ మినహా… అదీ ఖర్చెక్కువ, రిస్కెక్కువ… కాకపోతే పాపులారిటీపరంగా వోకే… అంతేతప్ప ఈటీవీకి దీటుగా ఏ జానర్లోనూ క్లిక్ కాలేదు… జీవాడు కూడా అంతే… ఈటీవీ జబర్దస్త్‌కు పోటీగా అదిరింది పెడితే ఫ్లాప్… నిజానికి ఈటీవీ బలం ఇవే… క్యాష్, వావ్, ఢీ, జబర్దస్త్, ఆలీతో సరదాగా… ఇలా… ఈటీవీ మ్యూజిక్ షోలకు పోటీగా సరిగమ అని జీవాడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడు… ఫ్లాప్… సో, కాంపిటిషన్, గేమ్ బేస్డ్ షోలకు ఈటీవీదే ఠీవి…
ఇప్పుడు తాజాగా ఈటీవీ ఢీ పదమూడో సీజన్ స్టార్ట్ చేసేస్తోంది…టెంపో పోకుండా, డబ్బులు పోకుండా…! సేమ్, అదే శేఖర్ మాస్టర్, అదే సుడిగాలి సుధీర్, అదే యాంకర్ ప్రదీప్, అదే హైపర్ ఆది ప్రొమోలో కనిపిస్తున్నారు… రష్మి, వర్షిణి, ప్రియమణి, పూర్ణ సంగతి తేలాలి… ఎస్… మొదట్లో ప్యూర్ డాన్స్ కాన్సెప్టులకే ప్రయారిటీ ఇచ్చి నడిపించబడిన ఈ షోను క్రమేపీ సర్కస్ ఫీట్ల స్థాయికి దిగజార్చారు అనేది నిజమే… మధ్యలో కామెడీ స్కిట్స్ నింపేస్తున్నారు అనేదీ నిజమే… కావాలని మసాలా యాడ్ చేయటానికి లవ్ ట్రాకులు నడిపించడమూ నిజమే… కానీ ఒక సెక్షన్ జనం చూస్తూనే ఉన్నారుగా… అందుకే ఒక సీజన్ పూర్తి కాగానే వెంటనే మరో సీజన్… కమాన్, కుమ్మేయండి ఇక… యాంకర్ ప్రదీపో, యాంకర్ ఓంకారో తేలిపోవాలి… కమాన్…!!
Share this Article