అందరి మీదా పెత్తనం చెలాయిస్తూ, సంస్కారహీనంగా బూతులు మాట్లాడుతూ, మీదమీద పడిపోతూ అరుస్తూ, దాదాపు బెదిరిస్తూ చెలామణీ అయిపోతున్న శివాజీ మొహం మాడిపోయింది ఈవారం బిగ్‌బాస్ హౌజులో… టీవీ9 స్టూడియోలో కూర్చుని దిక్కుమాలిన గరుడపురాణం చెప్పినంత ఈజీ కాదు బిగ్‌బాస్ ఆట ఆడటం… పైగా పనికిమాలిన ఇగో ఒకటి…
ఎంతగా నాగార్జున నెత్తిన మోస్తున్నా సరే… ఎంతగా హౌజును డామినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నా సరే… మెల్లిమెల్లిగా ఒక్కో సభ్యుడు రివర్స్ అవుతున్నాడు… పెద్ద నోరేసుకుని కాలం గడిపేస్తున్న తీరు అందరికీ అర్థమైపోయింది… మరీ ఈవారం తన మొహం ఎందుకు మాడిపోయిందీ అంటే… తను ఎప్పుడూ టార్గెట్ చేసే టీవీ సీరియల్ గ్యాంగుకు చెందిన ప్రియాంక కెప్టెన్ అయిపోయింది… నామినేషన్ల నుంచి ఇమ్యూనిటీ వచ్చింది ఈ వారానికి…
కేవలం ఒక్కరే నామినేట్ చేసినందున శోభాశెట్టి కూడా ఈసారి నామినేషన్ల జాబితాలోకి రాలేదు… ఎవరినైతే తను ప్రధానంగా టార్గెట్ చేస్తాడో ఆ ఇద్దరూ తప్పించుకున్నారు… అదీ శివాజీ ఎలపరం… పైగా అర్జున్, ప్రియాంక తదితరులు పాయింట్ టు పాయింట్ మాట్లాడి శివాజీ దగ్గర జవాబు లేకుండా చేశారు… దాంతో అర్జున్‌ను వదిలేసి ఇక ప్రియాంక మీద అరవడం మొదలుపెట్టాడు… ఒకవైపు ఆమె కూల్‌గా తన వెర్షన్ వినిపిస్తుంటే అటూఇటూ పెదరాయుడిలాగా తిరుగుతూ, మొన్న శోభ మీద ఎగిరినట్టే ప్రియాంక మీద ఎగిరాడు కాసేపు…
Ads
ఇంకోవైపు తన గ్యాంగుకు చెందిన శివాజీని, యావర్‌ను మిగతా హౌజ్ సభ్యులు టార్గెట్ చేసి ఎండగట్టారు… చివరకు ఏ శివాజీ కాళ్ల మీద పడి బోరుమన్నదో ఆ రతిక కూడా ప్రశాంత్‌తో కాసేపు ఆడుకుంది… దీంతో ఆ గ్యాంగులో ముగ్గురూ ఈసారి నామినేషన్ల జాబితాలో చేరిపోయారు… చేతిలో ఉందీ అనుకున్న ఎవిక్షన్ పాస్ కాస్తా యావర్ ఫౌల్ గేమ్ కారణంగా చేజారిపోయింది…
అయితే ఆ ముగ్గురిలో ఎవరికీ ఎలిమినేషన్ ప్రమాదం ఉండకపోవచ్చు… గౌతమ్, రతిక, అశ్వినిలకు తక్కువ వోట్లు వచ్చే అవకాశం ఉంది… అర్జున్ ఎప్పటిలాగే సేఫ్ ప్లేయర్… బచాయిస్తాడు… అమర్ దీప్‌కు ప్రతిసారీ జాబితాలో ఉండటం, బయటపడటం అలవాటే… మొత్తానికి ఈవారం శివాజీ గ్యాంగు మీద సీరియల్ గ్యాంగు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది… తన సహజ ధోరణికి భిన్నంగా శోభాశెట్టి సైలెంటుగా ఉండిపోయింది…
నేను వెళ్లిపోతాను అంటాడు యావర్… నువ్విలాగే హ్యాండిల్ చేయలేవు కాబట్టే నేను బయటికి పోవడం లేదు అంటాడు శివాజీ… నా కేరక్టర్ నాకు ముఖ్యం అని భలే కవర్ చేసుకుంటున్నాడు యావర్… కానీ ఫౌల్ గేమ్ ఫౌల్ గేమే… అందరికీ నామినేషన్లు వేయడానికి అదొక కారణం దొరికిపోయింది… మామూలు సందర్బాల్లో మీద పడినంత పనిచేస్తాడు యావర్… కానీ ఇప్పుడు ఫుల్ డిఫెన్స్… నువ్వు హౌజుకు కెప్టెన్‌వి తప్ప నాకు కాదు అంటాడు యావర్ ఓసారి… తనేం మాట్లాడుతున్నాడో తనకే తెలియదు… మరోవైపు ప్రశాంత్ కూడా అదుపు తప్పుతున్నాడు వాదనల్లో… వెరసి శివాజీ గ్యాంగుకు ఎదురుగాలి స్టార్టయినట్టుంది…
Share this Article