Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దక్షిణం సేమ్… ఉత్తరం సేమ్… దైవ భక్తి, మత విశ్వాసాల్లో ఏ తేడా లేదు…

January 31, 2024 by M S R

ఇది చాన్నాళ్లుగా ఉన్నదే… దక్షిణ భారతానికీ, ఉత్తర భారతానికీ నడుమ పోలికలు, తేడాలు చెప్పుకోవడం… అనేక అంశాల్లో…! మత ఆచరణ, దేవుడు, భక్తి అనే విషయాలకు వస్తే దక్షిణ భారతంలో హేతువాదం, నాస్తికత్వం, ఆధునిక లౌకికవాదం గట్రా ఎక్కువనీ, కానీ ఉత్తర భారతంలో మూఢభక్తి, భక్తి, మతతత్వం, సంప్రదాయ ధోరణులు అధికమనే వాదనలు వినిపిస్తుంటాయి… అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఈ చర్చ మళ్లీ మొదలైంది… కానీ… నిజమేనా..?

దిప్రింట్ వెబ్‌సైట్ దీనిపై ఓ ఆసక్తికరమైన కథనాన్ని పబ్లిష్ చేసింది… దాన్ని ఓసారి తెలుగులో చెప్పుకుందాం… సదరు సైట్ సౌజన్యంతో… ‘‘ఓ శాస్త్రీయ పరిశీలన ఉత్తర, దక్షిణ భారతాల నడుమ ఈ తేడా పెద్ద అబద్ధమని కొట్టిపారేస్తుంది… 2020-2021 సంవత్సరంలో దేశవ్యాప్తంగా PEW International అనే సంస్థ ఈ మత విశ్వాసాలు- పద్దతుల మీద ఓ సర్వే నిర్వహించింది… మత ఆచరణ తంతులు, పద్ధతుల్లో కాసింత తేడా తప్ప స్థూలంగా ఉత్తరం, దక్షిణం అనే తేడా పెద్దగా ఏమీ లేదని ఆ సర్వేలో తేలింది…

హిందూ మత ఆచరణ పద్దతులు దేశవ్యాప్తంగా దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి…  విశ్లేషణ కోసం బీహార్, చత్తీస్‌గఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము-కశ్మీర్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఉత్తర ప్రాంతంగా (హిందీ నార్త్  బెల్ట్) తీసుకుందాం… అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, కేరళ, పాండిచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలు దక్షిణ భారతం కిందకు వస్తాయి… ఇప్పుడిక హిందూ మత విశ్వాసాలు, ఆచరణ తీరులను ఓసారి చూద్దాం…

Ads

god(courtesy :: The Print)

మొదట… దేవుడి మీద విశ్వాసం… దక్షిణ భారతంలో నాస్తికత్వం ఎక్కువనీ, దేవుడిని పెద్దగా నమ్మరనీ ఓ అపోహ ఉంది కదా… ఈ సర్వేలో తేలిందేమిటయ్యా అంటే కేవలం అలాంటి వాళ్లు కేవలం రెండు శాతం… అదే ఉత్తరభారతంలో కేవలం ఒక్క శాతం ప్రజలు మాత్రమే దేవుడిని నమ్మడం లేదు… అంటే దేవుడి మీద విశ్వాసానికి సంబంధించి ఉత్తర, దక్షిణ భారతాల నడుమ తేడా దాదాపు ఏమీ లేనట్టే లెక్క…
మతానికి ఉన్న ప్రాముఖ్యతను పరిశీలిస్తే… రెండు ప్రాంతాల్లోనూ దాదాపు ఒకటే… కాకపోతే స్థాయీబేధం కొద్దిగా… ఎలాగంటే..? నార్త్ బెల్ట్‌లో పది మంది హిందువులకు గాను 9 మందికి మతం తమ జీవితాల్లో ముఖ్యమైందే… అంటే 89 శాతం… కానీ దక్షిణ భారతంలో, మరీ ఆంధ్రప్రదేశ్ దిగువన ఈ శాతం 68 శాతం… అంటే ఎక్స్‌ట్రీమ్ సౌత్‌లో… ప్రత్యేకించి కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో…
temple

రెండో అంశం చూద్దాం… తమ భక్తి, మతానికి సంబంధించిన తంతులు, ఆచరణలు… హిందీ బెల్ట్‌లో 81 శాతం మంది, సౌత్ బెల్ట్‌లో 72 శాతం మంది వారానికి కనీసం ఒక్కసారైనా ఇంట్లో పూజ చేస్తామని చెప్పారు… సౌత్‌లో కాస్త తక్కువ అనిపించినా, మత ఆచరణలో ఇది తక్కువ సంఖ్యేమీ కాదు… ఇంట్రస్టింగ్…

మూడోది… సౌత్ ఇండియన్స్ ఇళ్లల్లో పూజలు చేయడంలో ఉత్తరాదితో పోలిస్తే తక్కువే కావచ్చుగాక… కానీ గుళ్లకు వెళ్లడంలో మాత్రం ముందంజ… 62 శాతం మంది వారానికి కనీసం ఒకసారైనా గుళ్లకు వెళ్తామని చెప్పారు… ఇది హిందీ నార్త్ బెల్ట్‌లో కేవలం 57 శాతం మాత్రమే… సౌత్‌లో ఈ శాతం అధికంగా ఉండటానికి కారణం ఏమంటే, ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో బీసీలు, దళితులు గుళ్లకు వెళ్లడం ఎక్కువే… ఉదాహరణకు నార్త్‌లో 51 శాతం మంది బీసీలు మాత్రమే వారానికి కనీసం ఒక్కసారైనా గుళ్లకు వెళ్తుంటారు… ఈ సంఖ్య దక్షిణాదిలో 60 శాతం…

నాలుగోది… మతపరమైన, కుటుంబపరమైన, ఇతర ఇంపార్టెంట్ కార్యక్రమాలకు సౌత్‌లో దాదాపు 90 శాతం ప్రజలు ముహూర్తాలు, తిథులు, వర్జ్యాలు, లగ్నాలు, దుర్దినాలు, నక్షత్రాలను పరిగణనలోకి తీసుకుంటారు… కానీ నార్త్‌లో వీరి సంఖ్య కేవలం 84 శాతం మాత్రమే… అంటే, ఒకరకంగా ఉత్తరాదివారికన్నా దక్షిణాదివారిలోనే ఈ నమ్మకాలు ఎక్కువ…

చివరిది, ముఖ్యమైనది ఏమిటంటే… మతపరమైన ఉపవాసాల విషయంలో ఉత్తరాది ప్రజల్లో 85 శాతం మంది ఉపవాసాలు, దీక్షలు చేస్తారు… దక్షిణంలో ఈ సంఖ్య జస్ట్ 68 శాతమే… అంటే ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాన గుళ్లకు వెళ్లి దండం పెట్టుకోవడమే పెద్ద మత ఆచరణ… కాకపోతే ముహూర్తబలాల మీద నమ్మకాలు చాలా ఎక్కువ… సో, ఏతావాతా తేలేది ఏమిటంటే… దేవుడు, మతం, భక్తి, విశ్వాసం వంటి విషయాల్లో దక్షిణం, ఉత్తరం తేడాలేమీ లేవు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions