.
ఈనాడులో మూడు పేజీలకు అమిత, అతి ప్రాధాన్యంతో విస్తరించిన ఓ వార్త గురించి తప్పకుండా చెప్పుకోవాలి…
నాగార్జున, అల్లు అర్జున్, మోహన్‌బాబుల మీద ఉరిమిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొరడాకు ఇంకా పని ఉన్నట్టే కనిపిస్తోంది… ఇంతకీ ఆ వార్త ఏమిటంటే..? ప్రపంచ తెలుగు సమాఖ్య 12 మహాసభలు అట… దానికి చంద్రబాబు ముఖ్యఅతిథి… అవును, హైదరాబాదులోనే జరిగింది…
Ads
ఆ వార్తలు, ఆ ఫోటోలు పరికిస్తే… తెలంగాణ రాజధానిలో… తెలుగు జాతి పేరిట తెలంగాణ ఊసు, వాసన ఏమాత్రం కనిపించని ఓ ప్రపంచ ఆంధ్రా సమాఖ్య కార్యక్రమం మాత్రమేనని అర్థమైంది…
అసలు ఆ సమాఖ్య ఓ ప్రైవేటు దుకాణం… ఆ కార్యక్రమంలో పాల్గొన్నది మెజారిటీ కమ్మ ప్రముఖులు… కాకపోతే సెక్యులర్ ముద్ర కోసం ఒకరిద్దరు రెడ్లను పట్టుకొచ్చి శాలువాలు కప్పి మమ అనిపించారు… అందుకే చంద్రబాబు వచ్చాడు…
అందుకే ఈనాడు అంత ప్రయారిటీ ఇచ్చింది… అబ్బే, ఇది ‘మనవాళ్ల’ ప్రోగ్రాం కాదులే అని సాక్షి జస్ట్, అలా వదిలేసింది… ఆంధ్రజ్యోతికీ ఫాఫం కులాభిమానం, బాబు పట్ల ప్రేమ గట్రా ఉంటాయి కదా, అదీ ఫస్ట్ పేజీలో వేసి తరించింది…
అసలు ఈ కార్యక్రమానికీ తెలంగాణకు సంబంధం లేదు… వీళ్లు చెబుతున్న తెలుగు జాతి, తెలుగు సమాఖ్య పదాలకు తెలంగాణకు సంబంధం లేదు… వీళ్ల దృష్టిలో అసలు తెలుగు జాతిలో తెలంగాణ లేదు… వీళ్లు చెప్పేది పరోక్షంగా, ప్రత్యక్షంగా… తెలుగుదనం అంటే ఆంధ్రాతనం… అందులో కమ్మప్రధానం…
అంటే అన్నామంటారు గానీ… ఆ మొత్తం ప్రోగ్రాములో ఒక్క తెలంగాణ నాయకుడో, ప్రముఖుడో ఉన్నాడా..? ఉంటే ఒకరిద్దరు ఉన్నారేమో కృష్ణ ఎల్ల వంటి కరోనా ఘనులు… వాళ్లూ ఆంధ్రులే, వ్యాపార అడ్డా మాత్రమే హైదరాబాద్…
ఈ ప్రపంచ తెలుగు సమాఖ్య చైర్‌పర్సన్ ఇందిరా దత్ అని కనిపించింది… (కేసీపీ గ్రూపు అని సమాచారం)… ఎప్పుడూ హైదరాబాద్, తెలంగాణ సంబంధ వార్తల్లో ఈమె పేరు వినిపించలేదు, కనిపించలేదు… చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాగానే యాక్టివేట్ అయిపోయినట్టుంది…
ఆమే చెబుతోంది… అప్పుడెప్పుడో 1993లో ఎన్టీఆర్ ప్రారంభించాడట ఈ సమాఖ్యను.., 1996లో రెండో మహాసభలకు చంద్రబాబు ముఖ్యఅతిథి అట… మళ్లీ ఇన్నేళ్లకు మళ్లీ సీఎంగా 12 ఏళ్ల మహాసభలకు తను వచ్చాడట… తెలుగు జాతి అభ్యున్నతికి కృషి చేస్తున్నదట…
అర్థమైంది కదా… అక్కడ జగన్ అధికారంలో ఉన్నా, ఇక్కడ కేసీయార్ అధికారంలో ఉన్నా… ఈ సమాఖ్య కార్యక్రమాలు, ముఖ్య అతిథిగా చంద్రబాబు రాకపోకల కథ వేరే ఉండేది… ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కదా, మన మనిషే కదా అనే అలుసు ఉన్నట్టుంది…
అందుకే ప్రపంచ తెలుగు సమాఖ్య అని పేరు పెట్టుకున్నా సరే… పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినా సరే… తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేదు, తెలంగాణ సమాజానికి సంబంధం లేదు… అసలు తెలుగు జాతిలో తెలంగాణ జనమే లేరు… అదే ఈ ప్రోగ్రాం చెప్పింది, ఈనాడు చెప్పింది…!! తానా అధ్యక్షుడినీ పిలిచి సత్కరించారండోయ్..!!
Share this Article