హేమిటో… ఈ స్వాముల ఆ అలౌకిక శక్తి జ్ఞానాలేమో గానీ… బొత్తిగా ప్రాపంచిక జ్ఞానం నుంచి మరీ దూరమైపోతున్నారు… రాజకీయాలు, రాజకీయ అధికారం మీద, తద్వారా సమకూరే పెత్తన శక్తుల మీద మమకారం, ఆపేక్ష, ఆసక్తి, ప్రేమ ఉండవచ్చుగాక… కానీ ఆ దిశగా అడుగులు, ఆలోచనలు, మాటలు, వ్యాఖ్యలు కూడా సరిగ్గా ఉండాలి కదా… మంత్రోచ్ఛారణ సరిగ్గా లేకపోతే ఎంత నష్టదాయకమో, బేసిక్స్ తెలియకుండా రాజకీయ వ్యాఖ్యలు చేయడం కూడా అంతే అనర్థదాయకం… విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందుల వారిని చూడండి… రాజశ్యామల యాగం చేయండి స్వామీ అంటే ఇటు కేసీయార్, అటు జగన్ మంత్రముగ్దులై తన మాయలో పడిపోయేలా అద్భుతంగా యాగఫలితాన్ని చూపించాడు… దేవాదాయ శాఖను, టీటీడీని, ఇతర ఆలయాల్ని తన పీఠం కనుసన్నల్లోకి తెచ్చుకున్నాడు… మంత్రులు, అధికారులు పీఠ సందర్శనతోనే తన పలుకుబడిని నమ్మే స్థితి ఏర్పరుచుకున్నాడు… కానీ అంతటి స్వామికి కొన్ని ప్రాపంచిక అంశాలు అస్సలు అర్థం కావడం లేదు… ఈ ప్రెస్ నోట్ చూడండి ఓసారి…
బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ సంక్షేమ శాఖలో కలపడాన్ని వ్యతిరేకిస్తున్నాడు… జగన్ నిర్ణయం సరైంది కాదంటున్నాడు… ఎంత ప్రియశిష్యుడైనా సరే, జగన్ తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన, దిద్దుబాటు అవసరమని భావిస్తున్నాడు… ముఖ్యమంత్రి కార్యాలయంతో సంప్రదిస్తున్నాడు… అగ్రవర్ణాలను ఈబీసీ కేటగిరీలో చేర్చాలనేదే తన ప్రతిపాదన అంటున్నాడు… అసలు బ్రాహ్మణులను బీసీ జాబితాలో కలపాలని చూస్తే తన పీఠం పోరాటం చేస్తుందనీ హెచ్చరిస్తున్నాడు… తెలుగు సినిమా ఇండస్ట్రీ జోలికి వస్తే మాడి మసైపోతారని మొన్న రాత్రి పవన్ కల్యాణ్ గట్టిగా హెచ్చరించినట్టుగానే ఉంది ఇది కూడా…!!
Ads
అయ్యా, స్వాములవారూ… బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏదో ఆర్థిక లావాదేవీల వెసులుబాటు కోసమో, ఇతర పాలనపరమైన సౌకర్యం కోసమో బీసీ వెల్ఫేర్ శాఖకు అటాచ్ చేస్తున్నారేమో… దేవుళ్ల సొమ్ము కార్పొరేషన్ కి మళ్లిస్తున్నారు అనే ప్రచారానికి తెర వేయాలని అనుకున్నారేమో… ఓసి welfare అంటూ department ఉండదు కదా…! అంతే తప్ప, ఏకంగా బ్రాహ్మణులను బీసీల జాబితాలో కలపడం లేదు జగన్… ఆయనకు ఆ ఉద్దేశమూ లేదు… మమ్మల్ని బీసీల్లో చేర్చండ్రోయ్ అని అడిగిన బ్రాహ్మణ సమూహాలు కూడా లేవు… పైగా బీసీ జాబితాల్లో కలపడం అంటే… జగన్ రాత్రి నిద్రపోయేముందు అబ్రకదబ్ర అబ్రకదబ్ర అని నాలుగుసార్లు పఠిస్తే సరిపోదు, దానికి ఓ అఫిషియల్ ప్రొసీజర్ ఉంటుంది.,. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ వెల్ఫేర్‌లో కలిపేయడం ఆ ప్రొసీజర్‌లో ఇమడదు, అలా కుదరదు… పోనీ, మీ శిష్యరత్నం కొంపదీసి నిజంగానే బ్రాహ్మణులను బీసీల్లో చేర్చే ఆలోచనలో ఉన్నట్టు మీకేమైనా వెల్లడించాడా..? అదే జరిగితే దేశంలోనే సంచలనం… మా స్వామి కదూ, కాస్త క్లారిటీ ప్లీజ్…!!
Share this Article