పార్ధసారధి పోట్లూరి …….. భారత్ – రష్యా – చైనా – ఇరాన్! ఇప్పుడు ఈ గ్రూపులోకి సౌదీ అరేబియా రానున్నదా ? ఇదేంటి ? భారత్ చైనాలకి పడదు కదా ? ఒకే గ్రూపులోకి ఎలా రాగలుగుతాయి ? అవసరం ఏ పని అయినా చేయిస్తుంది అని మనకి తెలిసిన విషయమే ! రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాలు ఒక గ్రూపుగా మరియు మిగతా ప్రపంచ దేశాలు రెండో గ్రూపుగా ఉండి యుద్ధం చేశాయి కదా ? హిట్లర్ మరణించాక జర్మనీ తాత్కాలికంగా రెండు భాగాలుగా విడిపోయి, తూర్పు జర్మనీ సోవియట్ కి మద్దతుగా నిలవగా, పశ్చిమ జర్మనీ అమెరికా, బ్రిటన్ లతో కలిసిపోయి పనిచేశాయి కదా ?
అఫ్కోర్స్ సోవియట్ ఎక్కువ కాలం తూర్పు జర్మనీని తన అధీనంలో ఉంచుకోలేకపోయింది కాబట్టి జర్మనీ ఏకీకరణ జరిగిపోయింది. తరువాత జర్మనీ నాటోతో కలిసిపోయి సోవియట్ కి వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీని ఎలా అయినా నాశనం చేయాలని కంకణం కట్టుకున్న బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు తరువాతి కాలంలో కలిసిపోయాయి కదా ? అమెరికా వేసిన అణు బాంబుల వల్ల నష్ట పోయిన జపాన్ తరువాతి కాలంలో అమెరికా పంచన చేరిపోలేదా ?
భారత దేశానితో చైనా కనుక సత్సంబంధాలని నెలకొల్పగలిగితే ఈ కూటమి సాధ్యంఅవుతుంది ! అయితే ఇదంత తేలికగా జరిగేపని కాదు… ఎందుకంటే చైనా ఏ దేశాన్ని నమ్మదు… ఇది మొదటి నుండి పాటిస్తున్న సాంప్రదాయం ! కానీ క్వాడ్ కూటమి ముందు చైనా నిలవగలదా ?
Ads
సాంకేతికంగా చైనా కంటే ముందు ఉన్న జపాన్ ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ ని ఎలా ఎదుర్కోగలదు ? జపాన్ సంఖ్యలో తక్కువ కావచ్చు కానీ టెక్నాలజీ విషయంలో మాత్రం చాలా ముందుంది ! So ! చైనాకి కానీ రష్యాకి కానీ ఇది మంచిది కాదు ! క్వాడ్ కూటమి నుండి భారత్, జపాన్ దేశాలని ఎవరు వేరు చేయగలరు ?
ఆ పని అమెరికా ,బ్రిటన్ దేశాలు ఇప్పటికే మొదలుపెట్టాయి ! అదేంటి ? అమెరికా, బ్రిటన్ దేశాలు భారత్ ని జపాన్ ని ఎందుకు వేరు చేస్తాయి కూటమి నుండి ? ముందు భారత్ క్వాడ్ కూటమి నుండి బయటికి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడతున్నాయి! భారత దేశంలో కల్లోల పరిస్థితులు సృష్టించడానికి ఈ రెండు దేశాలు వ్యూహాలు రచిస్తున్నాయి ! మోడీ మళ్ళీ గెలవకుండా చూడడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి ! కాబట్టి మోడీ ఏ క్షణంలో అయినా తన మనసు మార్చుకొని క్వాడ్ నుండి బయటికి వచ్చేయవచ్చు ! సరే ! ఈ విషయాన్ని మరో భాగంలో వివరమగా చెప్పుకుందాము
ప్రాంతీయంగా శత్రువులు అయిన సౌదీ అరేబియా మరియు ఇరాన్ దేశాల మధ్య సఖ్యత చేకూర్చింది చైనా ! మార్చి నెల 10, 2023 న చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ టెహరాన్ వెళ్ళి ఇరాన్ అధ్యక్షుడు ఏబ్రాహీం రైసి [Ebrahim Raisi] తో తుది చర్చలు జరిపాక, ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన సారాంశం ఏమిటంటే వచ్చే రెండు నెలలో ఇరాన్ మరియు సౌదీ ఆరేబియాలు తమ తమ దౌత్య కార్యాలయాలని మళ్ళీ పునరిద్ధరించడానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి అని…
గత జనవరి నుండి జింగ్పింగ్ ఇరాన్ మరియు సౌదీ విదేశాంగ శాఖ అధికారులతో చర్చలు జరుపుతూ వచ్చాడు కానీ అవి మామూలు దౌత్య పరమయినవి అని అందరూ అనుకున్నారు కానీ జింగ్పింగ్ రెండు దేశాల మధ్య సయోధ్య కుదురుస్తున్నాడు అని బయటి ప్రపంచానికి తెలియదు !
ఈ నెల 10న ఇరాన్ కి చెందిన సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అయిన అలీ షంఖని [Ali Shamkhani] బీజింగ్ వెళ్ళి అక్కడ సౌదీ ఫారిన్ సెక్రటరీతో చర్చలు జరిపిన తరువాత సౌదీ, ఇరాన్ దేశాల ప్రతినిధులు ప్రకటన విడుదల చేశారు లాంఛనంగా ! చర్చలలో ఏం మాట్లాడారు అన్న సంగతి ఏమో కానీ, చివరికి రెండు దేశాలు మళ్ళీ స్నేహపూర్వకంగా ఉండడానికి ఒప్పుకున్నాయి ! ఈ విషయం ఇటు ఇరాన్ అధికార మీడియా ‘ఇర్నా ‘ [IRNA] తో పాటు సౌదీ మీడియా కూడా అధికారికంగా ప్రకటించింది!
విచిత్రం ఏమిటంటే, ఇరాక్ విదేశాంగ అధికారులు ఇరాన్, సౌదీల మధ్య సయోధ్య కుదర్చడానికి బీజింగ్ వచ్చారు అన్న సంగతి గమనార్హం ! ముఖ్యంగా ఇరాక్ అధికారులు సౌదీ అధికారులతో అరబ్ దేశాల సఖ్యత గురించి గంటల కొద్దీ మాట్లాడారని తెలుస్తున్నది ! నాటో దేశాలు ఇరాక్ మీద దాడి చేసిన తరువాత ఇప్పటికీ ఇరాక్ లో శాంతి భద్రతల పరిస్థితి మామూలుగా లేదు. మనలో మనం సఖ్యతగా లేకపోతే ప్రస్తుతం ఇరాక్ ఎలా ఉందో ఒక ఉదాహరణగా చెప్పారు. ఇది సౌదీ మీద ప్రభావం చూపింది ! అఫ్కోర్స్ జో బిడెన్ విషయంలో సౌదీ ఎలా వ్యవహరించిందో మనం తెలుసుకున్నాం ! కాబట్టి పాత పగలు పక్కన పెట్టి మళ్ళీ దౌత్య సంబంధాలని మొదలుపెట్టాలనే నిర్ణయం తీసుకున్నాయి సౌదీ, ఇరాన్ దేశాలు ! జింగ్పింగ్ బీజింగ్ లో ఒక వేదిక ఏర్పాటు చేశాడు ! అయితే ఇది చైనాకి కలిసివచ్చే అంశమే అయినా తెర వెనుక వేరే వ్యూహం ఉంది !
సౌదీ ఇరాన్ ల మధ్య ఎందుకు దౌత్య సంబంధాలు తెగిపోయాయి ? 2016 లో సౌదీ అరేబియా ఒక షియా మత గురువుని ఉరి తీసి చంపింది నేరారోపణలు రుజువు అవ్వడంతో ! దాంతో ఇరాన్ లోని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయం మీద ఇరాన్ ప్రజలు దాడి చేశారు ! అప్పటి నుండి ఇరాన్, సౌదీ దేశాల మధ్య దౌత్య సంబంధాలు తెగిపోయాయి ! కువైట్, UAE, ఇతర గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్ తో దౌత్య సంబంధాలని తెంచుకున్నాయి! 2021 లో UAE మళ్ళీ తన దౌత్య సంబంధాలని పునరుద్ధరించింది ఇరాన్ తో. మరో నెల తరువాత కువైట్ కూడా తన రాయబార కార్యాలయాన్ని మళ్ళీ తెరిచింది ఇరాన్ లో. వీటి వెనుక చైనా కృషి ఉంది !
ఇరాన్, సౌదీల మధ్య మళ్ళీ స్నేహం చిగురించడం వలన యెమెన్ దేశంలో మళ్ళీ మామూలు పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. యెమెన్ దేశంలో పాలక సున్నీ ప్రభుత్వానికి సౌదీ మద్దతు ఇస్తుండగా తిరుగుబాటు దళం అయిన ‘హుతీ‘లకి ఇరాన్ మద్దతు ఇస్తున్నది. ఇక మీదట రెండు దేశాలు కూడా యెమెన్ లో శాంతి భద్రతలకి విఘాతం కలగకుండా చూసుకుంటాయి ఇది ముఖ్య పరిణామం ! ఇక సిరియాలో ప్రభుత్వ వ్యతిరేక దళాలకి సౌదీ సహాయం చేస్తూ వచ్చింది… మరో వైపు రష్యా, ఇరాన్ దేశాలు సిరియా అధ్యక్షుడు అల్ బాదర్ కి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే ! ఇక మీదట సిరియా విషయంలో సౌదీ కలుగ చేసుకోదు కాబట్టి త్వరలో సిరియాలో అంతర్యుద్ధం దాదాపుగా ముగిసిపోతుంది !
ఇలా మొత్తం ముస్లిం దేశాలని ఏక తాటిమీదకి తీసుకొని రావడం ఏదయితే ఉందో అది రష్యా, చైనాల సంయుక్త ఆపరేషన్ ! ఒకవేళ అమెరికాతో పాటు యూరోపు దేశాలు కనుక తైవాన్ పక్కన ఉండి చైనాతో తలపడితే ముస్లిం దేశాలు రష్యా, చైనాకే మద్దతు ఇవ్వడానికి ముందుకు వస్తాయి లేదా తటస్థంగా ఉండి పోతాయి. దీనివలన యూరోపు దేశాలకి క్రూడ్ సప్లై విషయంలో అవాంతరాలు ఏర్పడేట్లుగా చేయవచ్చు అని రష్యా, చైనాల వ్యూహం ! ఒకవేళ యుద్ధం అంటూ వస్తే క్రూడ్ ఆయిల్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది ! ఇప్పటికే రష్యా వలన యూరోపు ఇంధన సమస్యలు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే!
మార్చి 10 న సౌదీ, ఇరాన్ ల మధ్య సయోధ్య కుదిర్చిన తరువాత పది రోజులకే అంటే మార్చి 20 న జింగ్పింగ్ మాస్కో వెళ్ళాడు ! ఇదేమీ ఆషా మాషీగా జరిగిన సంఘటనలు కావు. చాలా ముందస్తు వ్యూహంతో ఒక్కో ఇటుక పేర్చుకుంటూ వెళుతున్నాయి రష్యా, చైనాలు ! రష్యా, చైనా, ఉత్తర కొరియా మరియు గల్ఫ్ దేశాల బలాబలాలు మరో వైపు యూరోపు, అమెరికా దేశాల బలాబలాలు… మరో వైపు తూకం వేస్తే మొగ్గు అమెరికా, యూరోపుల వైపే మొగ్గినా అది ఎక్కువ కాలం ఉండబోదు ఆయిల్ సప్లై లేకుండా !
అలా అని తూకం సమపాళ్లలో ఉండాలి అన్నా లేదా ఏదో ఒక కూటమి వైపు పెరగాలన్నా అది భారత్ దేశంతోనే సాధ్యం అవుతుంది ! ఇటు రష్యా, చైనాలకి అటు అమెరికా యూరోపులకి భారత్ అవసరం చచ్చినట్లు ఉండాలి… అప్పుడే ఏదో ఒక కూటమి గెలవగలుగుతుంది!
యుద్ధం అనివార్యం అన్న సంగతి తేలిపోయింది ! అది ఎప్పుడన్నది ఎవరికీ తెలియదు ! రష్యాకి చైనాకి భారత దేశం కావాలి, అదే సమయంలో అమెరికాకి యూరోపుకి కూడా భారత దేశ అవసరం ఉంది ! హిందూ మహా సముద్రం మీద చైనాతో పోరాడాలి అంటే భారత నేవీ అవసరం అమెరికాకి అవసరం ఉంది… అలాగే భారత్ కనుక న్యూట్రల్ గా ఉంటే అది చైనాకి లాభిస్తుంది పరోక్షంగా రష్యాకి కూడా లాభం !
బహుశా లడాక్ దగ్గర చైనాతో ఉన్న సమస్య విషయంలో పుతిన్ మధ్యవర్తిత్వం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత జింగ్పింగ్ మాస్కో పర్యటనలో ఈ విషయం మీద చర్చలు జరిగే ఉండవచ్చు. ముందు తైవాన్ సంగతి చూద్దాం అలాగే ఉక్రెయిన్ సంగతి చూద్దాం అప్పటివరకు భారత్ తో ఎలాంటి సరిహద్దు వివాదాలు లేకుండా చూడమని పుతిన్ జింగ్పింగ్ ని అడిగి ఉండవచ్చు ఇది చైనాకి కూడా లాభమే ! ఉక్రెయిన్ మీద దాడి మొదలుపెట్టే ముందు పుతిన్ న్యూఢిల్లీ పర్యటనకి ఎంత ప్రాధాన్యత ఉందో… వచ్చే నెలలో పుతిన్ మళ్ళీ న్యూ ఢిల్లీ రాబోతున్నాడు కనుక ముఖ్యమయిన సమాచారం తీసుకొస్తాడనే భావిద్దాం !
Share this Article