Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నేవీ మాజీ ఉద్యోగులకు ఖతార్ క్షమాభిక్ష… అనూహ్యం, అసాధారణం…

February 19, 2024 by M S R

పోట్లూరి పార్థసారథి…    భారత్ కి సంబంధించి ఇది గొప్ప దౌత్య విజయం! ఖతార్ దేశంలో ఉద్యోగం చేస్తూ గూఢచర్యం చేశారని మరణ శిక్ష పడిన 8 మంది మాజీ నౌకాదళ ఉద్యోగులను విడుదల చేసింది ఖతార్ దేశం! 8 మంది నావీ ఉద్యోగులలో 7 గురు ఇప్పటికే భారత కి తిరిగి వచ్చేశారు. అయితే 8 మంది భారత నావీ ఉద్యోగుల విడుదల విషయం అనేది అంత సులభమైన పని కాదు! అందులోనూ మరణ శిక్ష పడిన వారిని తిరిగి మన దేశానికి తీసుకురావడం అనేది దౌత్యవర్గాలలో ఒక సంచలన వార్తగా చెలామణి అవుతున్న నేపథ్యంలో పూర్వా పరాలు ఏమిటో తెలుసుకునే ముందు ఇస్లామిక్ దేశాలలో శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో చూద్దాము.

*******
ఇస్లామిక్ దేశాలలో ఎవరన్నా నేరం చేసి పట్టుపడితే షరియా చట్టాన్ని అమలు చేస్తాయి! గరిష్టంగా మరణ శిక్ష విధిస్తారు. ఒకసారి శిక్ష పడిన అనంతరం దానిని వెనక్కి తీసుకోవడం అసంభవం! ఒకసారి గత సంఘటనలని గుర్తు చేసుకుంటే ప్రస్తుత భారత నేవీ వెటరన్స్ విడుదలకి ఎంతటి ప్రాధాన్యత ఉందో అర్థం అవుతుంది!

*********
ఇమ్పాజిబుల్ స్పై – Impossible Spy! అది 1959 వ సంవత్సరం. ఇజ్రాయెల్ కి చెందిన బిజినెస్ అకౌంటెంట్ ఎల్లీ కొహెన్ (Ellie Cohen) ను రిక్రూట్ చేసుకుంది ఇజ్రాయెల్ గూఢచార సంస్థ ‘Mossaad’. అప్పటి సిరియాలో బాత్ పార్టీ అధికారంలో ఉంది. ఎల్లీ కోహెన్ ను ఒక ముస్లిం బిజినెస్ మేన్ గా సిరియాలో ప్రవేశపెట్టింది మొస్సాద్, సిరియా రహస్యాలని తెలుసుకోవడానికి.

Ads

కొద్ది కాలంలోనే కొహేన్ సిరియాలోని వ్యాపార, రాజకీయ నాయకులు నమ్మకాన్ని చూరగొన్నాడు. సిరియా అధికార రాజకీయ పార్టీ అయిన బాత్ పార్టీలోని అగ్ర నాయకులతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పాడు. అధికార బాత్ పార్టీ నాయకుడు అయిన జెనరల్ గమాల్ హలెద్ (Gen.Gamal Haled) కి అత్యంత సన్నిహితుడుగా ఎదిగిన క్రమంలో చివరికి సిరియాలో మూడవ అత్యంత శక్తివంతమయిన డిప్యూటీ రక్షణ మంత్రి పదవిని అధిష్టించాడు కొహెన్!

కానీ 1965 లో కోహేన్ పట్టుబడ్డాడు! ఉరి శిక్ష పడింది కొహెన్ కి. గూఢ చర్యానికి ఉరి శిక్ష అనేది అరబ్ దేశాలలో సాధారణం! 1965 లో ఎల్లీ కొహెన్ ను సిరియా రాజధాని డమాస్కస్ లో ఒక లైట్ స్థంభానికి ఉరి వేశారు ప్రజలు అందరూ చూస్తుండగా! ఆరు రోజుల పాటు కొహెన్ శవం అలా వేలాడుతోనే ఉంది బహిరంగముగా!

ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో అభ్యర్ధించినా సిరియా ఒప్పుకోలేదు ఉరి శిక్ష వేయకుండా! చివరికి కొహెన్ శవాన్ని అప్పగించమని అడిగినా దానికీ ఒప్పుకోలేదు సిరియా! 1965 లో కొహెన్ ను ఉరి తీస్తే 1967 లో అరబ్ దేశాలు ఇజ్రాయెల్ మీద దాడి చేశాయి.  ఆరు రోజుల యుద్ధం (Six days War) గా పిలవబడే ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ సిరియా అధీనంలో ఉన్న గోలన్ హైట్స్ (Golan heights) ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. ఎల్లీ కోహెన్ ఇచ్చిన రహస్య సమాచారం మేరకు ఇజ్రాయెల్ గొలన్ హైట్స్ ను స్వాధీనం చేసుకోగలిగింది. 1987 లో ఎల్లీ కోహెన్ గూఢచర్యం మీద Impossible Spy పేరుతో టెలివిజన్ సీరీస్ తీశారు. అప్పట్లో అది HBO లో టాప్ గా నిలిచింది.

************
Jamal khashoggi – జమాల్ ఖాషోగ్గీ! సౌదీ అరేబియా పౌరుడు అయిన జమల్ ఖషోగ్గీ జర్నలిస్ట్! జనరల్ మేనేజర్, ఎడిటర్ ఇన్ చీఫ్ , అల్ అరబ్ న్యూస్ ఛానెల్ కి. మరో వైపు మిడిల్ ఈస్ట్ ఐ (Middle East Eye), ద వాషింగ్టన్ పోస్ట్ (The Washington Post) లకి వ్యాసాలు రాస్తుంటారు. అయితే జర్నలిస్ట్ ముసుగు లో CIA కి పనిచేస్తున్నాడు అని అనుమానించిన సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఖషోగ్గీ ను చంపమని ఆదేశాలు ఇచ్చాడు రహస్యంగా.

CIA సమాచారాన్ని ఖషోగ్గీ కి చేరవేసి దేశం విడిచి పొమ్మని ఆదేశించింది! తను సౌదీ అరేబియా వదలి 2017 సెప్టెంబర్ నెలలో పారిపోయాడు! అతని ఆచూకీ లభించలేదు! రహస్యంగా ఉండిపోయాడు. అక్టోబర్ 2, 2018 న తన పెళ్ళి తాలూకు పత్రాలని ఇవ్వడానికి టర్కీలోని ఇస్తాంబుల్ సౌదీ రాయబార కార్యాలయంలోకి వెళ్లినవాడు ప్రాణాలతో బయటకి రాలేదు! రాయబార కార్యాలయం దగ్గరలోనే ముక్కలు ముక్కలుగా శవం దొరికింది!

జమాల్ ఖషోగ్గీ ను చంపవద్దని CIA తో పాటు అమెరికా విదేశాంగ శాఖ ఉన్నత అధికారులు విజ్ఞప్తి చేసినా సౌదీ లెక్కచేయలేదు! 2018 నుండే సౌదీ అరేబియా అమెరికాల మధ్య దూరం పెరిగిపోతూ వచ్చింది. గత సంవత్సరం జో బిడేన్ సౌదీ పర్యటనకి వచ్చినప్పుడు ఒక మునిసిపల్ మేయర్ ను స్వాగతం పలకడానికి విమానాశ్రయానికి పంపాడు సౌదీ రాజు. So! దేశ ద్రోహం లేదా రాజ ద్రోహానికి పాల్పడిన వారి పట్ల ఇస్లామిక్ దేశాలు ఎంత కఠినంగా ఉంటాయో పై రెండు ఘటనలు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు!

*****
నూపుర్ శర్మ ఉదంతం! 2023 లో నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఇస్లామిక్ దేశాలలో సంచలనం సృష్టిస్తే మొదట దౌత్యపరంగా నిరసన తెలిపింది ఖతార్ దేశం! ఫలితంగా నూపుర్ శర్మని పార్టీ నుండి సస్పెండ్ చేయాల్సి వచ్చింది.

********
భారత మాజీ నావీ అధికారి కులభూషన్ యాదవ్ ను గూఢచర్య నెపంతో ఇరాన్ భూభాగం నుండి తీసుకొచ్చి జైల్లో పెట్టింది పాకిస్థాన్. అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) లో కేసు వేసిన భారత్ తీర్పు రిజర్వ్ లో ఉండడం వలన వేచి చూడాల్సి వస్తున్నది.

*********
దాదాపు 7 లక్షల మంది భారతీయులు వివిధ రంగాలలో ఉద్యోగాలు చేస్తున్నారు ఖతార్ దేశంలో! 8 మంది మాజీ నావీ అధికారులు కూడా ఖతార్ లో ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు కానీ ఒక తప్పుడు సమాచారం వలన గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది! బహుశా రెండు కారణాల వల్ల ఖతార్ అధికారులు ప్రభావితం అయి ఉండవచ్చు!

1. ప్రస్తుతం పాకిస్థాన్ జైలులో ఉన్న వెటరన్ నావీ అధికారి కుల భూషణ్ యాదవ్ మాజీ నావీ అధికారి కాబట్టి ఖతార్ లో ఉద్యోగం చేస్తున్న 8 మంది మాజీ నావీ అధికారులు కూడా గూఢచర్యం కోసమే ఖతార్ వచ్చి ఉండవచ్చు అనే అనుమానాన్ని పాకిస్థాన్ ISI చెప్పి ఉండవచ్చు ఖతార్ అధికారులకి.
2. అమెరికన్ CIA పాత్రని కొట్టివేయలేము. ఎందుకంటే EAM జయశంకర్ ని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో భాగంగా తప్పుడు ఇన్పుట్ ఇచ్చి ఉండవచ్చు. యూరోప్ తో పాటు అమెరికాకి కూడా జైశంకర్ అంటే పడడం లేదు.

*******
అజిత్ దొవల్ 6 సార్లు ఖతార్ వెళ్లి వచ్చారు. అమెరికన్ CIA, పాకిస్థాన్ ISI లు కలిసి ఎలా భారత నావీ ఉద్యోగుల మీద అనుమానాలు రేకెత్తించే విధంగా కుట్ర చేశాయో ఖతార్ ఇంటిలిజెన్స్ అధికారులకి వివరించారు.

******
COP 28 ( 28th Conference of Parties) సమావేశాల సందర్భంగా మోడీ దుబాయ్ వెళ్లారు గత డిసెంబర్ నెలలో! అప్పుడు ఖతార్ ఏమీర్ ను కలిసి మాజీ నావీ ఉద్యోగుల విషయము ప్రస్తావించారు. అధికారులతో సమావేశం అనంతరం మాత్రమే హామీ ఇవ్వగలను అంటూ హామీ ఇచ్చారు ఖతార్ ఎమీర్! ఆ తర్వాతే అజిత్ దొవల్ దోహా వెళ్లి అక్కడి ఇంటెలిజెన్స్ అధికారుల అనుమానాలకు జవాబు ఇస్తూ వచ్చారు. రోజు వారీ సమీక్షలో నావీ ఉద్యోగుల విడుదల విషయం ప్రస్తావించే వారు మోడీ! భారత విదేశాంగ శాఖ అధికారులు, మరో వైపు అజిత్ డోవల్ సంప్రదింపుల ఫలితమే నావీ ఉద్యోగుల విడుదల సాధ్యం అయ్యింది. మిషన్ ఇంపాజిబుల్ కాస్త పాజిబుల్ అయ్యింది!

*******
గోతి కాడ నక్కలు! ఎప్పుడెప్పుడు నావీ ఉరి శిక్ష అమలు అవుతుందా అని ఎదురు చూసిన యాంటీ బీజేపీ శక్తులకు ఆశా భంగం కలిగింది. ఖతార్ దేశం భారత్ ను బ్లాక్ మెయిల్ చేసింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేశారు. భారత్ నావీ ఉద్యోగుల విడుదల కోసం ఖతార్ దేశంతో ఖరీదయిన గ్యాస్ ఒప్పందం చేసుకున్నాడు మోడీ అనే వార్తలు కూడా… ఇందులో నిజం ఎంత?

LNG (Liquified Natural Gas) సరఫరా కోసం ఫిబ్రవరి 6 న ఒప్పందం చేసుకున్న మాట వాస్తవం!
1. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన పెట్రో నెట్ LNG Ltd, ఖతార్ ఎనర్జీతో గ్యాస్ సరఫరా కోసం ఒప్పందం చేసుకున్నది.
2.సంవత్సరానికి 7.5 మిలియన్ టన్నుల LNG ను 20 ఏళ్ల సరఫరా కోసం ఒప్పందంపై సంతకాలు చేశాయి! ఇది నావీ ఉద్యోగుల విడుదల కోసం చేసింది కాదు!
3.1998 నుండి 2028 వరకు గ్యాస్ సరఫరా కోసం ఒప్పందంపై సంతకాలు చేశాయి రెండు దేశాలు 1998 లో. దానికి కొనసాగింపు ఒప్పందమే ఫిబ్రవరి 6 న చేసుకున్న ఒప్పందం! మరి పాత ఒప్పందం 2028 వరకూ ఉందిగా? నాలుగేళ్ల ముందే ఎందుకు ఒప్పందాన్ని పొడిగించారు?
4. ఇప్పుడు కనుక ఒప్పందం చేసుకుంటే డిస్కౌంట్ ఆఫర్ ఇస్తాను అంది ఖతార్! ఎంత డిస్కౌంట్ ఆఫర్ చేసింది ఖతార్? 6 బిలియన్ డాలర్లు!
5. 2028 లో ముగియబోయే ఒప్పందపు ధరనే 2048 వరకూ వర్తిస్తుంది 2028 నుండి. దీని వల్ల 6 బిలియన్ డాలర్లు ఆదా అవుతుంది.! అంచేత గ్యాస్ ఒప్పందం కి నావీ ఉద్యోగుల విడుదల కి సంబంధము లేదు!

*********
మోడీ ఈ నెల 14 న ఖతార్ దేశంలో పర్యటించారు! మోడీకి ఘన స్వాగతం లభించింది! అక్కడ సమస్య ఏమిటంటే ఖతార్ ను మిగతా గల్ఫ్ దేశాలు బహిష్కరించాయి! మోడీ 2015 లో మొదటిసారిగా ఖతార్ లో పర్యటించారు. సౌదీ, UAE లలో మూడు సార్లు పర్యటించారు! సౌదీ, UAE లతో పాటు భారత్ కూడా ఖతార్ కి దూరంగా ఉంటున్నది అనే భావనలో ఉన్నాడు ఖతార్ ఎమీర్. ఆఫ్కొర్స్ అల్ జజీరా భారతదేశం మీద చేసిన, చేస్తున్న దుష్ప్రచారం కూడా ఒక కారణం!

******
ఖతార్ భారత నావీ ఉద్యోగుల విడుదల తరువాత రోజున ఇజ్రాయెల్ సైన్యం అల్ జజీర జర్నలిస్ట్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నది. సదరు జర్నలిస్ట్ పగలు రిపోర్టింగ్ చేయడం, రాత్రి పూట గన్ పట్టుకొని హమాస్ తరుపున ఇజ్రాయెల్ సైన్యంతో పోరాడుతున్నాడు. ఈ వార్త వైరల్ అవ్వడంతో ఖతార్ అధికారులు తల పట్టుకున్నారు. పగలు press పేరు ఉన్న జాకెట్ వేసుకొని గాజాలో కెమెరాతో తిరగడం, రాత్రి పూట బులెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని గన్ను పట్టుకొని తిరుగుతున్నాడు. IDF సదరు జర్నలిస్ట్ ID కార్డ్ ను చూపిస్తూ పగలు PRESS పేరు ఉన్న జాకెట్ లో ఉన్న ఫోటో వీడియోలో చూపించింది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions