Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏమంటవ్ గంభీర్..? మనం పన్నిన ‘పిచ్చు’పై మనమే బోల్తా అన్నమాట..!!

November 16, 2025 by M S R

.
మిత్రుడు Nàgaràju Munnuru చెప్పినట్టు… ‘‘ఎన్నికల ఫలితాల హడావుడిలో ఎవరూ పట్టించుకోలేదు కానీ నవంబర్ 14 తేదీనే కలకత్తాలో భారత్ దక్షిణాఫ్రికా మధ్య టెస్టు మ్యాచ్ మొదలయ్యింది…

మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 159 పరుగులు చేసి ఆలౌట్ అవగా, మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 189 పరుగులు చేసి 30 పరుగులు లీడ్ సాధించింది…

దక్షిణాఫ్రికా రెండవ ఇన్నింగ్స్ లో కేవలం 153 పరుగులు మాత్రమే చేసింది… 124 పరుగుల లక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ స్పిన్ బౌలింగ్ కి అనుకూలంగా తయారు చేసిన పిచ్ మీద 93 పరుగులకే కుప్పకూలింది… దీంతో దక్షిణాఫ్రికా 30 పరుగుల తేడాతో విజయం సాధించింది…

Ads

మొదటి రెండు రోజులు పేస్ బౌలింగ్ కి, ఆ తర్వాత మూడు రోజులు స్పిన్ బౌలింగ్ కి అనుకూలంగా ఉండే సమతుల పిచ్ తయారు చేస్తామని చెప్పిన భారత్ స్పిన్ ఉచ్చులోనే పడి అపజయం పాలయ్యింది… ఈ ఓటమికి భారత కోచ్ గౌతం గంభీర్, క్యురేటర్ లే కారణం..’’



మనం పన్నిన ఉచ్చులో మనమే పడ్డామన్నట్టు…! గిల్ గాయపడకుండా ఉంటే బాగుండేది అని రాశారు ఎవరో… కానీ తను గాయపడకుండా ఆడనా సరే, పెద్ద ఫలితంలో తేడా ఉండేది కాదు…

మంచి ప్రొఫషనల్ ఆటగాళ్లు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు, మేనేజ్‌మెంట్… ఇండియన్ ప్లేయర్లలో ఒక్కో బౌలర్‌ను ఎలా ఎదుర్కోవాలి, ఒక్కో ఇండియన బ్యాటర్‌ను ఎలా ఔట్ చేయాలో విడివిడి వ్యూహాలుంటాయి… అలాగే ఇండియాలో పిచ్ స్పిన్‌కు అనుకూలంగా తయారు చేస్తారనీ తెలుసు వాళ్లకు…

దీనికితోడు ఇద్దరి మొదటి ఇన్నింగ్స్ త్వరత్వరగా అయిపోయాయి… దక్షిణాఫ్రికా సెకండ్ ఇన్నింగ్ కూడా కష్టంగానే సాగింది… ఆ తరువాత మన పిచ్ మనకే కష్టంగా మారి, టపటపా వికెట్లు పడిపోయి, ఆ జట్టుకు చేజేతులా అప్పగించేశాం మ్యాచును… హార్మర్ బౌలింగ్ చూసి తీరాల్సిన విశేషమే… మన వాళ్లకు ముచ్చెమటలు…!!

వాస్తవంగా… మన ప్లేయర్లు ఇంకా టీ20 హ్యాంగోవర్ నుంచి బయటపడలేదు… అదొక ఓటమి కారణం… ఐనా అనుకూల పిచ్చులతో గెలిచినా సరే అదేం గెలుపు..? అందులో థ్రిల్, మజా ఏముంటుంది..? రెండు జట్లకూ అనుకూలంగా పిచ్ ఉంటే, అందులో గెలిస్తే అదీ గెలుపు… ప్రొఫెషనల్ పిచ్ రూపొందించినా ఇండియా ఓడిపోతే పోయేదేముంది..? ఆఫ్టరాల్ ఇది ఆట… ఎవరో ఒకరు గెలుస్తారు..?

ఎలా ఓడిపోయినా సరే, ఇండియన్ల క్రికెట్ మోజేమీ తగ్గదు… బీసీసీఐ ఆదాయానికి వచ్చిన ఢోకా కూడా ఏమీ ఉండదు… న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్… ప్రస్తుతం ఈ టీమ్స్‌పై సరైన గెలుపు సాధిస్తేనే మజా… అసలు పోటీపడటంలోనే ఉంది మజా… అదీ ప్రొఫెషనల్, బ్యాలెన్స్‌డ్ పిచ్ అయితే గెలుపు ఆనందం మరీ ఎక్కువ…

చివరగా…. మిత్రుడు బెల్లంకొండ ప్రసేన్ వెటకరించి చెప్పినట్టు… ఈ మ్యాచులో విజేత పిచ్ క్యురేటర్..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమంటవ్ గంభీర్..? మనం పన్నిన ‘పిచ్చు’పై మనమే బోల్తా అన్నమాట..!!
  • అగ్నితుఫాన్లన్నీ చల్లగా, చప్పగా ‘ఇల్లు’ వదిలి నిష్క్రమించాయి..!!
  • మరో పొలిటికల్ బిడ్డ కుటుంబానికి దూరం… ఎవరు ఈ బీహారీ కవిత..?!
  • జై వారణాసి శ్రీరామ్..! ఉన్నారో లేదో తెలియని దేవుళ్లూ దిగిరావల్సిందే..!!
  • నేరాలు చేసేవాడు పెళ్లాంతో బాగుండాలి… లేకపోతే కొంప ఖల్లాసే…
  • సాలు మరద తిమ్మక్క… 114 ఏళ్ల బతుకంతా పచ్చటి చెట్ల వరుసలే…
  • ఓహ్…! జుబ్లీ హిల్స్‌లో ఓడింది జగన్ రెడ్డి… గెలిచింది చంద్రబాబా..?!
  • అసలు రాహుల్ గాంధీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి ఇక పనికిరాదా..!?
  • సుమలత ఖాళీ చేయదు… రాజేంద్ర ప్రసాద్ అమ్ముకోలేడు… అల్లరల్లరి..!!
  • ఓ సైంటిస్టు ఘన సృష్టి..! కానీ మన కుళ్లు వ్యవస్థ తనను చంపేసింది..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions