.
ఒక అమెరికా నేవిగేషన్ ద్రోహం… ఒక ఇండియా సంకల్పం… ఓ హైపర్ కన్ను…
ఆపరేషన్ 5 మీటర్స్: ఒక గెలుపు – ఒక గతం – ఒక కల…
Ads
అధ్యాయం 1: కార్గిల్ ఎండమావి (1999) సముద్ర మట్టానికి 16,000 అడుగుల ఎత్తు… మైనస్ 10 డిగ్రీల చలి… కార్గిల్ శిఖరాల పైనుండి శత్రువుల ఫిరంగులు విరుచుకుపడుతున్నాయి… భారత సైన్యం ప్రాణాలకు తెగించి పోరాడుతోంది… కానీ ఒక చిక్కు వచ్చి పడింది… శత్రువు ఎక్కడ దాక్కున్నాడో పసిగట్టడానికి మన దగ్గర ఉన్న అమెరికన్ GPS సిగ్నల్స్ ఒక్కసారిగా మొరాయించాయి…
అమెరికా ఎందుకు తగ్గించింది?
యుద్ధ సమయంలో ఏ పక్షం వహించకూడదనే సాకుతో, అమెరికా తన GPS వ్యవస్థలోని Selective Availabilityని ఉపయోగించి సిగ్నల్ కచ్చితత్వాన్ని తగ్గించేసింది… అంటే, ఒక శత్రువు బంకర్ 5 మీటర్ల దూరంలో ఉంటే, మన GPS అది 100 మీటర్ల దూరంలో ఉన్నట్టు చూపించేది… మన క్షిపణులు లక్ష్యం తప్పాయి… ఆ రోజు భారత సైనికుల రక్తం చిందుతుంటే, ఢిల్లీలోని సౌత్ బ్లాక్ ఒక నిర్ణయానికి వచ్చింది…: "మనకు సొంత కళ్ళు ఉండాలి... అవి ఎవరి ఆధీనంలోనూ ఉండకూడదు..."
అధ్యాయం 2: ఆపరేషన్ సింధూర్ నుండి నవిక్ (NavIC) వరకు
కార్గిల్ తర్వాత పుట్టుకొచ్చిందే NavIC… గతంలో ‘ఆపరేషన్ సింధూర్’ వంటి సమయాల్లో మనం 50 మీటర్ల ప్రెసిషన్‌తో (CEP) టార్గెట్లను కొట్టేవాళ్లం… అంటే ఒక పెద్ద బాంబు వేస్తే ఆ ఏరియా అంతా నాశనమయ్యేది… కానీ ఆధునిక యుద్ధతంత్రంలో మనకు కావాల్సింది ‘పిన్-పాయింట్ ప్రెసిషన్’…
ఒక టెర్రరిస్ట్ ఒక భవనంలో ఉన్నప్పుడు, ఆ భవనాన్ని కూల్చకుండా కేవలం వాడు ఉన్న గది కిటికీలోంచి క్షిపణి వెళ్లాలి… దీనినే 5 మీటర్ల ప్రెసిషన్ అంటారు… దీనికోసం ఇస్రో అత్యంత ఖచ్చితమైన పరమాణు గడియారాలను (Atomic Clocks) తయారు చేసింది…
అధ్యాయం 3: ‘అన్వేష’ – చీకటిని చీల్చే కన్ను
మొన్న PSLV-C62 ద్వారా పంపాలనుకున్న అన్వేష (Anvesha – EOS-N1) ఉపగ్రహం కేవలం ఒక కెమెరా కాదు, అది శత్రువుల పీడకల…
-
కెపాసిటీ..: ఇది ఒక హైపర్ స్పెక్ట్రల్ ఉపగ్రహం… అంటే, శత్రువు తన ట్యాంకును పచ్చటి ఆకుల మధ్య దాచినా, ఆ ఆకులకు, ట్యాంక్ ఇనుముకు మధ్య ఉండే తరంగదైర్ఘ్యం (Wavelength) తేడాను ఇది పసిగట్టగలదు…
-
దిశానిర్దేశం…: అన్వేష ఇచ్చే డేటా, NavIC ఇచ్చే సిగ్నల్ కలిస్తే… మన క్షిపణులు గాలిలో మలుపులు తిరుగుతూ వెళ్ళి 5 మీటర్ల లోపు ఉన్న టార్గెట్‌ను పిట్టను కొట్టినట్టు కొట్టగలవు…
అధ్యాయం 4: నిన్నటి నిశ్శబ్దం (PSLV-C62 వైఫల్యం)
మొన్న శ్రీహరికోటలో కౌంట్‌డౌన్ ముగిసింది… రాకెట్ నింగిలోకి ఎగిరింది… కానీ మూడో దశలో సాంకేతిక లోపం తలెత్తింది… ‘అన్వేష’ ఉపగ్రహం కక్ష్యలోకి చేరకుండానే సముద్రం పాలైంది…. 50 మీటర్ల నుండి 5 మీటర్ల ప్రెసిషన్ వైపు భారత్ వేస్తున్న అడుగులో ఒక చిన్న ఆటంకం కలిగింది…
ఒక రాకెట్ కూలిపోవచ్చు, కానీ ఆ రోజు కార్గిల్ కొండల్లో పుట్టిన ‘సొంత టెక్నాలజీ’ కల మాత్రం చెదిరిపోదు… ఇస్రో శాస్త్రవేత్తలు మళ్ళీ పుంజుకుంటారు… 50 మీటర్ల నుండి 5 మీటర్లకు మన ప్రెసిషన్ ప్రయాణం త్వరలోనే పూర్తవుతుంది….
హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ (Hyperspectral Imaging) అనే ఈ ‘అన్వేష’ సాంకేతికత ఎలా పనిచేస్తుందో తెలిస్తే.. అది శత్రువులకు ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది….
సాధారణంగా మనం చూసే ఫోటోలు లేదా ఇతర ఉపగ్రహాలు కేవలం మూడు రంగులను (ఎరుపు, ఆకుపచ్చ, నీలం – RGB) మాత్రమే చూస్తాయి. కానీ ‘అన్వేష’ అలా కాదు…
1. వేలిముద్రల వంటి తరంగాలు (Spectral Signatures)
ప్రకృతిలో ప్రతి వస్తువు ఒక నిర్దిష్టమైన కాంతి తరంగాన్ని పరావర్తనం (Reflect) చేస్తుంది…
-
ఉదాహరణకు, నిజమైన చెట్టు ఆకు వెదజల్లే కాంతి తరంగానికి, ఆకుపచ్చ రంగు వేసిన ప్లాస్టిక్ వలకు లేదా పెయింట్ వేసిన ఇనుముకు మధ్య చాలా తేడా ఉంటుంది…
-
మన కంటికి రెండూ ఆకుపచ్చగానే కనిపిస్తాయి… కానీ అన్వేష తన కెమెరాలో కాంతిని వందలాది ముక్కలుగా (Spectra) విడగొట్టి చూస్తుంది…
2. చెట్ల చాటున దాచిన ట్యాంకులను పట్టేయడం
శత్రువులు తమ యుద్ధ విమానాలను లేదా క్షిపణులను కప్పి ఉంచడానికి పచ్చటి వలలు (Camouflage nets) కప్పుతారు…
-
సాధారణ ఉపగ్రహం దాన్ని ఒక అడవిలాగానో లేదా చెట్ల గుంపులాగానో చూపిస్తుంది…
-
కానీ అన్వేష ఆ వల కింద ఉన్న ఇనుము (Metal) యొక్క స్పెక్ట్రల్ సిగ్నేచర్‌ను గుర్తు పడుతుంది… ఆ సెకనులో ఆ వస్తువు ఉన్న ఖచ్చితమైన పాయింట్‌ను మార్క్ చేస్తుంది…
3. ఆ 5 మీటర్ల మ్యాజిక్ ఇక్కడే మొదలవుతుంది
ఒకసారి అన్వేష ఆ టార్గెట్‌ను గుర్తించాక, ఆ డేటా మన NavIC (నవిక్) వ్యవస్థతో అనుసంధానం అవుతుంది…
-
నవిక్ (NavIC)..: అటామిక్ గడియారాల సాయంతో ఆ టార్గెట్ అక్షాంశ, రేఖాంశాలను (Coordinates) అత్యంత కచ్చితంగా లెక్కిస్తుంది…
-
క్షిపణి (Missile)…: ఈ సమాచారాన్ని అందుకున్న మన క్షిపణి, మునుపటిలాగా 50 మీటర్ల దూరంలో పడి మొత్తం ప్రాంతాన్ని ధ్వంసం చేయాల్సిన అవసరం లేదు… నేరుగా ఆ వల కింద దాగి ఉన్న వస్తువు మీదకే 5 మీటర్ల కచ్చితత్వంతో దూసుకెళ్తుంది…
భారత్ ఎందుకు ఆవేదన చెందుతోంది?
మొన్నటి పీఎస్ఎల్వీ-సి62 (PSLV-C62) ప్రయోగం ఫెయిల్ అవ్వడం వల్ల ఇలాంటి ఒక “సూపర్ హ్యూమన్ ఐ” ని మనం కక్ష్యలో ఉంచలేకపోయాం… ఇది విజయవంతమై ఉంటే, కార్గిల్ సమయంలోలాగా అమెరికా మనల్ని మోసం చేసినా మనకు అనవసరంగా ఉండేది. ఏ మేఘాలు ఉన్నా, ఏ అడవులు ఉన్నా శత్రువు మన కంటికి చిక్కాల్సిందే…
-
CEP (Circular Error Probable):అంటే లక్ష్యం చుట్టూ ఉండే ఎర్రర్ రేంజ్. ఇది ఎంత తక్కువ ఉంటే దాడి అంత కచ్చితంగా ఉంటుంది. -
హైపర్ స్పెక్ట్రల్ కెమెరా:ఇది కాంతిని 100 కంటే ఎక్కువ రంగులుగా విడగొట్టి వస్తువుల స్వభావాన్ని పసిగడుతుంది.
నవిక్ (NavIC): ఇది భారతదేశపు స్వంత GPS. దీనివల్ల మనం ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
అవునూ, మొన్నతీసుకుపోయిన 16 ఉపగ్రహాలు ఏమైపోయినట్టు అనే సందేహం వచ్చిందా మీకు..? సింపుల్… తిరిగి భూకక్ష్యలోకి ప్రవేశించి, పైనే మండిపోతాయి..!!
Share this Article