.
ఒక పరిణామం… ఇండియా జియో పాలిటిక్స్‌లో ‘మల్టీ అలైన్‌మెంట్’ పాలసీతో ఒక భిన్నమైన పాత్ర పోషిస్తోంది… సైలెంటుగా, ఏ అట్టహాసాలు లేకుండా… పక్కా ప్రణాళికతో… ప్రపంచ చదరంగంలో తనదైన ఆట ఆడుతోంది… వివరాల్లోకి వెళ్తే…
ప్రస్తుతం ఇండియాలో జర్మనీ ఫెడరల్ రిపబ్లిక్ చాన్స్‌లర్ Olaf Scholz పర్యటన సాగుతోంది… రెండు దేశాల నడుమ 27 కీలక ఒప్పందాలు కుదిరాయి… ఇండియాతో జర్మనీకి స్నేహం కావాలి, సాయం కావాలి… చైనాపై ఆధారపడే దుస్థితి తగ్గాలి… అదీ దాని ఎయిమ్… గ్లోబల్ జియోపాలిటిక్స్, సప్లై చైన్స్, గ్రీన్ ట్రాన్సిషన్, ఇండో–పసిఫిక్ వ్యూహంకి కూడా గేమ్-చేంజర్‌లు ఇవి…
Ads
- ఇదే కాదు, రెండుమూడేళ్లలో న్యూజిలాండ్, బ్రిటన్ మాత్రమే కాదు, పలు దేశాలతో ఇండియా సత్సంబంధాలు మరింత పటిష్టమయ్యాయి…
1. బ్రిటన్ (UK) – మే 2025… భారత్, బ్రిటన్ మధ్య సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) మే 2025లో సంతకం చేయబడింది… దీనివల్ల బ్రిటన్ నుంచి వచ్చే విస్కీ, కార్లు, ఎలక్ట్రికల్ వస్తువులపై సుంకాలు తగ్గుతాయి… అదే సమయంలో భారత్ నుంచి ఎగుమతి అయ్యే టెక్స్‌టైల్స్, లెదర్ వస్తువులకు బ్రిటన్ మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడనుంది…
2. న్యూజీలాండ్ – డిసెంబర్ 2025… ఇటీవలే డిసెంబర్ 2025లో భారత్, న్యూజీలాండ్ తమ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (FTA) ఖరారు చేశాయి… ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఐటీ నిపుణులకు, విద్యార్థులకు న్యూజీలాండ్‌లో మరిన్ని అవకాశాలు లభిస్తాయి… వ్యవసాయ రంగంలో పరస్పర సాంకేతిక సహకారం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు…
3. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (EFTA) – అక్టోబర్ 2025… భారత్ మొదటిసారిగా స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, లిక్తెన్‌స్టెయిన్ వంటి అభివృద్ధి చెందిన యూరోపియన్ దేశాలతో ఈ ఒప్పందం చేసుకుంది… దీని ద్వారా రాబోయే 15 ఏళ్లలో భారత్‌లో $100 బిలియన్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా…
4. జర్మనీ, ఫ్రాన్స్‌లతో నేరుగా వాణిజ్య ఒప్పందం (FTA) కాకుండా, “ఇండో-జర్మన్ గ్రీన్ హైడ్రోజన్ రోడ్‌మ్యాప్”, రక్షణ రంగంలో భారీ పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి… చైనాపై ఆధారపడటం తగ్గించి భారత్‌ను తమ ప్రధాన వ్యాపార భాగస్వామిగా జర్మనీ గుర్తించింది…
5. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) & ఆస్ట్రేలియా…. ఈ ఒప్పందాలు 2022లో మొదలైనప్పటికీ, 2024-25 నాటికి ఇవి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చి భారత్ ఎగుమతులు భారీగా పెరగడానికి దోహదపడ్డాయి…
6. గయానా … ఇంధన భద్రత కోసం గయానాతో బంధమే కాదు, అక్కడ మనం చమురు తవ్వుకోబోతున్నాం, వెనెజులా కొత్త సర్కారు కూడా ఇండియాతో స్నేహహస్తం చాస్తోంది…
యూరోపియన్ యూనియన్ (EU) FTA చర్చలు తుది దశలో ఉన్నాయి (డిసెంబర్ 2026 నాటికి పూర్తికావచ్చు)… రష్యాతో వ్యాపార, స్నేహ, రక్షణ బంధాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు… అందుకే అమెరికాకు మండిపోతోంది… 500 శాతం టారిఫ్ అనే బెదిరింపుల వెనుక ఇలాంటి చాలా కోణాలున్నయ్…

ఒకప్పుడు ప్రపంచం రెండుగా చీలిపోయి ఉండేది… ఒకవైపు అమెరికా, మరోవైపు సోవియట్ యూనియన్… అప్పట్లో ఏదో ఒక పక్షం వైపు ఉండక తప్పని పరిస్థితి… కానీ నేడు 21వ శతాబ్దంలో, భారత్ సరికొత్త ‘మల్టీ-అలైన్‌మెంట్’ అనే వ్యూహంతో ప్రపంచ దేశాలనే తన వైపు తిప్పుకుంటోంది…
- ప్రస్తుతం భారత్ ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది… 140 కోట్ల జనాభా కలిగిన అతిపెద్ద మార్కెట్ మనది… ఏ దేశానికైనా తమ వస్తువులు అమ్ముకోవాలన్నా, లేదా పెట్టుబడులు పెట్టాలన్నా భారత్ ఇప్పుడు ఒక అనివార్య దేశం… ఈ బలాన్ని చూసే బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి యూరోపియన్ దేశాలు క్యూ కడుతున్నాయి… చైనాతో పెరుగుతున్న విభేదాల నేపథ్యంలో, ఆ దేశాలన్నీ తమ ‘సప్లై చైన్’ కోసం భారత్‌ను సురక్షితమైన ప్రత్యామ్నాయంగా చూస్తున్నాయి…
అమెరికా అసహనం – రష్యా స్నేహం
ఈ కథలో ఆసక్తికరమైన మలుపు రష్యా-అమెరికా-భారత్ త్రికోణ నీతి… ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు, రష్యాను ఒంటరి చేయాలని అమెరికా భావించింది… కానీ భారత్ మాత్రం తన పాత మిత్రుడిని వదులుకోలేదు… “మా దేశ ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం” అని కుండబద్దలు కొట్టి మరీ, అమెరికా ఆంక్షలను పక్కనపెట్టి రష్యా నుండి చవకగా చమురు కొనుగోలు చేసింది…
ఇది అమెరికాకు ఆగ్రహం తెప్పించినా, భారత్‌ను ఏమీ చేయలేని పరిస్థితి… ఎందుకంటే ఆసియాలో చైనాను అడ్డుకోవాలంటే అమెరికాకు భారత్ మద్దతు కచ్చితంగా కావాలి… కాకపోతే బెదిరిస్తూ ఉంటుంది తనకు అలవాటైన శైలిలో…
ఆర్థిక లాభాల పంట… ఈ మల్టీ-అలైన్‌మెంట్ వల్ల భారత్ ఒకే సమయంలో భిన్నమైన లాభాలను పొందుతోంది…
టెక్నాలజీ: అమెరికా నుండి సెమీ కండక్టర్లు, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీని పొందుతోంది.
రక్షణ: ఫ్రాన్స్, జర్మనీల నుండి అత్యాధునిక జెట్ విమానాలు, సబ్‌మెరైన్ల తయారీ సాంకేతికతను అందుకుంటోంది.
ఇంధనం: రష్యా నుండి తక్కువ ధరకు చమురు పొంది దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచుతోంది.
తయారీ: యాపిల్ వంటి గ్లోబల్ కంపెనీలు తమ ప్లాంట్లను భారత్‌కు మళ్లించేలా ఒప్పందాలు చేసుకుంటోంది.
ముగింపు: ‘విశ్వమిత్ర’ నుంచి ‘విశ్వగురువు’ వైపు… భారత్ ఇప్పుడు ఒకరి పక్షాన ఉండి మరొకరిని శత్రువుగా చేసుకునే స్థితిలో లేదు… తన ప్రయోజనం ఎక్కడ ఉంటే అక్కడ స్నేహం చేస్తూనే, తన స్వతంత్రతను కాపాడుకుంటోంది…
సారాంశం ఏమిటంటే: ప్రపంచ రాజకీయాల్లో భారత్ ఇప్పుడు కేవలం ఒక దేశం కాదు, అది ఒక కేంద్ర బిందువు… ఈ మల్టీ-అలైన్‌మెంట్ విధానమే భారత్‌ను రాబోయే కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడవ అతి పెద్ద శక్తిగా మార్చబోతోంది…
Share this Article