Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇండియా చేతికి ఒమన్ పోర్ట్ డుఖం… పాకిస్థాన్‌కు కొత్త దుఖం…

January 2, 2026 by M S R

.

Pardha Saradhi Upadrasta ….. పాకిస్తాన్‌ను అష్టదిగ్బంధనం చేసిన భారత్…  వివరంగా …

భారత్ – ఒమన్ సంబంధాలు ఈనాటివి కావు. ఇవి శతాబ్దాల చరిత్ర కలిగిన వ్యూహాత్మక బంధాలు.
చరిత్రలోకి వెళ్తే…
చత్రపతి శివాజీ కాలం నుంచే మస్కట్‌లో భారతీయ వ్యాపారులు స్థిరపడ్డారు. భారత–అరబ్ సముద్ర వాణిజ్యం ఒమన్‌తో ఉన్న బలమైన అనుబంధానికి మూలం.

Ads

మొన్నటి మోదీ ఒమన్ పర్యటన తరువాత, డిసెంబర్ 29, 2025 న ప్రారంభమైన కౌండిన్య షిప్ యాత్ర ప్రాచీన నావికా మార్గాలను పునరుజ్జీవింపజేస్తూ ఈ చారిత్రక వారసత్వాన్ని ప్రపంచానికి గుర్తు చేసింది.

 4 బిలియన్ డాలర్ల ఒప్పందాలు – ఎందుకు కీలకం?
ప్రధాని మోదీ ఒమాన్ పర్యటనలో భారత ఎగుమతులపై సుంకాలు లేకుండా వాణిజ్య ఒప్పందం. ఇంధనం, పర్యాటకం, డిజిటల్ & సాంకేతికతల్లో $ 4 బిలియన్ విలువైన ఒప్పందాలు.

దీని అర్థం…
✔️ భారత ఉత్పత్తులకు గల్ఫ్ మార్కెట్లలో సులభ ప్రవేశం
✔️ చైనా ప్రభావాన్ని గల్ఫ్‌లో తగ్గించే వ్యూహం
✔️ భారత్ ఆర్థిక శక్తి విస్తరణ

 మన చేతికి డుకం ఎయిర్‌బేస్ & పోర్టు
ఒమాన్ సుల్తాన్ అనుమతితో Duqm Port, డుకం ఎయిర్‌బేస్‌లో భారత నౌకాదళానికి పూర్తి లాజిస్టిక్ యాక్సెస్.

డుకం ప్రత్యేకతలు…
• ఆఫ్ హోర్ముజ్ జలసంధికి అతి సమీపం.
• హిందూ మహాసముద్రం – అరేబియా సముద్రం మధ్య కీలక స్థానం.
• యుద్ధ నౌకల రిపేర్లు, ఇంధన పునరుద్ధరణ, రీసప్లై.
ఇది భారత్‌కు ‘ఫార్వర్డ్ నేవల్ ప్రెజెన్స్’.

 శత్రువుల కదలికలపై నిఘా
డుకం + చాబహార్ సమీకరణం అంటే: Gwadar Port (పాక్– చైనా ప్రాజెక్ట్)పై ఒత్తిడి, Chabahar Portతో భారత వ్యూహాత్మక సమన్వయం. చైనా, అమెరికా నౌకల కదలికలపై అవగాహన. అరేబియా సముద్రంలో పాక్ గ్వాదర్ ప్రాధాన్యం తగ్గింపు.

సైనిక సహకారం – మాటల్లో కాదు, మైదానంలో
భారత్–ఒమాన్ మధ్య:
✔️ ‘నసీముల్ బహార్’ నౌకా విన్యాసాలు
✔️ ఈస్టర్న్ బ్రిడ్జ్ వద్ద వాయుసేన వ్యాయామాలు
✔️ భూసైన్యాల సంయుక్త శిక్షణ

రసెల్ హగ్ సిగ్నలింగ్ పోస్ట్ (ఆఫ్ హోర్ముజ్): ప్రపంచ ఆయిల్ రవాణాలో సుమారు 30% పై నిఘా సామర్థ్యం

 పాక్‌కు ఇది ఎందుకు భారీ దెబ్బ?
గ్వాదర్ పోర్ట్ చుట్టూ ఉన్న వ్యూహాత్మక ఆధిక్యం తగ్గుతుంది.
అరేబియా సముద్రంలో భారత్ స్థిరంగా నిలుస్తుంది.
చైనా– పాక్ సముద్ర వ్యూహానికి కౌంటర్
ఒమాన్‌తో భారత్‌కు ఉన్న చారిత్రక విశ్వాసం + ఆధునిక వ్యూహం, ప్రాంతీయ రాజకీయాల్లో కొత్త పవర్ బ్యాలెన్స్ సృష్టిస్తోంది….. — ఉపద్రష్ట పార్ధసారధి

#PardhaTalks #IndiaOman #Duqm #Geopolitics #IndianNavy #ArabianSea #NationalSecurity #bigsketch

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎన్నికల స్క్వాడ్ వేషాలు… వసూళ్ల దందాలో జర్నలిస్టులు…
  • ఇండియా చేతికి ఒమన్ పోర్ట్ డుఖం… పాకిస్థాన్‌కు కొత్త దుఖం…
  • అల్లుకు అవార్డు… లైవ్ కుదరడం లేదు.., ఆ అవసరానికి ఓ అబద్ధం…
  • ఏ పార్టీ ప్రభుత్వం ఐతేనేం…? పాలకుల్ని నడిపించేది ఆ కంట్రాక్టర్లేనా…!!
  • సౌందర్య మరణానికి ముందురోజు… అనుకోకుండా రికార్డయిన ఓ ఫోన్ కాల్…
  • ‘పాలమూరు పాపం’లో కేసీయార్, హరీష్‌ ఫిక్స్…. రేవంత్‌ ‘సిట్’..!
  • తనికెళ్ల భరణి నోట పదే పదే ‘సామాన్లు’ మాట… బూతు కాదండీ బాబూ…
  • ‘రైడింగ్ ద టైగర్’..! సత్యం రామలింగ రాజు ‘డెస్టినీ’పై పర్‌ఫెక్ట్ చిత్రణ..!!
  • సనాతన స్వర గళాలు…. శివశ్రీ స్కంధప్రసాద్ Vs మైథిలి ఠాకూర్…
  • ఇటు సింధును ఆపినట్టే… అటు గంగనూ ఆపితే… బంగ్లాదేశ్ పని ఖతం…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions