.
ప్యాంట్లు విప్పి చూసి, కాల్చేసిన పహల్‌గాం ఉగ్రవాదికీ బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు యూనస్‌కూ పెద్ద తేడా ఏమీ ఉండదు ఇండియా కోణంలో…
షేక్ హసీనాను దేశం నుంచి తరిమేశాక… ఆ దేశం మతం దృష్టితో పక్కా హిందూ వ్యతిరేక, పక్కా ఇండియా వ్యతిరేక వ్యవహారశైలి కనబరుస్తోంది… యూనస్ ఈమధ్య చైనాకు వెళ్లి కొన్ని వ్యాఖ్యలు చేశాడు…
Ads
ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్ అని చైనాకు గుర్తుచేశాడు… ఇండియా నుంచి ఈశాన్యంలోని సెవెన్ సిస్టర్స్ రాష్ట్రాలకు రవాణాకు కేవలం చిన్న, సన్న, ఇరుకైన ‘చికెన్ నెక్’ మాత్రమే… (సిలిగురి కారిడార్)… అంటే, చైనా, బంగ్లాదేశ్ గనుక తలుచుకుంటే ఈశాన్య రాష్ట్రాలపై గ్రిప్ సంపాదించవచ్చునని ‘వాడి’ వ్యాఖ్యల సారాంశం…
నిజమే… అలా కూస్తుంటేనే కదా, మనకూ మన పనుల ప్రయారిటీలు బోధపడేది… అందుకని వెంటనే అలర్టయిన ఇండియా 166 కిలోమీటర్ల ఓ హైవేకు నిధులను ప్రకటించింది… 22,864 కోట్లు… ఎప్పుడైనా చికెన్ నెక్ మీద మాత్రమే ఆధారపడటం ప్రమాదమే కాబట్టి… ప్రత్యామ్నాయ మార్గం ఒకటి ఆలోచించింది కూడా…
ఇప్పుడు నిధులు ఇచ్చింది షిల్లాంగ్ (మేఘాలయ) నుంచి సిల్చార్ (అస్సోం) వరకు… దీన్ని అలాగే మన సరిహద్దుల్లోని జోరిన్ పుయ్ (మిజోరం) వరకూ విస్తరించాల్సి ఉంది… అక్కడి నుంచి బర్మాలోని సిట్వే వరకు పొడిగించి, అక్కడి నుంచి కోల్‌కత్తాకు సముద్ర మార్గం ద్వారా అనుసంధానించాలి… ఇదీ ప్లాన్…
ఆమధ్య మోడీ బర్మా వెళ్లినప్పుడు ఈ రోడ్డు నిర్మాణానికి బర్మా అంగీకరించింది… కానీ అది ప్రధానంగా రఖైన్ రాష్ట్రంలో నిర్మించాలి… అక్కడ ప్రధానంగా అరకాన్ ఆర్మీది పెత్తనం… దీంతో ఆ రోడ్డు ఇప్పటివరకూ అడుగు కదల్లేదు…
కోల్‌కత్తా నుంచే కాదు, విశాఖ నుంచి కూడా ఈశాన్య రాష్ట్రాలకు బర్మా మీదుగా ప్రతిపాదిస్తున్న ఈ మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్టు గనుక పూర్తయితే ఇండియా చికెన్ నెక్ మీద ఆధారపడే స్థితి తప్పుతుంది… దీన్ని కలాదాన్ ప్రాజెక్టు అంటారు…
నిజానికి ఇది బర్మాకు కూడా ఉపయోగమే… అరకాన్ ఆర్మీ కూడా ఈ రోడ్డు నిర్మాణానికి సహకరిస్తామని గత ఏడాది ప్రకటించింది… ఇప్పుడు యూనస్ దురుద్దేశపు వ్యాఖ్యలతో ఇండియా ఈ ప్రత్యామ్నాయ రవాణా మీద మళ్లీ దృష్టి సారించింది…
షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్నప్పుడు… బంగ్లాదేశ్‌లోని ఓ ప్రాంతం గుండా ప్రత్యామ్నాయ రోడ్డు నిర్మించాలని ప్రతిపాదించారు… కానీ సీన్ రివర్స్ కదా ఇప్పుడు… ఇక ఎప్పుడూ అది మనకు యూజ్‌ఫుల్ కాదు…
మరీ పరిస్థితులు విషమిస్తే చికెన్ నెక్ సమీపంలోని బంగ్లా ప్రాంతాన్ని ఆక్రమించేసి, సెవెన్ సిస్టర్స్‌కు మరో ఎనిమిదో సిస్టర్‌ను జతచేయడమే దిక్కు… (యూనస్ ఇది తెలియనంత మూర్ఖుడేమీ కాదు…) కానీ ఇండియాకు అదంత ఈజీ కూడా కాదు..! పాకిస్థాన్‌లాగే బంగ్లాదేశ్ కూడా చైనాకు ఆప్త దేశం కదా ఇప్పుడు..!!
Share this Article