Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

What a Memorable Match… ఇండియా రికార్డు చేజింగ్ విక్టరీ !!

September 30, 2026 by M S R

.

మెమరబుల్ మ్యాచ్… what a memorable match… ఎన్నడూ మరవలేని మ్యాచ్… నిజానికి ఈ ఆటలో ట్విస్టుల్లేవు, ఉత్కంఠ ఏమీ లేదు… కానీ ఇండియా వీసమెత్తు ఒత్తిడిని ఫీల్ గాకుండా గెలిచిన తీరు, అదీ తన రికార్డ్ చేజింగ్ విక్టరీని అలవోకగా సాధించిన తీరు ఓ విశేషం…

నిజానికి రోహిత్ శర్మకు సెంచరీలు కొత్త కాదు… 39 ఏళ్ల వయస్సులో కూడా ఓ సెంచరీ బాదిన మొదటి ఇండియన్ క్రికెటర్ అయ్యాడు… కెప్టెన్ శుభమన్ గిల్‌కు డబుల్ సెంచరీ కొత్తేమీ కాదు… అసలు విరాట్ కోహ్లీ గురించి వేరే చెప్పనక్కర్లేదు… వద్దంటే పరుగుల వరద… కానీ ఇండియాకు ఎదురైన 400 పైచిలుకు పరుగులను మన బ్యాటర్లు అలవోకగా… గల్లీ క్రికెట్ ఆడినంత ఈజీగా కొట్టిపారేశారు… అదీ గ్రేట్…

Ads

నిజానికి మన బౌలర్లు 400 ప్లస్ పరుగులు ఇచ్చినప్పుడే సగటు ఇండియన్ క్రికెట్ అభిమానికి చిరాకేసింది… ఒక్కరంటే ఒక్కరూ ఇంప్రెసివ్ బౌలింగ్ చూపించలేదు… కానీ గౌహతి పిచ్ అలాంటిదే… వద్దన్నా సరే బాల్ బ్యాటు మీదకే వెళ్తుంది, కమాన్ నన్ను కొట్టు కొట్టు అనుకుంటూ…

ఇక ఇండియన్ బ్యాటర్లు ఊరుకుంటారా..? దొరికిన చాన్స్… వెస్టిండీస్ బౌలింగ్ కూడా వీకే కదా… దంచి కొట్టారు… వెరసి ఇండియాకు వన్డేలకు సంబంధించి రికార్డు ఛేజింగ్ విక్టరీ… విరాట్ కోహ్లీ త్వరగానే ఓ అద్భుతమైన క్యాచ్‌కు ఔటయినా సరే, అప్పటికే రోహిత్, గిల్ వేసిన బ్రహ్మాండమైన పునాదుల కారణంగా ఈజీగానే కొట్టేశారు…

shubhaman

సో, వెస్టిండీస్‌కు ఓ రికార్డు ఓటమి… ఇండియా మీద… ఇండియాకు ఓ రికార్డు ఓటమి, అన్ని జట్ల మీదా కలిపి…! నిజానికి ఎదుట 400 పరుగుల భారీ లక్ష్యం ఉన్నప్పుడు సహజంగానే ఎంతటి తోపు జట్టుకైనా కొంత ఒత్తిడి ఉంటుంది… వేగంగా పరుగులు సాధించే క్రమంలో వికెట్లు పారేసుకునే ప్రమాదమూ ఉంది… దాన్ని రోహిత్, గిల్ జయించారు… అదీ ఇండియా విజయకారణం… 7 ఓవర్లు మిగిలి ఉండగానే…

250 పరుగులకుపైగా భాగస్వామ్యంతో దాదాపు 9, 10 సగటు రన్‌రేటు తగ్గకుండా బలమైన పునాది వేసినప్పుడే ఇండియా విజయం ఖరారైపోయింది… చివరకు అదే నిజమైంది… సగటు ఇండియన్ క్రికెట్ అభిమానికి ఒక మెమరబుల్ (గుర్తుండిపోయే) మ్యాచ్ కనువిందు చేసింది..!! మొత్తం అయిదు సెంచరీలు (గిల్ డబుల్ సెంచరీ, 800 దాటిన పరుగుల వరద… వావ్..!!

గిల్ డబుల్ సెంచరీ జస్ట్ 117 బాల్స్‌లో… వరల్డ్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ… (126 బాల్స్‌తో డబుల్ సెంచరీ రికార్డు ఇషాన్ కిషన్ పేరిట ఉంది)… ప్రస్తుతం వన్డే క్రికెట్ బ్యాటర్లకు సంబంధించి శుభమన్‌ది ICC నంబర్ వన్ ర్యాంకు… అవును, ర్యాంకుకు తగిన ఆట..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • What a Memorable Match… ఇండియా రికార్డు చేజింగ్ విక్టరీ !!
  • ‘కంచ’ దాటిన పైత్యం ! చివరకు సీఎం మనవడి పేరుపైనా వక్రబాష్యాలు !!
  • మీడియా మాయ – కల్కి మహత్యం… రెండింటిదీ సేమ్ ఫార్ములా దందా !!
  • వంద ‘కాదు’లు ఒక ‘అవును’ కంటే ఎక్కువ నేర్పిస్తాయి!
  • సగటు తమిళుడికి తన భాష, సంస్కృతిపై ఓ ‘పిచ్చి ప్రేమ’… అంతే!
  • చలించిన న్యాయమూర్తి… ‘‘ఆ చెడ్డ అంకుల్ ఇక బయటికి రాడు తల్లీ…’’
  • కాళేశ్వరం బ్లండర్స్‌..! నిపుణులకూ రిపేర్ ప్లాన్స్ అంతుబట్టడం లేదు..!!
  • ‘ఏం చేస్తరు? ఉరి తీయరు కదా? – మేడారం నుంచి వాషింగ్టన్ !!
  • వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ‘కల్కి భగవాన్’ కన్నుమూత!
  • దేశంలోకెల్లా నంబర్ వన్ కమెడియన్ చంద్రబాబు!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions