.
డసాల్ట్ ఏవియేషన్ అనే ఫ్రెంచ్ ఎయర్‌స్పేస్ కంపెనీ డెవలప్ చేసిన రాఫెల్ మినహా… మొన్నటి యుద్ధంలో మొత్తం మన సొంత యుద్ధ పరికరాలు, ఉత్పత్తులే… అందుకే ISRO, DRDO, BEL, HAL వంటివి కాపాడుకోవాలి… వాటి శ్రమనూ ఈ సందర్భంగా అభినందించాలి…
బ్రహ్మాస్ కూడా రష్యాతో కలిసి మనం సంయుక్తంగా డెవలప్ చేసిందే… ఒక్క రాఫెల్ స్టెల్త్ సిస్టమ్‌ను మాత్రం చైనా బ్రేక్ చేసిందని విదేశీ మీడియా రాస్తున్నది… నిజాలేమిటో తెలియాలి…
Ads
కానీ మన ఇస్రో డెవలప్ చేసిన నావిక్ జీపీఎస్ అద్బుతమైన తోడ్పాటునిచ్చింది మొన్నటి ఘర్షణల్లో… అందుకే పిన్‌పాయింటుగా కొట్టాయి మన మిసైళ్లు… పాక్‌లోని టార్గెట్లను… మన ఆకాశ్ తీర్ కూడా మొన్నటి ఘర్షణలో ప్రూవ్ చేసుకుంది…
తాజా విశేషం ఏమిటంటే..? ఇండియా ఈరోజు ఒడిశాలోని గోపాల్పూర్ సీవార్డ్ ఫైరింగ్ రేంజ్‌లో ‘భార్గవాస్త్ర’ అనే స్వదేశీ మైక్రో- మిసైల్ కౌంటర్- డ్రోన్ సిస్టమ్‌ను విజయవంతంగా పరీక్షించింది. సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (SDAL) అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ డ్రోన్ స్వార్మ్ దాడులను ఎదుర్కొనేందుకు రూపొందించబడింది…
ప్రతి చిన్న దానికీ ఎస్-400 మిసైళ్లను వాడలేం… ప్రత్యేకించి డ్రోన్లను మధ్యలోనే అటకాయించి, కూల్చేసే ఓ వ్యవస్థ అవసరం మనకు… పైగా ఒకేసారి చాలా మైక్రో మిసైళ్లను ప్రయోగించగలగాలి… తక్కువ ఖర్చులో పని అయిపోవాలి… అదుగో ఆ లక్ష్యాలతో రూపొందిందే ఈ భార్గవాస్త్ర…
మొదట మూడు పరీక్షలు నిర్వహించారు, ఇందులో రెండు పరీక్షల్లో ఒక్కో రాకెట్‌ను, ఒక పరీక్షలో రెండు రాకెట్‌లను 2 సెకన్ల వ్యవధిలో సాల్వో మోడ్‌లో ప్రయోగించారు… అన్ని రాకెట్‌లు ఆశించిన పారామీటర్‌లను సాధించాయి, ఈ సిస్టమ్ యొక్క అధునాతన సాంకేతికతను నిరూపించాయి…
సామర్థ్యాలు: డిటెక్షన్ రేంజ్: 6 నుండి 10 కి.మీ. దూరంలో చిన్న డ్రోన్‌లను గుర్తించగలదు, రాడార్‌తో పాటు ఎలక్ట్రో- ఆప్టికల్/ఇన్‌ఫ్రారెడ్ (EO/IR) సెన్సార్‌లను ఉపయోగిస్తుంది.
సైమల్టేనియస్ లాంచ్: ఒకేసారి 64 కంటే ఎక్కువ మైక్రో- మిసైల్స్‌ను ప్రయోగించగల సామర్థ్యం.
మొబైల్ ప్లాట్‌ఫామ్: వివిధ భూభాగాల్లో, అధిక ఎత్తు ప్రాంతాల్లో (5,000 మీటర్ల వరకు) వేగంగా అమలు చేయడానికి మొబైల్ ప్లాట్‌ఫామ్‌పై అమర్చబడింది.
సాంకేతికత: అధునాతన C4I (కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్, ఇంటెలిజెన్స్) సాంకేతికతతో కూడిన కమాండ్-అండ్-కంట్రోల్ సెంటర్‌ను కలిగి ఉంది.
ప్రాముఖ్యత: స్వల్ప-ఖర్చుతో కూడిన డ్రోన్‌లు, ముఖ్యంగా స్వార్మ్ రూపంలో, ఆధునిక యుద్ధంలో సవాలుగా మారుతున్న నేపథ్యంలో, భార్గవాస్త్ర అనేది ఖరీదైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లకు ఆర్థిక ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.
ఇది భారత సైన్యం, వైమానిక దళం రెండింటికీ అనుకూలంగా ఉంటుంది మరియు ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తుంది.
ఈ వ్యవస్థ ప్రపంచంలోని కొన్ని అధునాతన దేశాలు మాత్రమే అభివృద్ధి చేస్తున్న స్వార్మ్ న్యూట్రలైజేషన్ సామర్థ్యంతో సమానమైనది, భారతదేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది.
ఈ సిస్టమ్ ఇంకా సమగ్ర పరీక్షలను ఎదుర్కోనుంది, దీని తర్వాత భారత సైన్యంలో చేర్చే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
ఈ విజయవంతమైన పరీక్షలు భారతదేశ రక్షణ సాంకేతికతలో మైలురాయిగా నిలుస్తాయి, భవిష్యత్తులో అంతర్జాతీయ ఎగుమతి అవకాశాలను కూడా సృష్టించవచ్చు.
Share this Article