పార్ధసారధి పోట్లూరి ………. భారత్ మొదటిసారిగా బర్మా కి వార్నింగ్ ఇచ్చింది !
ఇది చాలా ఆశ్చర్యం కలిగించే అంశమే !
ఎందుకంటే మొదటి నుండి పక్కనే ఉన్న బర్మా లేదా మియాన్మార్ దేశ అంతర్గత విషయాలలో భారత్ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు ! అక్కడ తరుచూ మిలటరీ జుంటా ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి సైనిక పాలనని చేపట్టి తన ప్రజలని హింస పెడుతున్నా మన దేశం చూస్తూ ఊరుకుంది తప్పితే ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు !
Ads
చివరకి మిలటరీ పాలన వల్ల బర్మా ప్రజలు సరిహద్దులు దాటి మన దేశంలోకి వస్తున్నా చూసి చూడనట్లుగా వ్యవహరించింది తప్పితే ఎప్పుడూ అక్కడి మిలటరీ ప్రభుత్వాన్ని ఇదేంటని ప్రశ్నించలేదు !
కానీ గత వారం రోజుల కిందట మాత్రం భారత్ తీవ్రంగా హెచ్చరించింది బర్మాని పాలిస్తున్న సైనిక ప్రభుత్వాన్ని !
కోకో దీవులు – Coco Islands !
కోకో దీవులు అనేవి యాంగూన్ [రంగూన్-బర్మా] రీజియన్ కి చెందినవి. రంగూన్ నుండి 414 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో ఉన్నాయి. ఇవి మొత్తం 5 దీవులు కాగా వీటిలో 4 పెద్దవి ఒకటి చిన్న దీవి ఉన్నది.
1882 లో కోకో దీవులు బ్రిటీష్ బర్మా కింద ఉండేవి. 1937 లో బర్మా భారత దేశం నుండి విడగొట్ట బడింది బ్రిటీష్ వాళ్ళ చేత. ఆ సమయంలో కోకో దీవులు స్వతంత్రంగా వ్యవహరించాయ. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అంటే 1942 లో జపాన్ సైన్యం కోకో దీవులని తన అధీనంలోకి తీసుకుంది. 1948 లో బర్మా కి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కోకో దీవులు బర్మా పాలనకిందకి వెళ్లిపోయాయి?
కాదు కానుకగా ఇవ్వబడ్డాయి భారత్ చేత లేదా నెహ్రూ చేత !
అప్పట్లో బ్రిటీష్ సైన్యానికి వ్యతిరేకంగా సుభాష్ చంద్ర బోస్ జపాన్ తరుపున బర్మా లో యుద్ధం చేశాడు. కోకో దీవులు జపాన్ వశం అయిపోయాయి. మరో వైపు బర్మాలో తీవ్రంగా యుద్ధం జరుగుతున్న వేళ సుభాష్ చంద్ర బోస్ నేతృత్వంలో ఆజాద్ హింద్ ఫౌజ్ వీరోచితంగా బ్రిటీష్ సైన్యాన్ని ఎదుర్కొంది జపాన్ సైన్యంతో కలిసి !
రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక జపాన్ తన అధీనంలో ఉన్న అండమాన్ నికోబార్ దీవులతో పాటు కోకో దీవులని కూడా భారత్ దేశానికి అప్పచెప్పింది.
1947 లో మన దేశానకి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కూడా కోకో దీవులు మన దేశ ఆధీనంలోనే ఉన్నాయి. 1948 లో బర్మా కి స్వాంతంత్ర్యం వచ్చినప్పుడు కోకో దీవులని బర్మా కి కానుకగా ఇచ్చేశాడు నెహ్రూ !
1947 నుండి 1955 వరకు చాలా దేశాలు స్వాతంత్ర్యం పొందినా అంతకు ముందు తమ దేశంలో భాగంగా ఉన్న చిన్న చిన్న ప్రదేశాలని తిరిగి తమ తమ దేశాలలో కలుపుకోవడం కోసం చాల కష్టపడ్డారు వివిధ దేశాధినేతలు కానీ నెహ్రూ మాత్రం కేవలం తెల్ల ప్రభువుల మెప్పు కోసం మన దేశ అధీనంలో ఉన్న వాటిని ఇతర దేశాలకి కానుకగా ఇవ్వడమో లేదా చూసి చూడనట్లుగా ఉండడమో చేశాడు. కోకో ఐలాండ్స్ అనేవి బ్రిటీష్ క్రౌన్ ప్రిన్స్లీ స్టేట్ గా ఉండేవి జపాన్ ఆక్రమణలోకి వెళ్లకముందు వరకు. జపాన్ మన దేశానికి అప్పచెప్పినప్పుడు మనమే ఉంచేసుకోవాల్సింది !
ముందు చూపు అనేది లేకుండా నెహ్రూ చేసిన తప్పిదం వలన ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాము మనం ! కోకో దీవులు వ్యూహాత్మకంగా కీలకమయిన ప్రదేశంలో ఉన్నాయి. ఎదురుగా అండమాన్ నికోబార్ దీవులు ఉండడం వలన కోకో దీవుల నుండి నిఘా వేయవచ్చు ! మరో వైపు హిందూ మహా సముద్రం ద్వారా జరిగే రవాణా మొత్తం ‘మలక్కా జల సంధి ద్వారా జరుగుతుంది. ఒక వేళ చైనాతో యుద్ధం కనుక వస్తే కోకో దీవుల నుండి భారత్ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదీ పసిగట్టవచ్చు తద్వారా ‘మలక్కా జలసంధి ‘ మీద మన దేశానికి ఉన్న పట్టుని కోల్పోవాల్సి వస్తుంది.
1994 లో బర్మా కోకో ఐలాండ్స్ లలో రెండు దీవులని దీర్ఘకాల ఒప్పందం కింద చైనాకి లీజుకి ఇచ్చింది ! 1994 నుండి చైనా మెల్లగా తన సైనిక స్థావరాలని అభివృద్ధి చేసుకుంటూ పోయింది !1994 లో అప్పటి భారత ప్రధాని పీవీ నరసింహారావు గారు బర్మా కి తీవ్ర నిరసన తెలిపారు కోకో దీవులని చైనాకి లీజుకి ఇవ్వడం మీద ! కానీ బర్మా మన నిరసనలని లెక్క చేయలేదు ! నిజానికి కోకో దీవులని సమర్ధవంతంగా ఉపయోగించుకోవడం బర్మా వల్ల కాలేదు, అలాంటప్పుడు పోతే పోయింది అనుకోని డబ్బు పడేసి మనమే లీజుకి తీసుకొని ఉంటే ఈ రోజు ఇంతలా బాధ పడాల్సివచ్చేది కాదు కానీ ఆ పని చేయలేదు ఏ ప్రభుత్వం కూడా 1994 వరకు!
ప్రస్తుతం తైవాన్ మీద ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న వేళ చైనా తన రక్షణకోసం అంటూ కోకో దీవులలో అత్యాధునిక సర్వైలెన్స్ రాడార్ ని నెలకొల్పింది ! ఈ రాడార్ అండమాన్ నికోబార్ దీవుల దగ్గర భారత నౌకా దళ కదలికలని పసిగట్ట గలదు.
చైనా తైవాన్ మీద దాడి చేసే సమయంలో భారత్ కనుక మలక్కా జలసంధిని బ్లాక్ చేయడానికి ప్రయత్నించ వచ్చు అనే భయంతో ముందు జాగ్రత్త చర్యగా కోకో దీవులలో సర్వైలెన్స్ రాడార్ వ్యవస్థని నెలకొల్పింది !
దీనిమీదనే భారత్ ఈ సారి గట్టి హెచ్చరిక చేసింది బర్మాలోని సైనిక ప్రభుత్వానికి !
గట్టిగా రెండు రోజులు చాలు మన దేశానికి బర్మా లోని సైనిక ప్రభుత్వాన్ని గద్దె దింపి అక్కడ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి! ఈ పని రెండేళ్ల క్రితమే చేసి ఉండాల్సింది ! ఒకవేళ భారత్ కనుక బర్మా మీద దాడి చేస్తే దానికి ప్రపంచ దేశాల మద్దతు కూడా ఉండేది !
ఇప్పటికీ అయినా మించిపోయింది లేదు ! బర్మా ని కాకపోయినా కనీసం కోకో దీవులని స్వాధీనం చేసుకుంటే చాలు చైనా కి చెక్ పెట్టినట్లు అవుతుంది !
చైనా మెల్లగా ఒక్కో హాట్ స్పాట్ ని ఏర్పాటు చేసుకుంటూ పోతున్నది: మొదట డోక్లామ్ ,తరువాత లడక్, ఇప్పుడు అరుణాచల ప్రదేశ్ మరియు కోకో దీవులని హాట్ స్పాట్లు గా మార్చేసింది !
ముందు కోకో దీవులని స్వాధీనంలో తీసుకుంటే చాలు మలక్కా జలసంధి మీద గట్టి పట్టు దొరుకుతుంది !
కానీ న్యూ ఢిల్లీ ఆ పని చేయగలుగుతుందా ?
Share this Article