.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రూపొందించిన టాప్ 100 ఇండియన్ ప్రభావశీలుర జాబితాలో 28వ ర్యాంకులో కనిపించాడు… గత ఏడాది తన ర్యాంకు 39… సో, ర్యాంకు మెరుగుపరుచుకున్నాడన్నమాట…
వోకే గుడ్… ఈ మీడియా సంస్థ ఈ ర్యాంకులకు ఎంచుకున్న ప్రాతిపదికల మాటెలా ఉన్నా… అధికారంలో ఉన్న వాళ్లనే ప్రభావశీలురుగా గుర్తిస్తున్నాయి ఆ ప్రామాణికాలు… రేవంత్ రెడ్డి, 89వ ర్యాంకులోని ఒవైసీ మినహా తెలంగాణలో ఏ లీడర్ కూడా ఈ జాబితాలో లేడు… నేనెందుకు ప్రధానిని కాకూడదు అని ఓ జాతీయ పార్టీని లీడ్ చేస్తున్న కేసీయార్ సహా…
Ads
గత ఏడాది జాబితాలో చంద్రబాబు లేడు… ఈసారి 14వ ప్లేసు… ఒమర్ అబ్దుల్లా గత ఏడాది జాబితాలో లేడు, ఇప్పుడు సీఎం కదా… 46వ ర్యాంకు… అఫ్‌కోర్స్, మోడీ ప్రభుత్వం ఈయన ప్లస్ నితిశ్ మీద ఆధారపడినందుకా శక్తిమంతమైన జాబితాలోకి చేరింది..? నితిశ్ ర్యాంకు 24 నుంచి 21కు పెరిగింది… అరవింద్ కేజ్రీవాల్ ర్యాంకు అధికారం పోగానే 18 నుంచి 52కు చేరింది…
రేఖా గుప్తా లాస్ట్ ఇయర్ ఏమీ లేదు,.. ఢిల్లీ సీఎం కదా ఇప్పుడు… ఈ జాబితాలో 65వ ర్యాంకుకు వచ్చేసింది ఒకేసారి… ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు గతంలో ఏ ర్యాంకూ లేదు… ఇప్పుడు 73వ ర్యాంకు… దాదాపు ప్రతి సీఎం ఉన్నాడు ఈ జాబితాలో..! చాలామంది కేంద్ర మంత్రులు… బీజేపీ నడ్డా, సంతోష్ కూడా ఉన్నారు…
క్రికెటర్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతోపాటు బుమ్రా పేరుంది… అధికారంలో లేకపోయినా సరే బీహార్ తేజస్వి యాదవ్ 86వ ర్యాంకులో, యూపీ అఖిలేష్ యాదవ్ 87వ ర్యాంకులో, శరద్ పవార్ 77వ ర్యాంకులో ఉన్నాడు… ఏపీ, తెలంగాణలకు సంబంధించి ఇంకెవరూ నాయకులు లేరు… అంటే ప్రస్తుతం ప్రభావశీలురు కారు అని..!
సహజంగానే మోడీ, అమిత్ షా టాప్ టు… తరువాత జైశంకర్, మోహన్ భగవత్, యోగి, అశ్విని వైష్ణవ్ తదితరులు కనిపిస్తున్నారు… మరీ ఆర్థిక మంత్రికి 5వ ర్యాంకు ఆశ్చర్యమే… రాహుల్ గాంధీ 9వ ర్యాంకు… ఖర్గే 33వ ర్యాంకు… ప్రియాంక వాద్రా 81వ ర్యాంకు… అజిత్ ధోవల్ 35వ ర్యాంకు…
గత ఏడాది జాబితాలో లేడు చెస్ విశ్వనాథన్ ఆనంద్, ఈసారి 36వ ప్లేసులో ఉన్నాడు… సుప్రీం చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదీ, ఇస్రో చైర్మన్ నారాయణన్ , ఐసీసీ చైర్మన్ జైషా,
పారిశ్రామికవేత్తలు అంబానీ, ఆదానీ, టాటా చంద్రశేఖరన్, కుమారమంగళం బిర్లా, నావెల్ టాటా, నీతా అంబానీ, బ్యాంకర్ ఉదయ్ కొటక్, జొమాటో బాస్ దీపేందర్, బజాజ్ ఆటో రాజీవ్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సునీల్ భారతి మిట్టల్, కేబినెట్ సెక్రెటరీ సోమనాథన్, సెబి చైర్మన్ పాండే తదితరులున్నా జాబితాలో…
సినిమా వాళ్లలో విజయ్ (రీసెంటుగా కొత్త పార్టీ పెట్టాడు కదా) కాస్త బెటర్ ర్యాంకు కాగా… తెలుగు నుంచి అల్లు అర్జున్ ఒక్కడే… మిగతా పాన్ ఇండియా స్టార్లు, తోపులు, తురుములు కూడా ఎవరూ లేరు… అమితాబ్, ఆలియాభట్, కరణ్ జోహర్, షారూక్ ఖాన్ బాలీవుడ్ నుంచే… ఎస్, నేషనల్ క్రష్ రష్మిక లేదు… ఇదీ జాబితా లింక్…
https://data.indianexpress.com/projects/2025/ie-100
Share this Article