ఈసారి తెలుగు ఇండియన్ ఐడల్ షో కోసం ఏక్‌సేఏక్ కంటెస్టెంట్లను ఎంపిక చేశారు అనేది నిజం… మంచి మెరిట్ ఉన్న గాయకులు వాళ్లు… పాటల ఎంపిక దరిద్రంగా ఉన్నా సరే, వాళ్లు వీనులవిందుగా ఆలపించగలిగారు… వీరిలో చాలామంది గతంలో పాడతా తీయగా, ఇతర టీవీ మ్యూజిక్ షోలలో పార్టిసిపేట్ చేసినవాళ్లే… మరీ కొత్త మొహాలేమీ కాదు…
కాస్తోకూస్తో శాస్త్రీయ సంగీతం చిన్నప్పటి నుంచీ అభ్యసిస్తున్నవాళ్లే… కానీ ఏదో తేడా కొట్టింది… కొడుతోంది… వద్దూ వద్దని తరిమేసిన ఓ అమెరికన్ కంటెస్టెంట్‌ను ఎవరి ఒత్తిడితోనే రాజీపడి, తలవంచి థమన్ ఆమెను మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలా యాక్సెప్ట్ చేశాడు, తను వద్దన్న పనిని తనతో చేయించారనే కసి, కోపం ఉన్నట్టున్నాయి… అసలే ఇగోయిస్ట్ కదా… సరిగ్గా రెండువారాల్లో ఎలిమినేట్ చేశాడు… అవును, తను ఏది అనుకుంటే అదే ఆ షోలో…
వోట్లే డిసైడ్ చేస్తాయనేది అబ్సర్డ్, హంబగ్… సేమ్ బిగ్‌బాస్ ఎలా స్క్రిప్టెడో, ఇదీ అంతే… జనం కళ్లకు గంతలు కట్టి ఎడ్డోళ్లను చేయడమే… అది ఆహా అయినా అంతే, ఓహో అయినా అంతే… ప్రత్యేకించి భరత్ రాజ్ అనే కంటెస్టెంట్ బ్రహ్మాండంగా పర్‌ఫామ్ చేస్తున్నాడు మొదటి నుంచీ టాప్ త్రీలో ఉంటాడని ఎక్స్‌పెక్ట్ చేస్తే మొన్నటివారం నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించేశారు… ఎందుకు..? తను నజీరుద్దీన్‌కు పోటీ ఉండకూడదు గనుక… నజీరుద్దీన్ పేరు పక్కన రైట్ టిక్ కొట్టేసుకున్నారు గనుక…
Ads
ఇదే నజీరుద్దీన్ ప్లస్ భరత్‌రాజ్‌తో పవన్ కల్యాణ్ రాబోయే సినిమా ఓజి కోసం ఓ పాట పాడించాడు ఇదే థమన్… మరి అంతటి ప్రతిభావంతుడు హఠాత్తుగా ఎందుకు ఎలిమినేట్ అయినట్టు థమన్..? నజిరుద్దీన్‌ను స్వయంగా తీసుకొచ్చింది సింగర్ సాకేత్, ఆయన ఎవరు సినిమా పాటలు పాడటంలో శిక్షణ ఇచ్చే రామాచారి కొడుకు… ఆయన దగ్గర ఇదే జడ్జి గీతా మాధురి శిక్షణ పొందింది… ఎలాగూ థమన్ గుడ్ లుక్స్‌లో ఉన్నాడు… అర్థమైంది కదా… ఎవరు విజేతగా నిలుస్తారో… నిలిచారో… (తను సెమి ఫైనల్స్ లో పాడుతుంటేనే అసాధారణంగా ఆరేడు సార్లు చిచ్చుబుడ్లు కాల్చారు… తనే విజేత అని చెప్పకనే చెప్పారు… ఖేల్ ఖతం…)
ఈమాత్రం దానికి ఈ వోటింగు ప్రహసనం దేనికో అర్థం కాదు, శ్రోతలను పిచ్చోళ్లను చేయడమే కదా… సేమ్, బిగ్‌బాస్ కూడా అంతే… ఎవరిని పైకి లేపాలో వాళ్లను లేపుతారు, మిగతావాళ్లను టాస్కుల్లో, ఆడియెన్స్‌కు చూపించే ఫీడ్‌లో తొక్కేస్తారు… మొన్న చూశాం కదా… జరిగింది వేరు, ఆకుల సోనియాకు, నిఖిల్‌కు నడుమ ఏదో ట్రాక్ నడుస్తున్నట్టు ప్రోమోలతో కంపు చేశారు… తీరా చూస్తే జరిగింది డిఫరెంట్… వోట్లు లేవు, మన్నూ లేదు… విష్ణుప్రియను ఫోకస్ చేస్తున్నారు… బయట సైట్లు, ఆమె సోషల్ మీడియా కూడా రెచ్చిపోయి సోనియా మీద విషం గుమ్మరిస్తోంది… గత సీజన్‌లో శోభాశెట్టి, అమర్‌దీప్, ప్రియాంకలపై నెగెటివ్ ప్రాపగాండా చేసినట్టే…
తీరా చూస్తూ, ఆ పల్లవి ప్రశాంత్ ఇప్పటివరకూ బిగ్‌బాస్ విజేతలుగా నిలిచినవాళ్లలో అధముడిగా తేలాడు… సేమ్, తెలుగు ఇండియన్ ఐడల్ షో కూడా, అలాగే తయారైంది… ఎవరైనా దీన్ని చూస్తున్నారంటే… కార్తీక్ పిచ్చి ప్రాసలు కాదు, శ్రీరామచంద్ర బహురూపి వేషాలకు కాదు… జస్ట్, ఆ ఆర్కెస్ట్రా కోసం… వాళ్లకు చప్పట్లు కొట్టొచ్చు… అంతే, షో చూడాలనిపించలేదు మొదటిసారి..!!
Share this Article