ఏమో… నిజమెంతో మరి… ఆశ్చర్యమేసింది… ఆహా ఓటీటీ అమ్మకానికి పెట్టారని తెలుసు, అది వర్కవుట్ కావడం లేదనీ తెలుసు… దాదాపు 1000 కోట్ల లాస్ అని చెబుతున్నారట… అదీ ఆశ్చర్యం… నిజంగా అంత పెట్టారా అని..!
బట్, ఏమాటకామాట… ఇతర కంటెంట్ విషయమేమో గానీ… రియాలిటీ షోలకు సంబంధించి మాత్రం క్రియేటివిటీ, ఖర్చు, ఎఫర్ట్ విషయాల్లో రాజీపడటం లేదు… ఇతర టీవీ చానెళ్లు కొన్ని జానర్ కార్యక్రమాల్లో వెలవెలబోతున్నాయి… నిజం… ప్రత్యేకించి మొన్నమొన్నటిదాకా వచ్చిన కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్, బాలయ్య హోస్ట్ చేసిన అన్‌స్టాపబుల్, ఇండియన్ ఐడల్ తెలుగు, తాజాగా సుధీర్ సర్కార్ సీజన్ ఎట్సెట్రా షోలు…
అంత ఖర్చుకు సరిపడా రెవిన్యూ వస్తుందా లేదా తెలియదు గానీ… ఇండియన్ ఐడల్ తెలుగు మాత్రం గుడ్ ఎఫర్ట్… ఒక్క సీజన్‌కు 35 కోట్ల ఖర్చు అంటున్నారు… ఆ క్వాలిటీ కనిపిస్తోంది కూడా… తిక్క జడ్జిమెంట్లు అప్పుడప్పుడూ చెప్పే గీతామాధురి ఎంపిక మినహా… థమన్, కార్తీక్ ఎంపిక గుడ్…
Ads
వాళ్లు స్వతహాగా కంపోజర్లు, గాయకులు.., థమన్ స్వయంగా డ్రమ్మర్… సో, గాయకుల ప్రతిభను సరిగ్గా అంచనా వేయగలరు, సరిదిద్దగలరు, సలహాలు ఇవ్వగలరు… అవసరమైతే అవకాశాలూ ఇవ్వగలరు… హేమచంద్రను మార్చేసి మళ్లీ మూడో సీజన్‌కు శ్రీరామచంద్రను హోస్ట్‌గా తీసుకొచ్చారు, గుడ్… తనూ స్వయంగా ప్రతిభ ఉన్న గాయకుడు… సో, సింగర్లే జడ్జిలుగా, హోస్టుగా ఉండటం ఓ ప్లస్ పాయింట్…
మరీ టీవీ యాంకర్లను, హైపిచ్ మోతలను నెత్తి మీద రుద్దకపోవడం ఓ రిలీఫ్… ఈసారి 37 దేశాలకు చెందిన 15 వేల మంది ఆడిషన్లలో పాల్గొన్నారనే సంఖ్య అబ్బురాన్ని కలిగించింది… నిజమెంతో మళ్లీ సందేహం… నిజమే అయితే అబ్బురమే… నిజంగానే గాయకుల ఎంపిక బాగుంటుంది… తొలి సీజన్‌లో నెల్లూరు వాగ్దేవి, చెన్నై వైష్ణవి అదరగొట్టగా… మలి సీజన్‌లో విశాఖ సౌజన్య, జయరాం, న్యూజెర్సీ శృతి నండూరి, సిద్దిపేట లాస్య తదితరులు మరిన్ని కొత్త రాగాలు అద్దారు…
తాజా ప్రోమోలో గాయకుల్ని కొందరిని పరిచయం చేశారు, సరే, దాన్ని బట్టి గాయకుల ఎంపికను జడ్జి చేయలేం… షోలో విశేషం ఏమిటంటే, ప్రతి సీజన్‌లోనూ విశేష అతిథులుగా స్వరముఖ్యులను తీసుకొస్తున్నారు… లేదా గీతరచయితలను…! ఈసారి కూడా ప్రొఫార్మా మారదు, అదే ఫార్మాట్… కాకపోతే కొత్త గొంతులు…
చిరాకెత్తించేది ఏమిటంటే… ఆహా తన ప్రకటనల్లోనేమో ఒక మొబైల్ డివైజ్‌కు మూడు నెలల కాలానికి జస్ట్, బాటా చెప్పుల ధరలాగా 99 కట్టండి చాలు అని ఊదరగొడతారు… సరే, అని క్లిక్ చేస్తే 149 రూపాయలు కట్టాలని చూపిస్తుంది… కాస్త జుత్తు పీక్కుని అటూఇటూ చూస్తే, కొత్త చందాదారులకు మాత్రమే ఆ 50 తగ్గింపు అట… మరలాంటప్పుడు 99 అనే ప్రకటనలు దేనికి..? రీచార్జి, రీసబ్‌స్క్రయిబర్లకు ఆ తగ్గింపు లేనప్పుడు..!!
ఎస్, ముచ్చట పెద్దగా ఫలానా షో చూడబుల్ అని రికమెండ్ చేయదు… కానీ ఇతర టీవీ చానెళ్లలో వచ్చే మ్యూజికల్ షోలు అనబడే జస్ట్, ఎంటర్‌టెయిన్‌మెంట్, ఫన్నీ షోలతో పోలిస్తే ఆహాలో వచ్చే ఇండియన్ ఐడల్ షో చాలా చాలా బెటర్… అఫ్‌కోర్స్, మన రీచ్‌ను బట్టి హిందీ ఇండియన్ ఐడల్ రేంజుకు ఉండకపోవచ్చు… కానీ ఉన్నంతలో ఎంజాయబుల్..!!
Share this Article