అస్సోం సీఎం హిమంత విశ్వశర్మను ఈ విషయంలో మెచ్చుకోవాలి… నిజానికి యూపీ సీఎం యోగీ చేయాల్సిన పని ఇది… తన బుర్రలోకి ఈ ఆలోచన ఎందుకు రావడం లేదో తెలియదు… అస్సోంలో 4 లక్షల పెండింగ్ కేసులున్నయ్… జైళ్లు నిండిపోయినయ్… ఇంకా కేసులు పెరుగుతూనే ఉన్నయ్… తీసుకొచ్చి జైళ్లలో కుక్కుతున్నారు… నేరాలు పెరిగిపోతున్నాయనేది కాదు ఇక్కడ ఇష్యూ… చిన్నాచితకా కేసుల్లో కూడా వేలాది మందిని జైళ్లలోకి తోసేస్తున్నారు… తద్వారా…
జైళ్లపై భారం, కిటకిట, అనారోగ్యాలు, వాళ్లను ప్రజల సొమ్ముతో మేపడం, కోర్టులపై పని ఒత్తిడి, ముఖ్యమైన కేసులకు దొరకని టైం, విచారణ ఖైదీల హక్కుల భగ్నం, బెయిళ్ల కోసం ఖర్చులు, ప్రయాస… చిన్న చిన్న శిక్షలు, జరిమానాలతో సరిపోయే లక్ష పెట్టీ కేసుల్ని పూర్తిగా విత్‌డ్రా చేసుకుంటున్నట్టు అస్సోం సీఎం ప్రకటించాడు… సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి అందులో… సుప్రీం చెప్పినా సరే, ఐటీ యాక్ట్ 61 సెక్షన్ ఇంకా పెట్టేస్తూనే ఉన్నారు… మరి దిగువ కోర్టులు ఆ కేసుల్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నట్టు..?
ఎలాగూ మన కేంద్ర ప్రభుత్వానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల జోలికి వెళ్లే దమ్ము లేదు, వాటి నియంత్రణ చేతకాదు… ఈ విషయంలో చైనా ధోరణి పర్‌ఫెక్ట్… అభ్యంతరకర పోస్టుల్ని నియంత్రిస్తున్నాం అంటాయి తప్ప ఏవి అభ్యంతరకరమో తేల్చే యంత్రాంగం వాటికి ఎక్కడ ఉంది..? పలు భాషల్లో పోస్టులు పెట్టేస్తుంటే, అవి చెలామణీలో ఉండొచ్చా లేదా తేల్చేందుకు ఆయా భాషలు తెలిసిన ఉద్యోగులు వాటికి ఉన్నారా అసలు..? ఎంతసేపూ ఆల్గరిథమ్స్ మీద ఆధారపడిన పాలసీలు… అవి దేశంలో శాంతిభద్రతలకు విఘాతంగా మారుతున్నా సరే, వాటి జోలికి వెళ్లలేదు మోడీ ప్రభుత్వం… ఇదొకరకం దాస్యం…
Ads
చిన్న చిన్న కేసుల్లో సుదీర్ఘకాలం జైళ్లలో విచారణకు నోచుకోకుండా ఉండాల్సి రావడం జాతి దౌర్భాగ్యం… అస్సోంలో 73 శాతం విచారణ ఖైదీలే జైళ్లలో మగ్గుతున్నారు… అదీ అసలు ప్రాబ్లం… చిన్న చిన్న కేసుల్లో జైళ్ల దాకా ఎందుకు రావాలి..? స్టేషన్ బెయిళ్లు ఎందుకు ఇవ్వకూడదు..? అక్కడే కేసు డిస్పోజ్ చేసేలా మార్పులు ఎందుకు అవసరం లేదు..? ఉదాహరణకు, ఎవడో ఎవడినో తిట్టాడు, దానికి ట్రాఫిక్ వయొలేషన్‌లోలాగే ఏదో జరిమానా వేసి, ఎందుకు కింది స్థాయిలోనే పరిష్కారం చూపించకూడదు..?
స్వల్ప శిక్షలు పడే అవకాశమున్న కేసులకు సంబంధించి, ఆ విచారణ ఖైదీలను కూడా వదిలేస్తామని అంటున్నాడు అస్సోం సీఎం… ఉగ్రవాదులు, తీవ్ర నేరాలకు పాల్పడినవాళ్లు, సీరియల్ కిల్లర్లు, రేపిస్టులు, ఉన్మాద నేరస్థులను పక్కన పెట్టి… మిగతా కేసుల్లో ఖైదీలను అమాంతం జైళ్ల నుంచి బయటికి పంపించినా సరే సొసైటీపై శాంతిభద్రతలు, నేరాల సంఖ్య కోణంలో పడే దుష్ప్రభావం తక్కువే… ఎందుకంటే డబ్బున్నవాళ్లు జైళ్ల బయట ఉంటున్నారు, లేనివాళ్లు జైళ్లలో ఉంటున్నారు… అమలులో ఉన్న మన జైళ్ల చట్టమే 1894 కాలం నాటిది… ఇన్నేళ్లయినా మనం మార్చుకోలేదు, మార్చుకోం, అదసలు మన పాలన ప్రయారిటీల్లో ఉంటే కదా…
నేరాలు పెరుగుతున్నాయనేది కాదు, దానికి రూట్ కాజ్ ఏమిటో తెలియాలి… అక్కడ మందు అవసరం… జైళ్లపై ఒత్తిడి అనేది ఇష్యూ కాదు… ఎందుకలా వాటిల్లో కుక్కుతున్నామో కారణాలు కావాలి… అక్కడ చికిత్స అవసరం… న్యాయపరిజ్ఞానం ఉన్నవాళ్లు మాట్లాడరు… సోకాల్డ్ మేధావులు ఈ ఇష్యూస్ చర్చించరు… టీవీ చానెళ్లలో పెట్టీ అంశాలపై డిబేట్లు తప్ప…! సంస్కరణలపై ఎవరికీ శ్రద్ధ లేదు… ఏ సీఎంకూ సోయి లేదు… దిక్కుమాలిన ప్రజాకర్షక పథకాలకు డబ్బులు తగలేయడం తప్ప, విపరీతంగా సంపాదించడం, తెల్లారిలేస్తే నెత్తిమాశిన రాజకీయాలు తప్ప… నిజమైన పాలన ఏం తెలుసని…!! (ఇది ఓ సగటు మనిషి అవగాహన, అభిప్రాయం… ఆందోళన… అసలు సబ్జెక్టును చూస్తున్న కోణమే తప్పు కావచ్చుగాక… కానీ సమస్య ఉనికి నిజం… దానిపై మన వ్యవస్థల నిర్లక్ష్యం నిజం…)
Share this Article