హరి క్రిష్ణ ఎం. బి… డాలర్ తో పోల్చుకుంటే మిగతా దేశాల కరెన్సీ విలువ కరోనా తర్వాత చాలా ఫాస్ట్ గా తగ్గిపోతోంది. అమెరికా డాలర్ తోనే అంతా ముడిపడి ఉంది. ఎందుకో అందరికీ తెలుసు.. అంతర్జాతీయ వ్యాపారం అంతా డాలర్ తోనే. మెయిన్ గా ఆయిల్ ఆ కరెన్సీలోనే. వేరే ఏ కరెన్సీలో కూడా చెయ్యడానికి అమెరికా ఒప్పుకోదు… ఇండైరెక్ట్ గా (డైరెక్ట్ గానే అనొచ్చు) ప్రపంచాన్ని ఇప్పటికీ శాసించేది అమెరికానే.. చైనా అనుకుంటారు కానీ ఇప్పటికైతే కాదు…
ఇండియా పరిస్థితి అంత దారుణంగా లేదు… మరీ బాధపడాల్సిన అవసరం లేదు.. ఇన్ఫ్రా మీద శ్రద్ధ, ఖర్చు పెడితే ఉత్పత్తి ఖర్చులు తగ్గి ఎగుమతులు పెంచుకోవచ్చు. Human Development Index (HDI) లో ఎలాగూ మన దేశం చాలా దారుణం.. అది ఇప్పట్లో బాగుపడే సూచనలు లేవు… GDP పెంచుకుంటే ఎప్పటికైనా HDI పెంచుకోవచ్చు…
Ads
Share this Article