.
ఎప్పుడూ వినేదే… ఓటమి ఒంటరిది… గెలుపు అందరిదీ… రెండు పుష్కరాల పాటు వుమెన్ క్రికెట్ వరల్డ్ కప్ తమ చేతుల్లోనే ఉంచుకుని, ఓటమి ఎరుగని ఆస్ట్రేలియా జట్టు, మన చేతుల్లో సెమీ ఫైనల్ ఓడిపోయినప్పుడు… ఆ జట్టులోని ప్రతి సభ్యురాలు కన్నీళ్లు పెట్టుకుంది…
బేలగా ఓ పక్కన నిలబడి కళ్లు తుడుచుకున్న దృశ్యం నిజంగా కాస్త కలిచివేసేదే… మన గెలుపు సంబురాల్లోనూ..! ఆట అన్నాక ఎవరో ఓడతారు, ఎవరో గెలుస్తారనేది నిజమే… కానీ ఆస్ట్రేలియా జట్టు పక్కా ప్రొఫషనల్, భీకరమైన ఫైటింగ్ స్పిరిట్…
Ads
బట్, ఆ రోజు వాళ్లది కాదు… సేమ్, ఫైనల్స్‌లో కూడా..! దక్షిణాఫ్రికా ఓడిపోగానే ప్రతి జట్టు సభ్యురాలి మొహంలో తీవ్ర నిరాశ, కన్నీళ్ల పర్యంతం… కారణం ఏమిటంటే..? వాళ్లకూ ఎప్పుడూ ఈ కప్పు దక్కలేదు… సేమ్, మనలాగే…
ఈ ఫైనల్‌లో గెలిచి కప్పు పట్టుకోవాలని ఆశపడ్డారు… దానికి తగినట్టు పోరాడారు… ఫైనల్ దాకా రావడం అంటేనే, మెరుగైన మెరిట్ చూపించినట్టే కదా… కానీ చివరలో… దక్షిణాఫ్రికా మగ జెంట్స్ జట్టులాగే గెలుపు ముందు బోర్లాపడింది వుమెన్స్ జట్టు కూడా…
40 ఏళ్ల కల తీరిన ఆ క్షణాన ఇండియన్ క్రిెకెటర్లు ఆనందంలో గెంతులు వేస్తూనే… దక్షిణాఫ్రికా ప్లేయర్లను హత్తుకుని ఓదార్చారు… అపూర్వం… విజయం అంటే ట్రోఫీ లిఫ్ట్ చేయడం కాదు, హృదయాలను గెలవడం..! ఓ మిత్రుడు అన్నట్టు… అమ్మాయిలు కదా, అలాగే ఉంటారు అని…

స్మృతి మంధాన, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్… దక్షిణాఫ్రికా ప్లేయర్లను ఓదారుస్తున్న దృశ్యాలు అపురూపం… గేమ్ రిజల్ట్ వచ్చేవరకు మాత్రమే, తరువాత అందరూ తోటి ప్లేయర్లే..! వావ్, ఎక్సలెంట్ జెశ్చర్ కదా…
ఇదే స్మృతి మంధాన మన స్టార్ ఓపెనర్ గాయాలపాలై ఆటకు దూరమైన ప్రతీకాను వీల్ చైర్ మీద తీసుకొచ్చి సుంబురాల్లో భాగస్వామిని చేసిన తీరు గురించి నిన్న చెప్పుకున్నాం కూడా… మన వుమెన్ జట్టుకు ఈ ట్రోఫీకి సంబంధించి ఎన్ని సువిశేషాలో కదా…
సరే, గొప్ప స్పోర్ట్స్‌వుమెన్ స్పిరిట్ అంటున్నారు కదా… మరి పాకిస్థానీ ప్లేయర్లు దగ్గరకొచ్చి మరీ షేక్ హ్యాండ్ ఇవ్వజూపినా… నిర్లిప్తంగా తిరస్కరించడం ఏం స్పిరిట్ అనే ప్రశ్న కూడా వస్తోంది… కానీ ఈ ఫీలింగ్ వేరు… అది ధూర్తదేశం, టెర్రరిస్టుల సపోర్టింగ్ దేశం… బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని మన ప్లేయర్లు ధిక్కరించలేరు, వ్యక్తులుగా కూడా పాకిస్థాన్ అంటే ఆగ్రహం సరేసరి… సహేతుకం…
మరి పాకిస్థాన్ ప్లేయర్లు ఏం చేశారు అంటారా..? మెన్ పాక్ క్రికెటర్లు విద్వేష వ్యాఖ్యలు చూస్తూనే ఉన్నాం, ఆపరేషన్ సిందూర్‌కు వ్యతిరేకంగా వీథుల్లోకొచ్చి ప్రదర్శనలు చేసినవాళ్లూ ఉన్నారు… మరి అలాంటప్పుడు అసలు పాకిస్థాన్ జట్టుతో ఆటనే అవాయిడ్ చేసి ఉండాల్సింది కదా… ఇదే కదా మీ ప్రశ్న…
నేనూ అంగీకరిస్తాను… అవాయిడ్ చేసి ఉండాల్సింది… నెత్తురు, నీరు ఒకే కాలువలో ప్రవహించలేవు… వేరు చేయాల్సిందే..!! బీసీసీఐ వాదనలన్నీ విఫల సమర్థనలే… దేశంలో ఒక్కడినీ కన్విన్స్ చేయలేవు ఆ వాదనలు..!!
Share this Article