.
ఆఫ్టరాల్ ఒక టీ20 మ్యాచ్… ఇలాంటి మ్యాచుల్లో గెలుస్తూ ఉంటాం, ఓడిపోతూ ఉంటాం… ఓ ఆట, అంతే… ఆస్ట్రేలియాతో ఈరోజు ఇండియా మ్యాచ్ ఓడిపోయాక ఓ మిత్రుడి వ్యాఖ్య, పోస్టు ఇది…
కానీ… అదే ఆస్ట్రేలియా, అదే ఇండియా… నిన్న దేశం హోరెత్తిపోయింది అమ్మాయిల పట్టుదల, ఆటతీరు, ఎదురుదాడి చూసి.,. ఆటలో, వ్యూహంలో టెక్నిక్ కూడా… ప్రత్యేకించి పెద్దగా ఎవరూ ఆశలు పెట్టుకోని మ్యాచ్… అందులోనూ తరచూ విఫలమవుతున్న జెమీమా రోడ్రిగ్స్…
Ads
కానీ గెలిచారు, ప్రపంచ కప్ ఫైనల్లో నిలిచారు… ఓ స్పూర్తిదాయ గెలుపు అది… చిన్నచూపుకి గురయ్యే మహిళల క్రికెట్‌కు ఇది కొత్త ఊపిరి… సీన్ కట్ చేస్తే… పూర్తి భిన్నమైన, అధ్వానమైన ఆట ఈరోజు మెన్స్ జట్టు నుంచి…
ఎస్, ఆడుతుంటాం, ఓడుతుంటాం, గెలుస్తుంటాం కానీ… నిన్నటి హోరు ఒక్కసారిగా చల్లారిన ఫీల్… పొంగు చట్టున నేలకు దిగినట్టు… టపటపా వికెట్లు పడుతూ… ఒక్క అభిషేక్ శర్మ, కొంతవరకు హర్షిత్ రాణా తప్ప అందరూ ఫెయిల్… కుదురుగా కాసేపు క్రీజులో ఉందామనే ధోరణి టీ20 లో కుదరదు… కానీ నిర్లక్ష్యంగా ఆడి వికెట్లు పారేసుకోవడం మాత్రం సగటు ఇండియన్ క్రికెట్ ప్రేమికుడికి ఏమాత్రం నచ్చలేదు… ఓడిన తీరే బాగాలేదు…
ఎంత హాస్యాస్పదం అంటే, చివరలో వచ్చిన బుమ్రా.,. అంతకుముందే క్రీజులో ఉన్న వరుణ్ చక్రవర్తి… ఒకటే బాల్… కనీసం ఒక పరుగు వస్తుందాలేదానే సోయి బుమ్రాకు లేదు… బుమ్రా పరుగు ప్రారంభించినాా అస్సలు కదలని వరుణ్ చక్రవర్తి… అంత పేలవమైన సమన్వయం…
ఈ ఉదాహరణ ఎందుకంటే..? దాదాపు అందరూ అలాగే వికెట్లు పారేసుకున్నారు… మరోవైపు ప్రొఫెషనల్ టీమ్ ఆస్ట్రేలియా గుడ్ ఫీల్డింగ్, క్యాచులు, బౌలింగ్ కనబరిచింది… అంతేకాదు… 13.2 ఓవర్లలోనే 126 పరుగుల తేలికపాటి లక్ష్యాన్ని ఉఫ్ అని ఊదిపారేసింది… వాళ్ల ఆటతీరు చూస్తుంటే అంతకు డబుల్ లక్ష్యమైనా సరే కొట్టిపారేసేవాళ్లు…
మాథ్యూ షార్ట్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన బుమ్రా బంతి మినహా మన బౌలర్ల బౌలింగులో కూడా మెరుపుల్లేవు… టిమ్ డేవిడ్‌ను వరుణ్ కాట్ అండ్ బౌల్డ్ ఔట్ చేసిన బంతి కూడా కొంత నయం…
మరీ హర్షిత్ రాణా, కులదీప్ అయితే ఏకంగా 13.5 సగటు రన్స్ ధారాళంగా ఇచ్చిపారేశారు… ప్చ్… అమ్మాయిలే నయంరా బాబూ… ఎంత వివక్షను, ఎంత పక్షపాతాన్ని ఎదుర్కుంటున్నా సరే… అంతటి ప్రొఫెషనల్ టీమ్ ఆస్ట్రేలియాకు ఇచ్చిపడేశారు..!!
Share this Article