Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిజమే – పాస్‌పోర్టు మాత్రమే పౌరసత్వం కాదు – ఇవీ అసలు నిజాలు

June 25, 2026 by M S R

.

Pardha Saradhi Upadrasta …. మళ్లీ పౌరసత్వానికి పాస్‌పోర్ట్ ఒక్కటే చాలదు అని విదేశాంగ శాఖ చెప్పిందంటూ మొదలుపెట్టారు లొల్లి. రెండు రోజులకు ఒకసారి ఏదో ఒక విషయం పట్టుకొస్తారు.
పౌరసత్వం అంటే ఎప్పుడూ ఒక్క డాక్యుమెంట్‌తో నిరూపించేది కాదు. అది రాజ్యాంగం, చట్టాల ప్రకారం నిర్ణయించబడే అంశం.
భారత పౌరసత్వం ప్రధానంగా ఐదు విధాలుగా లభిస్తుంది. వాటి రకాన్ని బట్టి ప్రభుత్వం ఇచ్చే పౌరసత్వ పత్రాలు కూడా మారిపోతాయి.

1️⃣ Citizenship by Birth (జననం ద్వారా)
ప్రత్యేకంగా “Citizenship Certificate” జారీ చేయరు. జనన నమోదు (Birth Certificate), చట్టపరమైన అర్హతలతో పౌరసత్వం స్వయంగా లభిస్తుంది. అంటే కొన్ని పత్రాల కలయికతో పౌరసత్వాన్ని నిర్ధారిస్తారు. ఏ సందర్భంలో ఏ ఆధారాలు అవసరమో రాజ్యాంగం, Citizenship Act, 1955 మరియు సంబంధిత నియమాల్లో పేర్కొనబడ్డాయి.
మనలో మెజారిటీ భారతదేశంలో పుట్టడం ద్వారా by default ఈ కోటాలోనే పౌరసత్వం పొందాం.

Ads

2️⃣ Citizenship by Descent (వంశపారంపర్యం ద్వారా)
సాధారణంగా ప్రత్యేక పౌరసత్వ సర్టిఫికేట్ ఉండదు. విదేశాల్లో జన్మించినట్లయితే భారత రాయబార కార్యాలయంలో నమోదు చేసిన రికార్డులు అధికారిక ఆధారంగా ఉంటాయి.
తల్లి లేదా తండ్రి భారత పౌరులైతే, చట్టంలోని వర్తించే నిబంధనల ప్రకారం వారి పిల్లలకు ఈ విధంగా పౌరసత్వం లభిస్తుంది.
ఉదాహరణకు…: అమెరికాలో జన్మించిన అఖిల్ అక్కినేని భారతీయ తల్లిదండ్రులకు జన్మించినందున, వర్తించే చట్టాల ప్రకారం వంశపారంపర్య పౌరసత్వానికి ఉదాహరణగా చెప్పబడతారు.

3️⃣ Citizenship by Registration (నమోదు ద్వారా)
భారత ప్రభుత్వం Certificate of Registration జారీ చేస్తుంది. ఇదే తుది పౌరసత్వ పత్రం.
ఉదాహరణకు కొంతమంది భారత పౌరసత్వాన్ని కోరుతూ దరఖాస్తు చేసుకుంటారు లేదా చట్టం ప్రకారం అర్హత సాధిస్తారు. ఆ సందర్భంలో ప్రభుత్వం పౌరసత్వ పత్రం జారీ చేస్తుంది.
ఉదాహరణకు సోనియా గాంధీ. ఇటలీ దేశస్థురాలైన ఆమె, భారత పౌరుడైన రాజీవ్ గాంధీని వివాహం చేసుకున్న తర్వాత, భారతదేశంలో నిర్దేశిత కాలం నివసించి, Section 5(1)(c) కింద నమోదు ద్వారా భారత పౌరసత్వం పొందారు.

4️⃣ Citizenship by Naturalisation (సహజీకరణ ద్వారా)
భారత ప్రభుత్వం Certificate of Naturalisation జారీ చేస్తుంది. ఇదే తుది పౌరసత్వ పత్రం.
ఉదాహరణకు పాకిస్తాన్ గాయకుడు అద్నాన్ సామీ భారత ప్రభుత్వం జారీ చేసిన Certificate of Naturalisation ద్వారా భారత పౌరుడయ్యారు. మదర్ తెరెసా కూడా. ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.

5️⃣ Citizenship by Incorporation of Territory (భూభాగం విలీనం ద్వారా)
వ్యక్తిగత సర్టిఫికేట్ సాధారణంగా జారీ చేయరు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసే గెజిట్ నోటిఫికేషన్ లేదా ఆదేశాల ద్వారా ఆ ప్రాంత ప్రజలకు భారత పౌరసత్వం వర్తిస్తుంది.
ఉదాహరణలు…
– గోవా భారతదేశంలో విలీనమైన తర్వాత అక్కడి అర్హులైన నివాసితులు భారత పౌరులయ్యారు.
– సిక్కిం భారతదేశంలో విలీనమైన తర్వాత అక్కడి అర్హులైన నివాసితులకు భారత పౌరసత్వం వర్తించింది.

ఇక్కడ ముఖ్యమైన విషయం…:
భారతదేశంలో జననం ద్వారా లేదా వంశపారంపర్యం ద్వారా పౌరసత్వం పొందిన వారికి ప్రత్యేక “Citizenship Certificate” ఉండదు. వారు అవసరాన్ని బట్టి వివిధ ఆధార పత్రాల కలయికను చూపించాల్సి ఉంటుంది.
అయితే Registration, Naturalisation ద్వారా పౌరసత్వం పొందిన వారికి మాత్రం భారత ప్రభుత్వం అధికారికంగా Certificate of Registration లేదా Certificate of Naturalisation జారీ చేస్తుంది.

ప్రతి రకమైన పౌరసత్వానికి అవసరమైన పత్రాలు ఒకేలా ఉండవు. వ్యక్తి ఏ విధంగా భారత పౌరసత్వం పొందాడనే దానిపై ఆధారపడి, సమర్పించాల్సిన ఆధార పత్రాలు మారుతాయి.
కాబట్టి “పాస్‌పోర్ట్ ఒక్కటే పౌరసత్వానికి తుది ఆధారం కాదు” అనే విషయాన్ని విదేశాంగ శాఖ ప్రస్తావించింది రాజ్యాంగం ప్రకారం నిజమే. పౌరసత్వం నిర్ధారణ అనేది వర్తించే చట్టాలు, సంబంధిత పత్రాలు , ప్రతి కేసు వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది.

రాజ్యాంగం, Citizenship Act, 1955 , సంబంధిత నియమాలను అర్థం చేసుకుంటే ఇలాంటి విషయాలపై అనవసర గందరగోళం ఉండదు. — ఉపద్రష్ట పార్ధసారధి

#IndianConstitution #Citizenship #IndianLaw #Awareness #PardhaTalks

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిజమే – పాస్‌పోర్టు మాత్రమే పౌరసత్వం కాదు – ఇవీ అసలు నిజాలు
  • Faima register marriage – ఆ పటాస్ ప్రవీణ్, ఈ ప్రేమ ప్రవీణ్ వేర్వేరుట!
  • అంతరిక్ష శోధనల్లో కొత్త చరిత్ర – ‘ఒక కాంతి రోజు’ ప్రయాణం
  • తెలంగాణ ప్రయోజనాల్ని ‘తుంగ’లో తొక్కిందెవరు హరీష్ సాబ్..?!
  • ఆ శవం చివరి కోరిక గెలిచింది – ఎట్టకేలకు మార్చురీని వీడింది
  • నిజంగానే NDA నుంచి CBN మళ్లీ బయటికి రావాలనుకున్నాడా?
  • అక్కడ వేటూరి రాసింది తప్పే! అన్వయం కుదరని ఓ శబ్దగారడీ!
  • సాయిబాబా శివస్వరూపుడా? ఇది సనాతన సమర్థనీయమేనా?
  • సాయిబాబాకు ఆనం పొర్లుదండాలు దేనికి? వణికిపోవడం దేనికి?
  • సాయిబాబా గుడి సర్వమత వేదికా? చాదర్‌ఘాట్ కేసు ఏమంటోంది?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions